all time record
-
జీఎస్టీ వసూళ్ల రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెలలో 9 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోల్చితే) రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఒక నెలలో ఈ స్థాయి వసూళ్లు ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకూ ఆల్‌టైమ్ రికార్డు. దేశీయ అమ్మకాలు, పన్ను పరిధి విస్తృతి తాజా రికార్డుకు కారణమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిఫండ్స్ రూ.19,306 కోట్లుకాగా, మొత్తం అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లలో రూ.19,306 కోట్ల రిఫండ్స్ జరిగాయి. 2023 అక్టోబర్‌తో పోలి్చతే ఇది 18.2 శాతం అధికం. రిఫండ్స్ మినహాయిస్తే, నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా→ మొత్తం వసూళ్లు రూ. 1,87,346 కోట్లు → సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.41,864 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.99,111 కోట్లు → సెస్ రూ.12,550 కోట్లు. -
82,000పైకి బంగారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పటిష్ట ధోరణికితోడు దేశంలో పండుగల సీజన్ బంగారం ధరకు ఊతం ఇస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర మొదటిసారి రూ.82 వేల మైలురాయిని దాటి రూ.82,400ను తాకింది. మంగళవారం ముగింపుతో పోలి్చతే ఏకంగా రూ.1,000 పెరిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం రూ.1,000 పెరిగి రూ.82,000కు ఎగసింది. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ (రూ.61,200) నుంచి పసిడి ధర ఏకంగా 35 శాతం పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.1,01,000కు ఎగసింది. గడచిన ఏడాది కాలంలో రూ.74,000 నుంచి ఈ మెటల్ విలువ 36 శాతం పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) 20 డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు 2,801.65 డాలర్లను చేరింది. ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతుండడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే దేశీయ ఫ్యూచర్స్‌లో గరిష్ట స్థాయి ధరల్లో పసిడి ట్రేడవుతోంది. -
పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!
దీపావళి సమీపిస్తోంది, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరిగిన ధరల కారణంగా గోల్డ్ రూ. 80వేలకు చేరువయ్యింది. ఇదిలాగే కొనసాగితే.. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (మంగళవారం) దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబైలలో.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 73,000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.79,640 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంటే ఈ రోజు గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయన్నమాట.చెన్నైలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,000 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,640 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,790 వద్ద ఉంది.ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న, ఈ రోజు వెండి ధర రూ. 2500 పెరిగింది. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 10,2000లకు చేరింది. వచ్చే వారమే పండుగ కాబట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం రూ.80,000 పైకి..
న్యూఢిల్లీ: అటు బంగారం, ఇటు వెండి.. రెండు విలువైన మెటల్స్ ధరలు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపు రూ.79,900తో పోల్చితే సోమవారం రూ.750 పెరిగి రూ. 80,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర రూ.750 ఎగసి, రూ.80,250కి చేరింది. ఇక కేజీ వెండి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.5,000 పెరిగి రూ99,500కి ఎగసింది. కారణాలు ఇవీ... అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీన ధోరణి విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ వెండికి కలిసి వస్తున్న అంశం. అంతర్జాతీయంగా రికార్డులు పశి్చమ దేశాల సెంట్రల్ బ్యాంకుల సరళతర ఆర్థిక విధానాల నేపథ్యంలో సోమవారం యూరోపియన్ ట్రేడింగ్ గంటల్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 2,730 డాలర్ల స్థాయికి చేరింది. వెండి సైతం 3 శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 34.20 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రికార్డు ధర వద్ద 2,752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,755 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గత ముగింపుకన్నా ఇది 25 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.650 లాభంతో రూ. 78,380 రికార్డు ధర వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.2,500 లాభంతో రూ.98,000 వద్ద ట్రేడవుతోంది. -
MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
పరుగుల ప్రళయం.. సిక్సర్ల సునామీ.. ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీ పడి సిక్సర్లు బాదారు. ఇరు జట్ల బ్యాటర్ల సిక్సర్ల సునామీ ధాటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18 సిక్సర్లు బాదితే.. ఛేదనలో ముంబై తామేమీ తక్కువ కాదని 20 సిక్సర్లు బాదింది. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టాయి. ఫలితంగా భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు పలు ఆల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. పోట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. పురుషుల టీ20ల్లో అత్యధిక సిక్సర్లు.. 38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 37 - బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018 37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019 36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 35 - JT vs TKR, కింగ్స్టన్, CPL 2019 35 - SA vs WI, సెంచూరియన్, 2023 ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్ గానూ రికార్డు నెలకొల్పింది. 38 - SRH vs MI, హైదరాబాద్, 2024 33 - RCB vs CSK, బెంగళూరు, 2018 33 - RR vs CSK, షార్జా, 2020 33 - RCB vs CSK, బెంగళూరు, 2023 ఐపీఎల్లో అత్యధిక బౌండరీల సంఖ్య (4 6s).. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కొట్టిన బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం. 69 - CSK vs RR, చెన్నై, 2010 69 - SRH vs MI, హైదరాబాద్, 2024 67 - PBKS vs LSG, లక్నో, 2023 67 - PBKS vs KKR, ఇండోర్, 2018 65 - డెక్కన్ ఛార్జర్స్ vs RR, హైదరాబాద్, 2008 ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, సన్‌రైజర్స్ బాదిన సిక్సర్ల సంఖ్య నాలుగో అత్యధికం. 21 - RCB vs PWI, బెంగళూరు, 2013 20 - RCB vs GL, బెంగళూరు, 2016 20 - DC vs GL, ఢిల్లీ, 2017 20 - MI vs SRH, హైదరాబాద్, 2024 18 - RCB vs PBKS, బెంగళూరు, 2015 18 - RR vs PBKS, షార్జా, 2020 18 - CSK vs KKR, కోల్‌కతా, 2023 18 - SRH vs MI, హైదరాబాద్, 2024 ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016 246/5 - CSK vs RR, చెన్నై, 2010 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 టీ20ల్లో అత్యధిక స్కోర్లు.. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. 314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, ఏషియన్ గేమ్స్ 2023 278/3 - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019 278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్ఫోకౌంటీ, 2019 277/3 - సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024 275/6 - పంజాబ్ వర్సెస్ ఆంధ్ర, రాంచీ, 2023 ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు.. ఐపీఎల్ హిస్టరీలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 (ఓటమి) 226/6 - RR vs PBKS, షార్జా, 2020 (గెలుపు) 223/5 - RR vs CSK, చెన్నై, 2010 (ఓటమి) 223/6 - MI vs PBKS, ముంబై WS, 2017 (ఓటమి) 219/6 - MI vs CSK, ఢిల్లీ, 2021 (గెలుపు) ఐపీఎల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు (సన్‌రైజర్స్ 277/3, ముంబై ఇండియన్స్ 246/5) చేయడంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్‌లో 500 పరుగుల మార్కు దాటింది. 523 - SRH vs MI, హైదరాబాద్, 2024 469 - CSK vs RR, చెన్నై, 2010 459 - PBKS vs KKR, ఇండోర్, 2018 458 - PBKS vs LSG, మొహాలి, 2023 453 - MI vs PBKS, ముంబై WS, 2017 టీ20ల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. 523 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 517 - SA vs WI, సెంచూరియన్, 2023 515 - QG vs MS, రావల్పిండి, PSL 2023 506 - సర్రే vs మిడిల్సెక్స్, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023 501 - టైటాన్స్ vs నైట్స్, పోచెఫ్‌స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 -
రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ. రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా.. గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇబ్రహింపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్‌లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది. -
ధర ఎగ్సే
సాక్షి, భీమవరం/అమరావతి: పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. కోడి గుడ్డు రైతు ధర రూ.5.79కు చేరి పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా.. పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.7కు చేరింది. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 60 శాతం ఉత్తరాదికి ఎగుమతి రాష్ట్రంలో 2 వేలకు పైగా కోళ్లఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సగటున 4.20 కోట్ల నుంచి 4.75 కోట్ల మధ్య గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 40 శాతం స్థానికంగానే వినియోగిస్తుండగా.. మిగిలిన 60 శాతం బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావం ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి ముఖ్య సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ సీజన్లో అత్యధిక ధర నమోదవుతుంటుంది. 2017–18 సీజన్లో రూ.5.45 అత్యధిక ధర నమోదైంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో సీజన్ కలిసి రాక రైతు ధర రూ.5 దాటడం గగనంగా ఉండేంది. చరిత్రలో ఇదే గరిష్ట ధర ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పడటంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి నాలుగేళ్ల తర్వాత 2022–23 పౌల్ట్రీ సీజన్లో రూ.5.57 గరిష్ట ధర పలికింది. కాగా.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో ధరలో ఒడిదొడుకులు ఎదురైనా.. వారం, 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం రూ.5.79కి చేరి అల్‌టైమ్ రికార్డు నమోదైంది. కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో స్థానిక వినియోగం మరింత పెరగనుండటంతో ఫామ్ గేట్ వద్ద ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నూకలు దొరకట్లేదు పౌల్ట్రీ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే నూకలు టన్ను రూ.13 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు చేరింది. నూకలను ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తుండటంతో మార్కెట్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నూకలకు బదులు మొక్కజొన్నపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మొక్కజొన్న కూడా టన్ను రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. సోయాబీన్ టన్ను రూ.48 వేల నుంచి రూ.50 వేల మధ్య పలుకుతోంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. పెరిగిన మేత ధరలతో పాటు మందులు, వ్యాక్సిన్ల ధరలు, కార్మికుల జీతాలు పెరగడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచేసింది. ఫలితంగా పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి గతేడాది రూ.300–310 ఖర్చు కాగా.. ప్రస్తుతం రూ.360–370 ఖర్చవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7, మారుమూల పల్లెల్లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రైతు ధరకు 40–50 పైసలు అదనంగా చేర్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంటారు. -
ఫారెక్స్ @ రికార్డుకు మరో 50 బిలియన్ డాలర్ల దూరంలో..!
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం ఇదే వారంతో (జూన్ 23వ తేదీ) పోల్చి చూస్తే.. 1.85 బిలియన్ డాలర్లు పెరిగి 595.051 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్ డాలర్ల దూరానికి ఫారెక్స్ నిల్వలు చేరాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ రికార్డు 645 బిలియన్ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. నెల రోజుల నుంచి నిలకడగా 595 డాలర్ల వద్ద కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. నిల్వలను వేర్వేరుగా చూస్తే.. ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 527.97 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి నిల్వల విలువ 472 మిలియన్ డాలర్లు తగ్గి, 43.83 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ కూడా 95 మిలియన్ డాలర్లు తగ్గి 18.23 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ రిజర్వ్ పరిమాణా కూడా 118 మిలియన్ డాలర్ల తగ్గి 5 బిలియన్ డాలర్లకు పడింది. -
ఏపీలో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
-
ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధరలు.. కారణం ఇదే!
సాక్షి, నిజామాబాద్: బంగారం.. ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.. తులం ధర 61 వేలు దాటి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. అక్షయ తృతీయ వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవుతుండటంతో నిజామాబాద్ మార్కెట్ కు కళ వచ్చింది.. పెళ్లిళ్ల కోసం పుత్తడి వారు పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది.. కేంద్రం పన్నులు కూడా పెంచడం కూడా ఓ కారణమనే వాదనలు కొందరు వ్యాపారులు వినిపిస్తున్నారు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్స్‌ను తిరగ రాస్తున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ పరిస్తితి ఏర్పడుతోంది.. 22 కేరట్ల ధర ఇప్పుడు 61 వేలు దాటింది.. పదేళ్లలో లక్ష దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు వ్యాపారులు.. ఆర్ణమెంట్ గోల్డ్‌కు మన దేశంలో డిమాండ్ పెరగడం బంగారాన్ని పెట్టుబడులుగా చూడటం బ్యాంకులు సైతం ప్రోత్సాహం ఇవ్వడం మంచి వడ్డీ కూడా ఇస్తుండటం లాంటి కారణాలతో మన బంగారం అమ్మకాలు తగ్గడం లేదని అంటున్నారు. నిజామాబాద్ లాంటి మార్కెట్ లో గరిష్ట ధరలు నమోదవుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి జనాలకు భారంగా మారుతోంది పుత్తడి.. ఈ నెల 22న అక్షయ తృతీయ ఉంది.. ఆరోజు ఒక్క గ్రాము బంగారం తీసుకున్న మంచి జరుగుతుందని భావిస్తారు.. కానీ అంతకుముందే ముందే బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా పండుగల సమయంలో అలాగే పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతోంది. అక్షయ తృతీయ తర్వాతా నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.. దీంతో నిజామాబాద్ మార్కెట్ లో వినియోగదారుల కళ కనిపిస్తోంది.. జువెలరీ షాపులు షో రూం లు కళకళ లాడుతున్నాయి.. పెళ్లిళ్ల కోసం జనాలు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు.. అయితే ఏటికేడు పెరుగుతున్న బంగారం ధరల ఎఫెక్ట్ పడుతోంది. గతంలో ఎక్కువ తులాల బంగారం కొనుగోలు చేసే వారు.. ఇప్పుడు ఆ పరిస్తితి లేదంటున్నారు జనాలు.. సగానికి పైగా తగ్గించేశామంటున్నారు.. 20 టీకాలు తీసుకునే వారు 10కి వచ్చారు.. 10 కొనేవారు ఐదు తులాలకు వచ్చారు.. బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ నమోదైన ధరల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61, 200 గా ఉంది. కాగా కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది. చదవండి: పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్డేట్ బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో జనాలకు షాక్‌కు గురి తప్పడం లేదు.. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. రానున్న కాలంలో తులం బంగారం ధర లక్ష కూడా చూస్తాం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు -
రూపాయి మరోసారి ఢమాల్, తొలిసారి 83 స్థాయికి పతనం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. బుధవారం డాలరు మారకంలో ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆ తరువాత నష్టాల్లోకి జారిపోయింది. ఏకంగా 61 పైసలు క్షీణించి తొలిసారి 83.01 స్థాయికి పతన మైంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్ల్లోనూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 59107 వద్ద,నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద స్థిరపడ్డాయి. కాగా ఇటీవల రూపాయి పతనం స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి రూపాయి పడిపోవడం కాదు.. డాలర్ బలపడుతోందంటూ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ సెగ: రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. ఆ తరువాత మరింత క్షీణించింది. బుధవారం 79.98 వద్ద ముగిసింది. (StockMarketOpening: లాభనష్టాల ఊగిసలాట) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 59301 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టంతో 17673 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరు బలం పుంజుకుంది. ఫలితంగా ఆసియా కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. భవిష్యత్తు ఇంధన డిమాండ్‌పై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా క్షీణించాయి. ఇదిఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన అంతర్జాతీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. 3 లక్షల మంది సైనికుల పాక్షిక మొబిలైజేషన్ ప్రకటన ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచుతోందని భావిస్తున్నారు. -
స్టాక్‌మార్కెట్ క్రాష్, రుపీ రికార్డు కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లు కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 995 పాయింట్లు పతనమై 57842 వద్ద, నిఫ్టీ 295 పాయింట్ల నష్టంతో 17265 వద్ద కొన సాగుతున్నాయి. ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ నష్ట పోతున్నాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, మారుతి, నెస్లే లాభపడు తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఫలితంగా రిలయన్స్ కూడా నష్టాల్లో ఉంది. మరోవైపుడాలరు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై రికార్డు కనిష్టం 80.10 స్థాయిని టచ్ చేసింది. ప్రస్తుతం 80.02 వద్ద ట్రేడ్ అవుతోంది. -
పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా?
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. సోమవారం 79.97 వద్ద ముగిసింది. పలు కేంద్ర బ్యాంకుల సమాశాలు, ముఖ్యంగా యూఎస్ పెడ్ రిజర్వ్ ట్రేడర్లు దృష్టి పెట్టారు. ఫలితంగా డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి చేరింది. ఈ స్థాయిలో మరింత క్షీణత తప్పదనే ఆందోళన ట్రేడర్లలో నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ ఈక్విటీల నుండి రికార్డు మొత్తంలో దాదాపు 30 బిలియన్ల డాలర్లు పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. దీనికి తోడు చమురు ధరలు, క్షీణిస్తున్న కరెంట్-ఖాతా లోటుపై ఆందోళనలు కరెన్సీకి బలహీనతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు ఆరంభంలో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సూచీలు రెండూ ఫ్టాట్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 31, 2014 నుండి భారత రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు చెప్పారు. రూపాయి విలువ 63.33 నుండి జూలై 11, 2022 నాటికి 79.41కి తగ్గిందని ఆర్బిఐ డేటాను ఉటంకిస్తూ లోక్సభకిచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం లాంటి గ్లోబల్ కారకాలు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు -
దిగుమతులకు రూపాయి సెగ
న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత ఎన్నో రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముడిచమురు దగర్నుంచి, ఔషధాల ముడిసరుకు దిగు మతులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతుల వరకు అన్నీ భారంగా మారుతున్నాయి. అదేవిధంగా విదేశీ విద్య కోసం వెళ్లేవారు, విదేశీ పర్యటనకు వెళ్లేవారిపై మరింత ప్రభావం పడనుంది. డాలర్‌తో రూపాయి మారకం ఇటీవలే 8 శాతానికి పైగా క్షీణించడం గమనార్హం. రూపాయి విలువ క్షీణత ప్రభావం తక్షణం ఎదుర్కొనేది దిగుమతిదారులే. అంతకుముందు రోజులతో పోలిస్తే వారు దిగుమతుల కోసం మరింత మొత్తాన్ని వెచి్చంచాల్సి వస్తుంది. అదే సమయంలో ఎగుమతి రంగానికి రూపాయి విలువ క్షీణత కలిసొస్తుంది. డాలర్-రూపాయి మారకంలో వారికి మరిన్ని నిధులు లభిస్తాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అక్కడి నుంచి అవి కొంత మేర తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇదే కాలంలో రూపాయి విలువ క్షీణత.. చమురు ధరల తగ్గుదల ప్రయోజాన్ని తుడిచిపెట్టేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం రూ.79.99కు పడిపోగా, శుక్రవారం సైతం 79.91 వద్ద స్థిరపడింది. దిగుమతులే ఎక్కువ.. మన దేశ ముడిచమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా వంట నూనెలు, బొగ్గు, ప్లాస్టిక్ మెటీరియల్, రసాయనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇలా దిగుమతి జాబితా పెద్దదిగానే ఉంది. దిగుమతుల్లో ప్రధానంగా ముడిచమురు వాటాయే ఎక్కువగా ఉంటోంది. వీటి కోసం అధిక మొత్తాన్ని చెల్లించుకోవాలి. ఉదాహరణకు ఆరు నెలల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 స్థాయిలో ఉంది. ఇప్పుడు 80కు చేరింది. ఆరు నెలల్లోనే రూపాయి 8 శాతం విలువను కోల్పోయింది. కనుక ఆరు నెలల క్రితం కొన్న ఒక ఫోన్‌కు ఇప్పుడు మరింత మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో రూపాయి 82 స్థాయి వరకు వెళుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముడిచమురుతోపాటు మొబైల్ ఫోన్లు, ఖరీదైన టీవీలు, సంపన్న కార్లు, కీలక ముడిపదార్థాల దిగుమతుల కోసం ఇప్పుడు 8 శాతం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు, విదేశాల్లో సంపాదిస్తూ స్వదేశంలోని తల్లిదండ్రులకు నగదు పంపించే వారికి అనుకూలం. రూపాయి క్షీణించడం వల్ల మారకంలో మరిన్ని రూపాయలు వీరు పొందగలరు. జూన్ నెలలో దిగుమతులు 57 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జూన్‌లో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 9.60 బిలియన్ డాలర్లు ఉంటే, 2022 జూన్ నెలలో 173 శాతం పెరిగి ఇది 26.18 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. రూపా యి బలహీనత వల్లేనని భావించాలి. విద్యుత్ అవసరాలకు బొగ్గును సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూన్ నెలలో చమురు దిగుమతుల విలువ రెట్టింపై 21.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వంట నూనెల దిగుమతులు 26 శాతం పెరిగి 1.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సబ్సిడీల భారం.. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయిన ఎరువుల ధరల ప్రభావం మనమీదా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీల బిల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లకు చొరొచ్చన్న అభిప్రాయం నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీలకు కేంద్రం రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఫారెక్స్ నిల్వల భారీ పతనం భారత్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) జూలై 8వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 1తో ముగిసిన వారంతో పోల్చి) భారీగా 8.062 డాలర్లు తగ్గి 580.252 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఎగుమతులకన్నా, దిగుమతులు పెరగడం, వెరసి వాణిజ్యలోటు భారీ పెరుగుదల, రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి మార్కెట్లో ఆర్బీఐ పరిమిత జోక్యం వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణంగా కనబడుతోంది. 2021 సెపె్టంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. -
రూపాయి మహాపతనం, మరో కొత్త కనిష్టం
సాక్షి, ముంబై: రూపాయి మరో మహాపతనాన్ని నమోదు చేసింది. వరుస రికార్డు కనిష్టాలను నమోదు చేస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని రికార్డు చేసింది. యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 79.11 వద్దకు చేరింది. వరుసగా ఆరో సెషన్లో కూడా రూపాయి విలువ దిగజారుతుండటం ట్రేడర్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత సెషన్లో 3 పైసలు పడిపోయి రికార్డు స్థాయిలో 79.06 వద్ద ముగిసింది. మరోవైపు గత సెషన్లో దాదాపు 3 శాతం క్షీణించిన చమురు ధరలు ఈరోజు (శుక్రవారం) ప్రారంభ ట్రేడింగ్‌లోనే చుక్కలు చూపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి 109.86 డాలర్లకు చేరుకుంది. అలాగే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 770 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 226 పాయింట్లు పతనమైంది. -
ఆగని రూపాయి పతనం, ఆర్బీఐ జోక్యం?
సాక్షి, ముంబై: డాలరు మారకంలో అంతకంతకూ దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరింత పతనమైంది. తాజాగా 78.96 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి తాకింది. వరుసగా ఆరో సెషన్లో కూడా రికార్డు కనిష్టానికి చేరడంతో ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీ స్టాక్‌మార్కెట్లు, ఇతర ఆసియా కరెన్సీల నష్టాల ప్రభావంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 78.86 వద్ద బలహీనమైన నోట్‌తో ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 11 పైసల నష్టంతో ఆల్ టైం కనిష్టం 78.96 స్థాయిని నమోదు చేసింది. ఈ స్థాయిలో మరింత పతనం తప్పదని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి 1.87శాతం క్షీణించగా, ఈ ఏడాది 6.28 శాతం పతనం కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
Chicken Price: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు
చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. – ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్ మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు చేరింది. రోజు రోజుకూ ఎగబాకుతూ మాంసం ప్రియులు చేతి చమురు వదిలిస్తోంది. పెరుగుతున్న ధరలతో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ ధర నిలకడగా కొనసాగుతోంది. లైవ్ ధర సైతం రికార్డు స్థాయిలో కేజీ రూ.166 చేరింది. పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు : కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం చికెన్ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చికెన్ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్ వేవ్ తగ్గిన అనంతరం చికెన్ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్లెస్ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. రూ.320 మార్కు దాటే అవకాశముంది కోవిడ్ రెండో దశ అనంతరం నుంచి చికెన్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గతేడాది రూ.280 చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించిన ధర ఈ ఏడాది ఏకంగా రూ.300 మార్కును దాటేసింది. ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతోనే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పౌల్ట్రీల్లో కోళ్లు పెరుగుదల సమయం ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్కెట్‌కు తరలించేందుకు కావాల్సిన బరువు పెరిగేందుకు ఇతర సీజన్స్‌తో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ తీసిన సోయ, తవుడు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటి ప్రభావం కారణంగా కూడా చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి. – సుబ్బారావు, పౌల్ట్రీ, హోల్‌సేల్ చికెన్ వ్యాపారి -
పసిడితో మిర్చి పోటీ.. క్వింటాల్ రూ. 52 వేలు.. దేశవ్యాప్తంగా ఆల్లైమ్ రికార్డు!
సాక్షి, వరంగల్: మిర్చి పంట బంగారమైంది.. పసిడి రేటును తలదన్నింది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గడం.. ప్రస్తుత సీజన్లో పచ్చళ్లలో ఎక్కువగా దేశీ రకం మిర్చి కారాన్ని వినియోగిస్తుండటం కూడా రేటు పెరిగేందుకు కారణమైంది. బుధవారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల(తులం) బంగారం ధర రూ.51,989 ఉంటే.. మరో రూ.11 అదనంగా దేశీ మిర్చి రేటు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా ధర రూ.52వేలు అత్యధికంగా పలకడం విశేషం. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఆల్లైమ్ రికార్డు అని మార్కెట్ అధికారులు చెబుతున్నా.. మిర్చి దిగుబడి తగ్గడమే ఈసారి రేట్లు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు.. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా తామర తెగులుతో వేలాది ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. దీంతో దిగుబడి తగ్గడంతో రైతులకు వచ్చిన పంటలో నాణ్యత ఉన్న మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతోంది. ఇదే కాస్త ఉపశమనంగా మారిందని ఇటు అధికారులు, అటు రైతులు చెబుతున్నారు. అయితే బుధవారం ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డుకు 30వేల బస్తాలు వస్తే.. ఇందులో దేశీ మిర్చి రకం 800 బస్తాల వరకు ఉంది. ఇందులో అత్యధిక నాణ్యత ఉన్న ములుగు జిల్లా ఎస్ నగర్‌కు చెందిన బలుగూరి రాజేశ్వర్‌రావు తెచ్చిన ఏడు బస్తాల మిర్చికి క్వింటాల్‌కు రూ.52వేల ధర పెట్టి ఖరీదుదారు లాలా ట్రేడింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక మిగిలిన రకాల మిర్చికి రూ.18వేల నుంచి రూ.35వేల వరకు ధర పలికింది. ఎందుకింత డిమాండ్ అంటే.. ‘దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం.. ఇప్పుడు సీజన్ కూడా కావడంతో ఉన్న కొద్దిపాటి పంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంత రేటు వచ్చినా ఇది రైతులకు కంటి తుడుపు చర్య మాదిరిగానే ఉంది. ఎందుకంటే.. వారు రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాకపోవడంతో ఉన్న కొంత సరుకుకు ఈ ధర వస్తోంది. పెట్టుబడి కూడా పూర్తిగా రావడం లేదని మార్కెట్‌కు వచ్చిన రైతులు వాపోతున్నారు. గతంలో దేశీ మిర్చి క్వింటా ధర రూ.28వేలు పలికింది. ఇప్పుడది రూ.52వేలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’ అని మార్కెట్ గ్రేడ్ కార్యదర్శి రాహుల్ ‘సాక్షి’కి తెలిపారు. రెండెకరాలు.. రెండు క్వింటాళ్లపైనే.. మాకున్న రెండెకరాల్లో ఏటా మిర్చి పంట సాగు చేస్తున్నా. అంతకుముందు ఎకరానికి 10 క్వింటాళ్లపైగా దిగుబడి వచ్చేది. ఈసారి ఎకరాకు కొంచెం ఎక్కువగా వచ్చింది. తామర తెగులుతో పంట దిగుబడి తగ్గింది. ఈసారి పెట్టుబడి రూ.5లక్షలు పెడితే.. కేవలం రూ.1,70,000 మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.3,30,000 వరకు నష్టపోయాం. ఇంత అత్యధిక ధర రూ.52వేలు వచ్చినా పెద్దగా మాకు వచ్చిన ప్రయోజనమేమీ లేదు. బలుగూరి రాజేశ్వర్‌రావు, మిర్చి రైతు, ఎస్ నగర్, ములుగు జిల్లా -
AP: రికార్డులు తిరగరాసిన విశాఖ స్టీల్‌ప్లాంట్
ఉక్కునగరం (గాజువాక)/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది. చదవండి: దక్షిణ కొరియా మార్కెట్లో ఏపీ బంగినపల్లి -
పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్
India Vs Pakistan Match In T20 WC 2021 Recorded As Most Viewed T20I: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ వీక్షకుల పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఈ మ్యాచ్ పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధికంగా మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్-2016లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచకప్-2021లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను(క్వాలిఫయర్లు, సూపర్-12 దశ మ్యాచ్‌లు) మొత్తం 238 మిలియన్ల మంది వీక్షించారని స్టార్ ఇండియా పేర్కొంది. ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతుందని ఊరించి, ఉసూరుమనిపించిన దాయాదుల పోరులో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో దారుణంగా నిరాశపరచిన టీమిండియా పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది. చదవండి: Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు -
బిట్‌కాయిన్ @ 66,901 డాలర్లు
న్యూయార్క్: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్‌కాయిన్ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది. గతంలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్‌కాయిన్ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్ బిట్‌కాయిన్ స్ట్రాటెజీ వంటి బిట్‌కాయిన్ ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్ ర్యాలీకి దోహదపడుతోంది. లిస్టింగ్ రోజునే ప్రోషేర్స్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్‌కాయిన్ డిమాండ్‌కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్‌లు నేరుగా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈటీఎఫ్‌ల వల్ల.. హాట్, కోల్డ్ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్‌కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. -
నిఫ్టీ @ 17,000
ముంబై: స్టాక్ మార్కెట్లో మంగళవారమూ రికార్డుల మోత మోగింది. ఆర్థిక వృద్ధి ఆశలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ నాలుగోరోజూ బలపడి మార్కెట్ జోరుకు మరింత ప్రోత్సాహం అందించింది. ట్రేడింగ్ ప్రారంభంలో తడబడినా.., తదుపరి స్థిరమైన ర్యాలీ చేయడంతో సెన్సెక్స్ తొలిసారి 57000 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా మొదటిసారి 17000 శిఖరంపై నిలిచింది. మీడియా షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 735 పాయింట్ల ర్యాలీ చేసి 57625 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 663 పాయింట్లు లాభంతో 57,552 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 223 పాయింట్లు ఎగసి 17,154 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి 201 పాయింట్ల లాభంతో 17,132 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగడంతో ఎన్ఎస్ఈలో రెండోరోజూ నిఫ్టీ మెటల్ సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు చెప్పుకోదగిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా షేర్లలో బలమైన రికవరీ ర్యాలీ కనిపించింది. అయితే మిడ్, స్మాల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,881 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,872 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘జీడీపీతో పాటు ఇతర దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ఫెడ్ చైర్మన్ సానుకూల వ్యాఖ్యలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లను ప్రారంభించడం మార్కెట్‌కు మరింత జోష్‌నిచ్చాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ దీపక్ జషానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అంతర్జాతీయ మార్కెట్లో్ల చక్కెర ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో షుగర్ షేర్లు ఐదు శాతం వరకు ర్యాలీ చేశాయి. ► టారిఫ్‌ల పెంపు, నిధుల సమీకరణ అంశాలపై కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ వివరణ ఇవ్వడంతో భారతీ ఎయిర్టెల్ షేరు 7% లాభపడి రూ.664 వద్ద ముగిసింది. ► అల్యూమినియం ధరలు పదేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతుండటంతో హిందాల్కో షేరు 4.5% లాభపడి రూ.468 వద్ద స్థిరపడింది. సంపద @ రూ.250 లక్షల కోట్లు దలాల్ స్ట్రీట్‌లో బుల్ దూకుడుతో ఇన్వెస్టర్లు సంప దగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ తొలిసారి రూ. 250 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నాలుగు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో రూ.8.48 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.7 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. 29 రోజుల్లో 1000 పాయింట్ల ర్యాలీ... నిఫ్టీ ఈ ఆగస్ట్ 3వ తేదీన తొలిసారి 16000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి సరిగ్గా 28 రోజుల్లో (ఆగస్ట్ 31 తేది నాటికి) ఏకంగా 1000 పాయింట్లు ఎగసి 17000 స్థాయిని అందుకుంది. వెయ్యి పాయింట్ల ర్యాలీకి నిఫ్టీ తీసుకున్న అతి తక్కువ సమయం ఇది. కాగా, ఈ ఆగస్ట్‌లో ఎనిమిది శాతం లాభపడింది. -
టోక్యోలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఇప్పటివరకు ఇవే అత్యధికం
టోక్యో: విశ్వక్రీడలు జరుగుతున్న వేళ టోక్యో నగరంలో కరోనా కేసులు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో ఇవాళ ఏకంగా 2848 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో ఇప్పటివరకు 155 మంది కరోనా బారిన పడ్డట్టు నిర్వహకులు తెలిపారు. ఇవాళ కొత్తగా మరో ఏడు కేసులు నమోదైనట్లు, ఇందులో నలుగురు అథ్లెట్లు కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఒలింపిక్ గ్రామంలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతుండటం ఒలింపిక్ నిర్వహకులతో సహా అథ్లెట్లను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు టోక్యో నగరంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో క్రీడలను రద్దు చేయాలంటూ టోక్యో వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.