ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీ పడి సిక్సర్లు బాదారు. ఇరు జట్ల బ్యాటర్ల సిక్సర్ల సునామీ ధాటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18 సిక్సర్లు బాదితే.. ఛేదనలో ముంబై తామేమీ తక్కువ కాదని 20 సిక్సర్లు బాదింది. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టాయి. ఫలితంగా భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు పలు ఆల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. పోట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది.
పురుషుల టీ20ల్లో అత్యధిక సిక్సర్లు..
- 38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024
- 37 - బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018
- 37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019
- 36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్‌స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022
- 35 - JT vs TKR, కింగ్‌స్టన్, CPL 2019
- 35 - SA vs WI, సెంచూరియన్, 2023
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు..
ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్ గానూ రికార్డు నెలకొల్పింది.
- 38 - SRH vs MI, హైదరాబాద్, 2024
- 33 - RCB vs CSK, బెంగళూరు, 2018
- 33 - RR vs CSK, షార్జా, 2020
- 33 - RCB vs CSK, బెంగళూరు, 2023
ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీల సంఖ్య (4s+6s)..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కొట్టిన బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం.
- 69 - CSK vs RR, చెన్నై, 2010
- 69 - SRH vs MI, హైదరాబాద్, 2024
- 67 - PBKS vs LSG, లక్నో, 2023
- 67 - PBKS vs KKR, ఇండోర్, 2018
- 65 - డెక్కన్ ఛార్జర్స్ vs RR, హైదరాబాద్, 2008
ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, సన్‌రైజర్స్ బాదిన సిక్సర్ల సంఖ్య నాలుగో అత్యధికం.
- 21 - RCB vs PWI, బెంగళూరు, 2013
- 20 - RCB vs GL, బెంగళూరు, 2016
- 20 - DC vs GL, ఢిల్లీ, 2017
- 20 - MI vs SRH, హైదరాబాద్, 2024
- 18 - RCB vs PBKS, బెంగళూరు, 2015
- 18 - RR vs PBKS, షార్జా, 2020
- 18 - CSK vs KKR, కోల్‌కతా, 2023
- 18 - SRH vs MI, హైదరాబాద్, 2024
ఐపీఎల్‌లో అత్యధిక టీమ్ స్కోర్లు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
- 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024
- 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013
- 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023
- 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016
- 246/5 - CSK vs RR, చెన్నై, 2010
- 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024
టీ20ల్లో అత్యధిక స్కోర్లు..
ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది.
- 314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, ఏషియన్ గేమ్స్ 2023
- 278/3 - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019
- 278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్ఫోకౌంటీ, 2019
- 277/3 - సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024
- 275/6 - పంజాబ్ వర్సెస్ ఆంధ్ర, రాంచీ, 2023
ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు..
ఐపీఎల్ హిస్టరీలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది.
- 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 (ఓటమి)
- 226/6 - RR vs PBKS, షార్జా, 2020 (గెలుపు)
- 223/5 - RR vs CSK, చెన్నై, 2010 (ఓటమి)
- 223/6 - MI vs PBKS, ముంబై WS, 2017 (ఓటమి)
- 219/6 - MI vs CSK, ఢిల్లీ, 2021 (గెలుపు)
ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు (సన్‌రైజర్స్ 277/3, ముంబై ఇండియన్స్ 246/5) చేయడంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్‌లో 500 పరుగుల మార్కు దాటింది.
- 523 - SRH vs MI, హైదరాబాద్, 2024
- 469 - CSK vs RR, చెన్నై, 2010
- 459 - PBKS vs KKR, ఇండోర్, 2018
- 458 - PBKS vs LSG, మొహాలి, 2023
- 453 - MI vs PBKS, ముంబై WS, 2017
టీ20ల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్‌గా రికార్డైంది.
- 523 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024
- 517 - SA vs WI, సెంచూరియన్, 2023
- 515 - QG vs MS, రావల్పిండి, PSL 2023
- 506 - సర్రే vs మిడిల్‌సెక్స్, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023
- 501 - టైటాన్స్ vs నైట్స్, పోచెఫ్‌స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022
Comments
Please login to add a commentAdd a comment