కాటమరాయుడు ఆల్ టైం రికార్డ్ | one crore views for katamarayudu teaser | Sakshi
Sakshi News home page

కాటమరాయుడు ఆల్ టైం రికార్డ్

Published Sun, Mar 12 2017 1:04 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

కాటమరాయుడు ఆల్ టైం రికార్డ్ - Sakshi

కాటమరాయుడు ఆల్ టైం రికార్డ్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. మార్చి 24న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యం కానీ అరుదైన రికార్డ్లను సొంతం చేసుకుంటోంది కాటమరాయుడు.

దాదాపు నెల రోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ రికార్డ్లను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు ఈ టీజర్కు కోటీకి పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో రెండున్నర లక్షలకు పైగా లైక్స్తో మరో రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది కాటమరాయుడు టీజర్. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement