అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్లు
ప్రారంభం తర్వాత ఇవి రెండో అతి భారీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెలలో 9 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోల్చితే) రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో జీఎస్‌టీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఒక నెలలో ఈ స్థాయి వసూళ్లు ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు ఇప్పటి వరకూ ఆల్‌టైమ్ రికార్డు. దేశీయ అమ్మకాలు, పన్ను పరిధి విస్తృతి తాజా రికార్డుకు కారణమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
రిఫండ్స్ రూ.19,306 కోట్లు
కాగా, మొత్తం అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లలో రూ.19,306 కోట్ల రిఫండ్స్ జరిగాయి. 2023 అక్టోబర్‌తో పోలి్చతే ఇది 18.2 శాతం అధికం. రిఫండ్స్ మినహాయిస్తే, నికర జీఎస్‌టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి.
విభాగాల వారీగా
→ మొత్తం వసూళ్లు రూ. 1,87,346 కోట్లు
→ సెంట్రల్ జీఎస్‌టీ రూ.33,821 కోట్లు
→ స్టేట్ జీఎస్‌టీ రూ.41,864 కోట్లు
→ ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్‌టీ విలువ రూ.99,111 కోట్లు
→ సెస్ రూ.12,550 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment