అమెజాన్లో మళ్లీ డిస్కౌంట్ల పండుగ
అమెజాన్లో మళ్లీ డిస్కౌంట్ల పండుగ
Published Mon, Jan 16 2017 2:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతేటా ప్రకటించే డిస్కౌంట్ల ఉత్సవం మళ్లీ ప్రారంభం కాబోతుంది. 2017 జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించనున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2017 ఏడాదిలో మొదట ప్రారంభం కాబోతున్న మెగా డిస్కౌంట్ సేల్ ఇదే కావడం విశేషం. భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. పాపులర్ బ్రాండ్స్పై గ్రేట్ డీల్స్ ఉంటాయని అమెజాన్ ఇండియా తెలిపింది. సుమారు 100కు పైగా కేటగిరీల్లో 95 మిలియన్లకు పైగా ఉత్పత్తులను షాపింగ్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించనున్నట్టు అమెజాన్ పేర్కొంది.. వెనువెంటనే డెలివరీ సిస్టమ్ను కూడా అందించనున్నట్టు వెల్లడించింది.
వినియోగదారులకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం ఈ సంస్థ ముందస్తు ప్రణాళికలు కూడా వేసుకుంటోంది. తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా లాజిస్టిక్స్లో ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. తాము కల్పించే వేల కొద్దీ ఈ సీజనల్ అవకాశాలు, వారి దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధికి ఎంతో దోహదం చేయనున్నాయని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం రిక్రూట్ మెంట్ ప్రక్రియ నడుస్తుందని, అప్కమింగ్ సేల్కు వారికి ట్రైనింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ వంటి వాటిపై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనుంది.
Advertisement
Advertisement