ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం ఇదే వారంతో (జూన్ 23వ తేదీ) పోల్చి చూస్తే.. 1.85 బిలియన్ డాలర్లు పెరిగి 595.051 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్ డాలర్ల దూరానికి ఫారెక్స్ నిల్వలు చేరాయి.
2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ రికార్డు 645 బిలియన్ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. నెల రోజుల నుంచి నిలకడగా 595 డాలర్ల వద్ద కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. నిల్వలను వేర్వేరుగా చూస్తే..
► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 527.97 బిలియన్ డాలర్లకు చేరింది.
► పసిడి నిల్వల విలువ 472 మిలియన్ డాలర్లు తగ్గి, 43.83 బిలియన్ డాలర్లకు తగ్గింది.
► ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ కూడా 95 మిలియన్ డాలర్లు తగ్గి 18.23 బిలియన్ డాలర్లకు చేరింది.
► ఐఎంఎఫ్ రిజర్వ్ పరిమాణా కూడా 118 మిలియన్ డాలర్ల తగ్గి 5 బిలియన్ డాలర్లకు పడింది.
Comments
Please login to add a commentAdd a comment