సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కీలక సూచీలు వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. రికార్డులమీద రికార్డులతో దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం మరోసారి ఆల్ టైం హైని టచ్ చేశాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ర్యాలీ అవుతున్నాయి. సెన్సెక్స్ 238 పాయింట్ పుంజుకుని 37,223 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో11,232 వద్ద కొనసాగుతుంది. త్వరలోనే 12వేల స్థాయిని తాకుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.
అన్ని సెక్టార్లు లాభాలతో కొత్త ఎఫ్ అండ్ వో సిరీస్ చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది. ఐటీసీ, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, మారుతీ, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య వివాదాలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెక్ పెట్టడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment