అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' వచ్చేస్తోంది
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' వచ్చేస్తోంది
Published Wed, Aug 2 2017 8:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగ తెరతీయబోతుంది. అమెజాన్ తన వెబ్‌సైట్, యాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రేట్ ఇండియన్ సేల్ తేదీలను కంపెనీ ప్రకటించేసింది. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 9వ తారీఖు అర్థరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 12వ తారీఖు అర్థరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ఎన్నడూ చూడని బ్లాక్ బాస్టర్ డీల్స్ ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అయితే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్-ఓన్లీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకంగా 30 నిమిషాల ముందే టాప్ డీల్స్‌ను ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ప్రారంభించనుంది.
గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ''అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్''ను కూడా అమెజాన్ ఆఫర్ చేయనుంది. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ పే బ్యాలెన్స్‌లో అదనంగా 15 శాతం క్యాష్ బ్యాక్ అంటే 300 రూపాయల వరకు తగ్గింపును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. అంతేకాక అమెజాన్.ఇన్‌లో అప్పీరల్, స్టోరేజ్, హోమ్ వాటిపై ఇన్‌స్టాంట్ 10-15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్‌లో అందించనున్నారు. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, యూఎస్‌బీ, ప్యూమా, అదిదాస్, రాంగ్లర్, టైటాన్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అమెరికన్ టూరిస్టర్, బీపీఎల్, మైక్రోమ్యాక్స్, టీసీఎల్, లెనోవో, హెచ్‌పీ, ఐఎఫ్‌బీ, మెకాఫీ వంటి బ్రాండులపై బ్లాక్ బాస్టర్ డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా యాప్‌లో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్, వెబ్‌సైట్‌లో కొనుగోలుచేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్‌ను అమెజాన్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. యాప్‌లో కొనుగోలు చేసే కస్టమర్లకు ఖరీదైన పెయిడ్ ట్రిప్స్ వంటి వాటిలో అద్భుతమైన ట్రావెల్ ఆఫర్లను అందించబోతుంది. అన్ని ఈమెయిల్ గిఫ్ట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, పాంటాలూన్స్, జోయలుక్కాస్ నుంచి గిఫ్ట్‌కార్డులపై 20 శాతం తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేయనుంది.
Advertisement