న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్‌సోర్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్‌క్రిప్షన్, డేటా అనోటేషన్ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్ అందుబాటులో ఉంటుంది.
తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ మహీంద్రా బిజినెస్ హెడ్ (బిజినెస్ ప్రాసెస్ సరీ్వసెస్) బీరేంద్ర సేన్ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్‌ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్‌ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్ చెప్పారు. అలాగే గిగ్ నిపుణులు టాప్ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment