Festive season
-
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్‌ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అమెజాన్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్‌ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్‌ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
82,000పైకి బంగారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పటిష్ట ధోరణికితోడు దేశంలో పండుగల సీజన్ బంగారం ధరకు ఊతం ఇస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర మొదటిసారి రూ.82 వేల మైలురాయిని దాటి రూ.82,400ను తాకింది. మంగళవారం ముగింపుతో పోలి్చతే ఏకంగా రూ.1,000 పెరిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం రూ.1,000 పెరిగి రూ.82,000కు ఎగసింది. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ (రూ.61,200) నుంచి పసిడి ధర ఏకంగా 35 శాతం పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.1,01,000కు ఎగసింది. గడచిన ఏడాది కాలంలో రూ.74,000 నుంచి ఈ మెటల్ విలువ 36 శాతం పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) 20 డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు 2,801.65 డాలర్లను చేరింది. ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతుండడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే దేశీయ ఫ్యూచర్స్‌లో గరిష్ట స్థాయి ధరల్లో పసిడి ట్రేడవుతోంది. -
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త రికార్డ్: పండుగ సీజన్లో..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించినట్లు సమాచారం.కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.ఎక్కువ మంది పండుగ సీజన్లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.సమర్థ్ సేల్ ఈవెంట్పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్లతో పండుగ సీజన్‌ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్లక్షకు పైగా ఉద్యోగాలుపండుగ సీజన్లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్లో ఫ్లిప్‌కార్ట్.. కస్టమర్లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది. -
బీఎఫ్ఎస్ఐలో జోరుగా నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ వివరించింది. కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ .. ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్లో మార్కెట్ డిమాండ్‌కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో బీఎఫ్‌ఎస్‌ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు. -
స్విగ్గీ కొత్త ఫీచర్: విదేశాల్లో ఉంటూనే..
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంస్విగ్గీ గురించి2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది. -
పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు
ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.స్పెషల్ ఎడిషన్స్ ➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు
జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్‌లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.🚨 Swiggy Also Increased Platform Fee To ₹10This Happened Right After Zomato’s HikeFood Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform FeeZomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024 -
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్‌లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ బాల్స్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్‌ప్యాక్‌లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్‌లుక్ వస్తుంది. -
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..ఎంజీ విండ్సర్ ఈవీఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.ఎంజీ కామెట్ ఈవీప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీటాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.టాటా పంచ్ ఈవీదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..సిట్రోయెన్ ఈసీ3ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన జీప్.. పూర్తి వివరాలు
భారతదేశంలో జీప్ కంపెనీ తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కంపాస్ స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 25.26 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. కొత్త కాస్మొటిక్ డిజైన్స్ అన్నీ కూడా దీనిని స్పెషల్ ఎడిషన్ కారుగా గుర్తించడానికి సహకరిస్తాయి.కొత్త జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ బానెట్‌పై డ్యూయల్-టోన్ డికాల్తో పాటు ఆరవ గ్రిల్ స్లాట్‌పై వెల్వెట్ రెడ్ కలర్ ఉండటం చూడవచ్చు. లోపలి భాగంలో కూడా ఎక్కువ భాగం ఎరుపు రంగులోనే ఉండటం చూడవచ్చు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 43000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?కొత్త జీప్ స్పెషల్ ఎడిషన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తప్పా.. ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 350 న్యూటన్ మీటర్ టార్క్, 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
బంగారం, వెండికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు పండుగల డిమాండ్ తోడయ్యింది. ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.200 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.78,300కు చేరింది. స్టాకిస్టులు, రిటైల్ కస్టమర్ల నుంచి పసిడికి డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ పేర్కొంది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.665 ఎగసి రూ.93,165కు చేరింది.మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమోడిటీ మార్కెట్లు బుధవారం పనిచేయని సంగతి తెలిసిందే. నవరాత్రి ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ మెరుగ్గా మారిందని, హిందూ పురాణాల ప్రకారం కొత్త వస్తువులను ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన వారమని వ్యాపారులు తెలిపారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో రూ.200కుపైగా లాభంతో రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ధర రూ.400కుపైగా పెరిగింది. వెండి సైతం రూ.1,000కిపైగా లాభంతో రూ. 92,453 వద్ద ట్రేడవుతోంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్..
పండుగ సీజన్ మొదలవుతోంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించేసాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన రైడర్ 125 మీద తగ్గింపులను ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 84,869కే లభిస్తుంది.టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.2 న్యూటన్ మీటర్ టార్క్, 11.4 హార్స్ పవర్ అందిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఆఫర్స్ అందిస్తున్న కంపెనీల జాబితాలో టీవీఎస్ మాత్రమే కాకుండా.. చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలను పెంచడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటి గురించి పూర్తిగా కనుక్కున్న తరువాత కొనుగోలు చేయడం ఉత్తమం. -
పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్: ఇవి గుర్తుంచుకోండి
దసరా, దీపావళి ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయ్. ఈ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం మొదలుపెట్టేస్తాయి. ఇదే అదనుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు కూడా తమదైన రీతిలో దోచుకోవడానికి సిద్దమైపోతారు. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలి.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా.. అధికారిక వెబ్సైట్లలోనే సెర్చ్ చేయాలి. తక్కువ రేటుకు లభిస్తున్నాయి కదా.. అనుకుని అనధికార వెబ్సైట్లలో బుక్ చేయడం వంటివి చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే డబ్బు చెల్లించిన తరువాత బహుశా డెలివరీ రాకపోవచ్చు. ఒకవేళా వచ్చిన నాణ్యమైనవి వస్తాయనే గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు ఎంచుకునే వెబ్సైట్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మెసేజ్ అలర్ట్ లేదా ఈ-మెయిల్ అలర్ట్.. ఈ పండుగ సీజన్లో గుర్తు తెలియని నెంబర్స్ నుంచి భారీ ఆఫర్స్ అనే విధంగా మెసేజిలు లేదా ఈ మెయిల్ అలర్ట్ వంటివి వస్తుంటాయి. ఇలాంటి వాటికి స్పందించకపోవడమే ఉత్తమం. తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పిన్ నెంబర్ ఉపయోగించడంలో జాగ్రత్త వహించడం.. మీరు ఆన్లైన్ షాపించి చేసేటప్పుడు ఒక్కో పోర్టల్‌కు ఒక్కో పాస్వర్డ్ ఉపయోగించడం ఉత్తమం. అన్ని పోర్టల్‌లకు ఒకటే పాస్వర్డ్ ఉపయోగిస్తే.. ఎవరైనా హ్యాక్ చేసే సమయంలో అన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.సాఫ్ట్వేర్ అప్డేట్స్.. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్లలో మీ డేటాను రక్షించడానికి సులభమైన మార్గాలలో ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం. ఇది మీ డేటా భద్రతకు సహాయపడతాయి. ఇది సైబర్ దాడుల నుంచి కూడా రక్షిస్తుంది. పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ అవసరం ఉంటే తప్ప ఇవ్వకూడదు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఫ్రీ హాట్స్పాట్ల వాడకం.. పబ్లిక్ ప్రదేశాల్లో.. ఉచితంగా అందుబాటులో ఉండే హాట్స్పాట్లను ఉపయోగించే షాపింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. ఇలాంటి సమయంలోనే హ్యాకర్స్ ఎక్కువగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది.యాప్స్ డౌన్లోడ్.. మీకు అవసరమైన లేదా డౌన్లోడ్ చేయాలనుకునే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ వంటి వాటిలో ఉన్నాయా? లేదా? అని నిర్థారించుకోండి. ఎందుకంటే.. కొంతమంది ఫేక్ యాప్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాంటివి డౌన్లోడ్ చేస్తే అనుకోని నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. -
దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' పేర్కొన్నారు.ప్రాజెక్ట్ ఆశ్రయ్అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంఅమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది. -
పండుగల సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు (07442) ప్రత్యేక వారాంతపు రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది. అదే విధంగా శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి (07443) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం నడవనుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది. -
పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!
వరుస పండుగల సీజన్ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్‌తో సందడిగా ఉంటారు. దీనికి తోడు గృహిణులు, కొత్తకోడళ్లు, కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు. మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి. పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే రోజుకు సరిపినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ఒక ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను తాగుతూఉండాలి. అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఫేస్ మాస్క్రోజ్ వాటర్‌తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది. రోజ్ వాటర్‌లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో ప్యాక్ వేసుకొని, ఆ తరువాత ఐస్ ముక్కలతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.కీరా, పైనాపిల్ జ్యూస్కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక పైనాపిల్‌లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.కీర, పైనాపిల్ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై మంగు మచ్చులాంటివి కూడా తగ్గుతాయి. క్యారెట్, బీట్రూట్ యాపిల్ జ్యూస్ (ఏబీసీ)ఆపిల్, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. యాపిల్, క్యారెట్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే బీట్ రూట్ పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకాజంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్ అందుతుంది. అందమైన చర్మం కోసం ఇది చాలా అవసరం. -
దీపావళి ఆఫర్స్.. ఇప్పుడు కొంటే మంచి బెనిఫిట్స్!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ సమయం కోసం ఎదురు చూసే చాలామంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఇప్పటికే ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్ హ్యుందాయ్ వెర్నా - రూ. 30,000 మారుతి సుజుకి డిజైర్ - రూ. 40,000 హోండా అమేజ్ - రూ. 70,000 స్కోడా స్లావియా - రూ. 75,000 ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ - రూ. 80,000 హోండా సిటీ - రూ. రూ. 90,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. -
పండుగల జోష్.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ అక్టోబర్‌లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. డీజిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ తొలి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 1.17 మిలియన్ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు అక్టోబర్ మొదటి భాగంలో 2.99 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో డీజిల్ అమ్మకాలు 5.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు అక్టోబర్ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్..
Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పీఎన్జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. ధరలు పెరుగుతున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు. టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు. ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు. ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్‌కే బంగారం ధరలు! -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్‌లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్‌కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్‌కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్‌కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్‌తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్‌కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్‌షిప్‌లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లగ్జరీ కార్ల అమ్మకాల్లో జోష్.. పండుగల సీజన్‌పై ఆశలు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్‌ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. గతేడాదికి మించి అమ్మకాలు ‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్‌లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్సీ 500 హెచ్‌ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్ఎం మల్టీపర్పస్ వెహికల్‌కు కూడా బుకింగ్‌లు ప్రారంభించనుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్‌యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. -
బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్‌పాడ్స్ కేవలం రూ. 16749కే..
భారత్‌లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో సెకెండ్ జెన్‌పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 16,999 & అమెజాన్‌లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు. ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!! 2022లో విడుదలైన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్‌లో వండర్లస్ట్ ఈవెంట్లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్‌లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.