ముంబై: పండుగల నేపథ్యంలో తాత్కాలిక పనివారు, ఉద్యోగుల కోసం నియామకాలు పెరిగాయి. మూడవ త్రైమాసికంలో నియామకాలు 400 శాతం వృద్ధి చెందాయి. ‘ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపారాలు పూర్తి స్థాయిలో నడవలేదు. దీంతో వృద్ధి నమోదు కాలేదు. ఏప్రిల్–జూన్ నుంచి సానుకూల వాతావరణం మొదలైంది. మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు త్వరితగతిన నియామకాలు పూర్తి చేసే క్రమంలో తాత్కాలిక పనివారు, సిబ్బందికి భారీ డిమాండ్ ఉంది.
ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, మొబిలిటీ, ఈ–కామర్స్, ఫుడ్‌టెక్, రిటైల్ రంగాల్లో బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, మార్కెటింగ్, ఆన్‌బోర్డింగ్, ఆడిటింగ్, రిటైల్, వేర్‌హౌజ్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ప్రధానంగా డిమాండ్ ఉంది.జనవరి–జూన్‌తో పోలిస్తే మూడవ త్రైమాసికంలో వీరి వేతనాలు 1.25–1.5 రెట్లు అధికం అయ్యాయి’ అని క్వెస్ కార్ప్ అనుబంధ కంపెనీ టాస్‌్కమో కో–ఫౌండర్ ప్రశాంత్ జానాద్రి తెలిపారు.
ఈ–కామర్స్ రంగంలోనే సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో సుధాకర్ బాలకృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుత త్రైమాసికంలో చాలా కంపెనీలు నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయన్నారు. ఈ–కామర్స్ రంగంలో 50 శాతం, ఈ–ఫార్మా, సరుకు రవాణా 30–40, ఫుడ్ డెలివరీలో 50 శాతం రిక్రూట్‌మెంట్ పెరగనుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment