కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి జియో ఓ శుభవార్త చెప్పింది. 2024 డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య 'జియో పేమెంట్స్ బ్యాంక్' (Jio Payments Bank)లో కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసిన కస్టమర్లకు రూ. 5,000 విలువైన రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.
మెక్‌డొనాల్డ్స్, ఈజ్‌మైట్రిప్(EaseMyTrip), మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) ప్రముఖ బ్రాండ్‌ల కూపన్‌లను.. జియో పేమెంట్స్ బ్యాంక్ రివార్డులలో భాగంగా అందించనుంది. డిజిటల్ ఫస్ట్ విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో కస్టమర్‌లు కేవలం ఐదు నిమిషాలలోపు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే - ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ఆన్‌లైన్ విధానం
➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో జియో మనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి జియో మనీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
➤రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించండి.
➤ధ్రువీకరించిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటు.. ఇతర అవసరమైన సమాచారంతో అప్లికేషన్ ఫామ్‌ను పూరించండి.
➤అప్లికేషన్ ఫామ్ పూరించిన తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
➤తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుని.. మీ ఖాతాను సెటప్ చేయండి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.
ఆఫ్‌లైన్ విధానం
➡సమీపంలోని జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి.. జియో రిప్రెజెంటేటివ్‌ను కలవని.
➡జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేయండి.
➡మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అందివ్వండి.
➡ఇవన్నీ పూర్తయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ధృవీకరించండి.
➡యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి వాటిని సెట్ చేసుకోవడం ద్వారా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.
అవసరమైన డాక్యుమెంట్స్ & అర్హతలు
● జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్) వంటివి అవసరమవుతాయి.
● 18 సంవత్సరాలు నిండి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగిన భారతీయులు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment