
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. బుధవారం డాలరు మారకంలో ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆ తరువాత నష్టాల్లోకి జారిపోయింది. ఏకంగా 61 పైసలు క్షీణించి తొలిసారి 83.01 స్థాయికి పతన మైంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్ల్‌లోనూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 59107 వద్ద,నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద స్థిరపడ్డాయి.
కాగా ఇటీవల రూపాయి పతనం స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి రూపాయి పడిపోవడం కాదు.. డాలర్ బలపడుతోందంటూ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.