సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. ఆ తరువాత మరింత క్షీణించింది. బుధవారం 79.98 వద్ద ముగిసింది. (StockMarketOpening: లాభనష్టాల ఊగిసలాట)
మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 59301 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టంతో 17673 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరు బలం పుంజుకుంది. ఫలితంగా ఆసియా కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి.
భవిష్యత్తు ఇంధన డిమాండ్‌పై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా క్షీణించాయి. ఇదిఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన అంతర్జాతీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. 3 లక్షల మంది సైనికుల పాక్షిక మొబిలైజేషన్ ప్రకటన ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచుతోందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment