
ఫరెవర్‌మార్క్ నుంచి రెడ్ కార్పెట్ కలెక్షన్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : డి బీర్స్‌కు చెందిన డైమండ్ బ్రాండ్ ‘ఫరెవర్‌మార్క్’ ఇక్కడి ఎంజీ రోడ్డులోని న్యూ ఆభరణ్ స్టోర్‌లో ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఈ ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. రానున్న పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ కలెక్షన్‌ను ఆవిష్కరించినట్లు ఫరెవర్‌మార్క్ ప్రకటించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఖురేషీ...ఈ కాలం మహిళలు సంప్రదాయిక, ఆధునిక హంగుల మిశ్రమంతో కూడిన ఆభరణాలను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ దిశగా ఫరెవర్‌మార్క్ స్పందిస్తోం దని తన విశ్వాసమని పేర్కొంది. వజ్రాలంటే తనకెంతో ప్రేమ అని, ఈద్ సందర్భంగా వాటిని ధరించడానికి ఇష్టపడతానని వివరించింది.