న్యూఢిల్లీలో రూ.82,400కు జంప్
అంతర్జాతీయంగా రికార్డు పరుగు
ఔన్స్ రేటు 2,800 డాలర్ల పైకి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పటిష్ట ధోరణికితోడు దేశంలో పండుగల సీజన్ బంగారం ధరకు ఊతం ఇస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర మొదటిసారి రూ.82 వేల మైలురాయిని దాటి రూ.82,400ను తాకింది. మంగళవారం ముగింపుతో పోలి్చతే ఏకంగా రూ.1,000 పెరిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం రూ.1,000 పెరిగి రూ.82,000కు ఎగసింది. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ (రూ.61,200) నుంచి పసిడి ధర ఏకంగా 35 శాతం పెరిగింది.
ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.1,01,000కు ఎగసింది. గడచిన ఏడాది కాలంలో రూ.74,000 నుంచి ఈ మెటల్ విలువ 36 శాతం పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) 20 డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు 2,801.65 డాలర్లను చేరింది. ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతుండడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే దేశీయ ఫ్యూచర్స్‌లో గరిష్ట స్థాయి ధరల్లో పసిడి ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment