Temporary Jobs
-
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
లోక్‌సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు. డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, అనలిటిక్స్‌లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గిగ్ వర్కర్ల కోసం.. టెక్ మహీంద్రా ‘పాప్యులై’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్‌సోర్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్క్రిప్షన్, డేటా అనోటేషన్ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ మహీంద్రా బిజినెస్ హెడ్ (బిజినెస్ ప్రాసెస్ సరీ్వసెస్) బీరేంద్ర సేన్ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్‌ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్‌ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్ చెప్పారు. అలాగే గిగ్ నిపుణులు టాప్ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. -
గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 50వేల ఉద్యోగాలు.. నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! పండుగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్సర్, భోపాల్, రాయ్‌పూర్‌లలో కూడా ఎక్కువగా ఉండనుంది. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ వేతనం వివరాలు.. నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు & కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
తాత్కాలిక పనివారికి డిమాండ్ !
ముంబై: పండుగల నేపథ్యంలో తాత్కాలిక పనివారు, ఉద్యోగుల కోసం నియామకాలు పెరిగాయి. మూడవ త్రైమాసికంలో నియామకాలు 400 శాతం వృద్ధి చెందాయి. ‘ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపారాలు పూర్తి స్థాయిలో నడవలేదు. దీంతో వృద్ధి నమోదు కాలేదు. ఏప్రిల్–జూన్ నుంచి సానుకూల వాతావరణం మొదలైంది. మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు త్వరితగతిన నియామకాలు పూర్తి చేసే క్రమంలో తాత్కాలిక పనివారు, సిబ్బందికి భారీ డిమాండ్ ఉంది. ఎడ్టెక్, ఫిన్‌టెక్, మొబిలిటీ, ఈ–కామర్స్, ఫుడ్‌టెక్, రిటైల్ రంగాల్లో బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, మార్కెటింగ్, ఆన్‌బోర్డింగ్, ఆడిటింగ్, రిటైల్, వేర్‌హౌజ్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ప్రధానంగా డిమాండ్ ఉంది.జనవరి–జూన్‌తో పోలిస్తే మూడవ త్రైమాసికంలో వీరి వేతనాలు 1.25–1.5 రెట్లు అధికం అయ్యాయి’ అని క్వెస్ కార్ప్ అనుబంధ కంపెనీ టాస్‌్కమో కో–ఫౌండర్ ప్రశాంత్ జానాద్రి తెలిపారు. ఈ–కామర్స్ రంగంలోనే సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో సుధాకర్ బాలకృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుత త్రైమాసికంలో చాలా కంపెనీలు నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయన్నారు. ఈ–కామర్స్ రంగంలో 50 శాతం, ఈ–ఫార్మా, సరుకు రవాణా 30–40, ఫుడ్ డెలివరీలో 50 శాతం రిక్రూట్మెంట్ పెరగనుందని చెప్పారు. -
ఒప్పంద కార్మికులకు పెరిగిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒప్పంద కార్మికుల కోసం డిమాండ్ పెరిగిందని ఉద్యోగావకాశాలను తెలియజేసే పోర్టల్ ఇండీడ్ వెల్లడించింది. ఇండీడ్ నివేదిక ప్రకారం.. 2019తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూలై మధ్య ఉద్యోగార్థుల నుంచి ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగాలు కావాలన్న అభ్యర్థనలు 150 శాతం పెరిగాయి. అలాగే ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ప్రకటనలు 119 శాతం అధికమయ్యాయి. ఒక్క జూలై నెలలో ఇండీడ్ వేదికగా ఒప్పంద ఉద్యోగాల కోసం చేసిన అన్వేషనలు మూడు రెట్లు పెరిగి 207 శాతం వృద్ధి సాధించాయి. మెయింటెనెన్స్ పర్సన్స్, సర్వీస్ ఇంజనీర్స్ కోసం (ఇన్స్టాలేషన్ విభాగం) డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ విభాగం 128 శాతం వృద్ధి సాధించింది. ఉద్యోగ ప్రకటనలు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ విభాగంలో 43 శాతం, మీడియా 28, మార్కెటింగ్ 18.5, సేల్స్ 12, అడ్మినిస్ట్రేషన్‌లో 4 శాతం పెరిగాయి. మేనేజ్మెంట్ 0.8 శాతం, అకౌంటింగ్ 36.5, ఎడ్యుకేషన్ 38 శాతం మైనస్‌లోకి వెళ్లాయి. -
20 వేల ఉద్యోగాలు: హైదరాబాద్‌లో ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆదివారం పేర్కొంది. హైదరాబాద్ సహా పది నగరాల్లో ఈ ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుంది. కస్టమర్ సర్వీస్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి పాస్ అయి ఉండాలని అమెజాన్ ఇండియా డైరెక్టర్(కస్టమర్ సర్వీస్) అక్షయ్ ప్రభు తెలిపారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలన్నారు. అభ్యర్థుల పనితీరు, కంపెనీ అవసరాల ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన మార్చుతామని తెలిపారు. సెలవు సీజన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో కస్టమర్ల ఆన్లైన్ షాపింగ్ వినియోగం మరింత పెరుగుతందని ఆయన అంచనా వేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు నేరుగా బయట అడుగు పెట్టడానికే బయటపడుతున్నారు. దీంతో ప్రతిదానికి ఆన్లైన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 50 వేల సిబ్బందిని నియమించుకుంటామని అమెజాన్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. (లాక్డౌన్ సడలింపులు : అమెజాన్ గుడ్ న్యూస్ -
సైన్యంలో ‘పరిమిత’ సేవ!
దేశ సైనిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నం చాన్నాళ్లుగా జరుగుతోంది. అందు కోసం వస్తున్న వివిధ రకాల ప్రతిపాదనల్లో కేంద్ర ప్రభుత్వం చివరకు దేనిని ఆమోదిస్తుందన్న సంగతలావుంచితే, తాజాగా వచ్చిన ప్రతిపాదనొకటి ఆసక్తికరమైనది. సైన్యంలో చేరాలని ఉత్సాహం చూపే యువతకు పరిమిత కాలంపాటు... అంటే మూడేళ్లపాటు అవకాశమివ్వడం ఈ ప్రతిపాదన సారాంశం. చెప్పాలంటే ఇదొకరకమైన ఇంటర్న్‌షిప్. దీన్ని ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (టీఓడీ) గా ప్రతి పాదనలో ప్రస్తావించారు. చొరవ, ఉత్సాహం, ఉద్వేగం, దేశం కోసం ఏమైనా చేయాలన్న తపన అధికంగా వుండే యువశక్తిని సక్రమంగా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని మన నాయకులు తరచూ అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాల యువతతోనే జాతి ఖ్యాతి పెన వేసుకుని వుంటుందని వివేకానందుడు ఎప్పుడో చెప్పారు. ఏ రకమైన సవాలునైనా స్వీకరించాలని, సాహసకృత్యాలు చేయాలని ఉత్సాహపడేవారు అందుకోసం సైన్యంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరు తుంటారు. అలాగని పూర్తికాలం కొనసాగాలంటే అందరూ సిద్ధపడరు. కుటుంబంపై బెంగ, బంధు వులు, స్నేహితులు వగైరాలకు సంబంధించిన వేడుకల్లో పాల్గొనే అవకాశం కోల్పోవడం వారికి ఇష్టం వుండదు. కనుక పరిమితకాల వ్యవధిలో పనిచేయడానికి అవకాశమిచ్చే టీఓడీ అందరికీ నచ్చు తుందని, ఎంపిక చేసిన కొన్ని పోస్టులకు దీన్ని వర్తింపజేయొచ్చని ప్రతిపాదన చెబుతోంది. సాధారణంగా జవాన్ల సర్వీసుకాలం 17 ఏళ్లు. అంటే ఎక్కువమంది 37, 38 ఏళ్ల వయసు లోపే రిటైర్ కావాల్సివుంటుంది. అప్పటికల్లా వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కళ్లముందు అన్నీ సమస్యలే కనబడతాయి. వచ్చే అరకొర పింఛన్ సరిపోదు. దాంతో వేరే ఉద్యోగం వెదుక్కొ నాల్సివస్తుంది. కానీ ఆ వయసువారికి అదంత సులభం కాదు. సైన్యంలోకి వెళ్లకుండా వేరే పనిలో ప్రవేశిస్తే ఈపాటికల్లా స్థిరపడేవాళ్లమన్న అభిప్రాయం వారిలో ఏర్పడుతుంది. జీవితం నిరాశగా అనిపిస్తుంది. కనుకనే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి రంగాల్లో పనిచేసే జవాన్ల రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచవచ్చన్న ప్రతిపాదన నిరుడు వచ్చింది. అధికారుల స్థాయిలో ఈ సర్వీసు 10 నుంచి 14 ఏళ్లు వుంటుంది. ఆ తర్వాత శాశ్వతంగా కొనసాగదల్చుకుంటే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా వున్నారో లేదో చూసి, సంతృప్తి చెందితే పొడిగిస్తారు. అటు జవాన్లకైనా, ఇటు సైనికా ధికారులకైనా ఇచ్చే శిక్షణ, అలవెన్సులు, గ్రాట్యుటీ వగైరాలు లెక్కేస్తే వారిపై పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. కోట్ల రూపాయల్లో వుండే ఈ మొత్తంతో పోలిస్తే టీఓడీ పథకం కింద మూడేళ్లపాటు సర్వీ సులో కొనసాగేందుకు అనుమతిస్తే ఒక్కొక్కరిపై పెట్టే వ్యయం రూ. 80 నుంచి 85 లక్షల మధ్య అవుతుందని ఈ ప్రతిపాదన చెబుతోంది. సారాంశంలో సైన్యానికి బాగా ఆదా అవుతుంది. టీఓడీ ప్రతిపాదన ఈమధ్య దేశంలో జాతీయవాదం, దేశభక్తి పునరుజ్జీవం పొందాయని చెబు తోంది. ఈ భావోద్వేగాలున్నవారిని ఈ పథకం కింద సైన్యం వైపు మళ్లిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరిస్తోంది. అయితే కేవలం అలాంటి భావోద్వేగాలనే ప్రాతిపదికగా తీసుకోవడం కాక, సైన్యానికి ప్రాథమికంగా కావలసిన ఇతరేతర అర్హతలున్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పేరిట సమస్యలు సృష్టించినవారు లేకపోలేదు. ఆస్ట్రియా, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల్లో యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి. జర్మనీలో నిర్బంధ సైనిక శిక్షణ దాదాపు 55 ఏళ్లపాటు అమల్లోవుంది. ఆ నిబంధన ప్రకారం కనీసం ఆర్నెల్లు ప్రతి ఒక్కరూ సైన్యంలో పని చేయాల్సివచ్చేది. అయితే 2011లో ఇది రద్దయింది. ఆస్ట్రియాలో 35 ఏళ్లలోపు పురుషులంతా తప్పనిసరిగా ఆర్నెల్లు సైన్యంలో పనిచేయాలి. ఇజ్రాయెల్‌లో అయితే 18 ఏళ్లున్న యువతీయువకులు సైన్యంలో పనిచేయాలి. యువకులు రెండుసంవత్సరాల ఎనిమిది నెలలు, యువతులు రెండేళ్లు పనిచేసి తీరాలి. అవసరాన్నిబట్టి యువతీయువకులిద్దరికీ ఎనిమిది నెలలచొప్పున పొడిగిస్తారు. మన దేశంలో అలాంటి నిబంధనలేవీ లేవు. కానీ టీఓడీ ప్రతిపాదన అమలైతే సైన్యంలోకి వచ్చేవారి సంఖ్య గణనీయంగానే వుంటుందని చెప్పాలి. ఇందువల్ల యువతకు కలిగే లాభాలు చాలానే వుంటాయి. సాహసకృత్యాలపైనా, సవాళ్లను ఎదుర్కొనడంపైనా తమలో వున్నది కేవలం మోజు, ఆకర్షణ మాత్రమేనా లేక పట్టుదల కూడా వుందా అనేది శిక్షణలో తేలిపోతుంది. సైన్యంలో వరుసగా మూడేళ్లపాటు కొనసాగడం వల్ల అలవడే క్రమశిక్షణ వారు మెరుగైన పౌరులుగా రూపొందడానికి ఉపయోగపడుతుంది. నచ్చిన వృత్తి ఎన్నుకోవడానికి, ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించడానికి లేదా మరేదైనా కోర్సు చేయడానికి వారికి కావలసినంత సమయం వుంటుంది. 25–30 ఏళ్ల వయసు వచ్చేలోపే తిరిగి పౌర ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు గనుక సైన్యంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నైశిత్యం, అలవాట్లు వారి తదుపరి జీవితాన్ని నిర్దేశిస్తాయి. నిండైన ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేసే స్వభావం ఏర్పడతాయి. వీరి విషయంలో కార్పొరేట్ సంస్థలు ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉందని ప్రతిపాదన పత్రం చెబుతోంది. మన రక్షణ రంగ వ్యయం అత్యధికం సైనిక దళాలకు కల్పించే సౌకర్యాలు, జీతభత్యాలు వగైరాలకు ఖర్చవుతుంది. అత్యాధునిక ఉపకరణాలు, ఆయుధాలు వగైరా కొనాలంటే 20–25 శాతం మించి వ్యయం చేయడం కుదరడం లేదు. దానికితోడు రాను రాను యుద్ధాల స్వభావం మారుతోంది. వర్తమానంలో భారీ సంఖ్యలో వుండే సిబ్బందికి బదులు, అన్నిటా వినియోగపడే స్మార్ట్ సైనికుల అవసరమే ఎక్కువగా వుంటుంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూనే కంప్యూటర్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వినియోగించగలిగే సామర్థ్యం వున్నవారిని రూపొం దించుకొనక తప్పదు. కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ తాజా పథకం అందుకు తోడ్పడగలదా అన్నది సందేహమే. -
ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!
న్యూఢిల్లీ: ఆసక్తి ఉన్న యువకులు, ఇతర యువ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన సైనికులుగా చేర్చుకునే సంచలన ప్రతిపాదనపై ఆర్మీ కసరత్తు చేస్తోంది. యుద్ధ పోరాట దళాలు సహా పలు విభాగాల్లో ఆఫీసర్, ఇతర హోదాల్లో మూడేళ్ల కాలపరిమితితో వారిని చేర్చుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. యువకులకు సైనిక జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు సైన్యాన్ని ప్రజలకు దగ్గర చేసే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు. ‘ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. రెగ్యులర్ సెలక్షన్‌లాగానే ఉంటుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనిక సిబ్బందిని ఎంపిక చేసే అవకాశముంది. అయితే, ముందుగా ఈ ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు. ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ లేదా ‘త్రీ ఈయర్ షార్ట్ సర్వీస్’ రిక్రూట్మెంట్ కార్యక్రమంలో ఏ వయసు వారిని పరిగణనలోకి తీసుకోవాలి? ఫిట్నెస్ స్థాయిలు ఎలా ఉండాలి? తదితర కీలక అంశాలపై కసరత్తు సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం జాతీయ వాదం, దేశభక్తి ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో కాకుండా, తాత్కాలికంగా సైన్యంలో చేరాలనుకుంటున్న యువకులు లక్ష్యంగా ఈ పథకం రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నాయి. త్వరలో ఆర్మీ ఉన్నతస్థాయి కమాండర్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో దీనిపై లోతుగా చర్చించనున్నట్లు వెల్లడించాయి. ఈ స్కీమ్‌లో రిక్రూట్ చేసుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లాంటి సౌకర్యాలేవీ ఉండవు కనుక ఆర్థికంగా ఇది లాభదాయకమని ఆర్మీ భావిస్తోందన్నాయి. పారామిలటరీ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) నుంచి ఆసక్తి ఉన్నవారిని ఏడేళ్ల కాలపరిమితిలో సైన్యంలో చేర్చుకునే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది. తర్వాత∙వారు పాత సర్వీస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితితో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద యువతను ఆర్మీ రిక్రూట్ చేసుకుంటోంది. ఆ కాలపరిమితిని 14 ఏళ్ల వరకు పెంచవచ్చు. (కేంద్రం చేతికి విద్యుత్ రంగం) -
అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత
సాక్షి, ముంబై : దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు మారుతి సుజుకి రాయిటర్స్ కిచ్చిన సమాచారంలో వెల్లడించింది. చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ, వ్యాపార మందగమనం నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలకు కూడా ఇదే కారణమన్నారు. అయితే భవిష్యత్తులో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేయనున్నారనే దానిపై వివరాలు ఇవ్వలేదు. ఈ తిరోగమనం కొనసాగితే మార్జినల్, వీక్ కంపెనీలు మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు. జూన్ 30 తో ముగిసిన ఆరు నెలల్లో సగటున 18,845 మంది తాత్కాలిక కార్మికులను నియమించినట్లు మారుతి సుజుకి రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం లేదా 1,181 తగ్గిందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోత పెరిగిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో పాసెంజర్ వాహన విక్రయాల్లో టాప్‌లో ఉండే మారుతి సుజుకి, జూలై, 2018 తో పోలిస్తే, ఈ ఏడాది జూలైలో (33.5 శాతం) అమ్మకాలు 109 265 యూనిట్లకు పడిపోయాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఉత్పత్తిని 10.3 శాతం తగ్గించామని గతంలో సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఉత్పాదక ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకున్న ఆటో మొబైల్ రంగం దాదాపు ఒక దశాబ్దం కాలంగా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. వాహన అమ్మకాలు కూడా అంతే వేగంగా పడిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిరుద్యోగ గణాంకాలు పాతవని, విశ్వసనీయత లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగి జులై నాటికి 7.51 శాతానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం ఇది 5.66 శాతంగా ఉండేదని సీఎంఐఈ తెలిపింది. వీరిలో రోజువారీ కూలీలను కలపలేదు. మారుతి ఉద్యోగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్దీప్ జంఘు మాట్లాడుతూ మానేసర్, గురుగ్రామ్ ప్లాంట్లలో తాత్కాలిక కార్మికుల సగటు వేతనం నెలకు 250 డాలర్లుగా ఉందనన్నారు. కాగా ఈ రెండు ప్లాంట్లు కలిపి సంవత్సరానికి 1.5 మిలియన్లకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థ 1983 లో గురుగ్రామ్ ప్లాంట్ నుంచే తన ప్రసిద్ధ మారుతి 800 మోడల్‌ను విడుదల చేసింది. ఆటోరంగ అమ్మకాల తిరోగమనం పరిశ్రమ అంతటా ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) మాట్లాడుతూ, ఈ తిరోగమనం కొనసాగితే విడిభాగాల తయారీదారులు తమ 5 మిలియన్ల మంది కార్మికుల్లో 5వ వంతును తగ్గించుకోవచ్చని పేర్కొంది. -
అమెజాన్‌లో మళ్లీ డిస్కౌంట్ల పండుగ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతేటా ప్రకటించే డిస్కౌంట్ల ఉత్సవం మళ్లీ ప్రారంభం కాబోతుంది. 2017 జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించనున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2017 ఏడాదిలో మొదట ప్రారంభం కాబోతున్న మెగా డిస్కౌంట్ సేల్ ఇదే కావడం విశేషం. భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. పాపులర్ బ్రాండ్స్‌పై గ్రేట్ డీల్స్ ఉంటాయని అమెజాన్ ఇండియా తెలిపింది. సుమారు 100కు పైగా కేటగిరీల్లో 95 మిలియన్లకు పైగా ఉత్పత్తులను షాపింగ్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించనున్నట్టు అమెజాన్ పేర్కొంది.. వెనువెంటనే డెలివరీ సిస్టమ్‌ను కూడా అందించనున్నట్టు వెల్లడించింది. వినియోగదారులకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం ఈ సంస్థ ముందస్తు ప్రణాళికలు కూడా వేసుకుంటోంది. తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా లాజిస్టిక్స్‌లో ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. తాము కల్పించే వేల కొద్దీ ఈ సీజనల్ అవకాశాలు, వారి దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధికి ఎంతో దోహదం చేయనున్నాయని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం రిక్రూట్ మెంట్ ప్రక్రియ నడుస్తుందని, అప్‌కమింగ్ సేల్కు వారికి ట్రైనింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ వంటి వాటిపై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనుంది. -
దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు
చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్‌ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో తాత్కాలికంగా అదనపు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నట్టుండి దాదాపు 10,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించనున్నట్టు స్నాప్‌డీల్ పేర్కొంది. ముఖ్యంగా డెలివరీలో ఎలాంటి సమస్యలు రాకుండా, వెనువెంటనే జరిపేటట్టు లాజిస్టిక్ పొజిషన్లలో వీరిని నియమించుకోనుంది. దీపావళి కానుకగా ఈ తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించనున్నట్టు స్నాప్‌డీల్ పేర్కొంటోంది. దీపావళి పండుగ సీజన్ అంతా, అన్ని లాజిస్టిక్ సెంటర్లు 24X7 పనిచేయనున్నట్టు తెలిపింది. ఆర్డర్లు రిసీవ్ చేసుకుని, స్క్రీన్ చేసి, వాటిని డెలివరీ చేసేందుకు ఈ తాత్కాలిక ఉద్యోగులు పనిచేయనున్నారు. ఎస్డీ ప్లస్ సెంటర్లు ఆర్డర్లను ప్రాసెస్‌ను నిరంతరాయం కొనసాగిస్తాయని, అర్థరాత్రి స్వీకరించిన ఆర్డర్లను, తర్వాతి రోజు ఉదయం పూట అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ దీపావళి సీజన్లో కస్టమర్లు ఆర్డరు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ చేసే విధంగా అప్గ్రేట్ కావాలని నిర్ణయించుకున్నట్టు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు. -
వాటర్‌గ్రిడ్‌లో 709 తాత్కాలిక ఉద్యోగాలు
662 వర్క్ ఇన్స్పెక్టర్లు, 47 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులకు ఓకే హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం ఈ మేరకు సర్క్యులర్ జారీచేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47 మంది జూనియర్ అసిస్టెంట్లను, 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను సర్కారు ఆదే శించింది. ఉద్యోగాలకు అర్హతలు ఇలా.. ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం డిప్లొమా అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26 పోస్టులను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెగ్యులర్ ఇంజనీర్ల వాహనాలకు అదనపు ఇంధనాన్ని ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు నెలవారీగా ఉన్న 160 లీటర్ల పరిమితిని 250 లీటర్లకు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.