
సాక్షి, ముంబై: డాలరు మారకంలో అంతకంతకూ దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరింత పతనమైంది. తాజాగా 78.96 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి తాకింది. వరుసగా ఆరో సెషన్‌లో కూడా రికార్డు కనిష్టానికి చేరడంతో ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశీ స్టాక్‌మార్కెట్లు, ఇతర ఆసియా కరెన్సీల నష్టాల ప్రభావంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 78.86 వద్ద బలహీనమైన నోట్‌తో ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 11 పైసల నష్టంతో ఆల్ టైం కనిష్టం 78.96 స్థాయిని నమోదు చేసింది. ఈ స్థాయిలో మరింత పతనం తప్పదని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి 1.87శాతం క్షీణించగా, ఈ ఏడాది 6.28 శాతం పతనం కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment