రుణాలకు పెరుగుతున్న డిమాండ్ కారణం
టీమ్‌లీజ్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్‌లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్‌లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.
స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్‌ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్‌ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ వివరించింది.
కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ ..
ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్‌లో బీఎఫ్‌ఎస్‌ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్‌లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment