టోక్యో: విశ్వక్రీడలు జరుగుతున్న వేళ టోక్యో నగరంలో కరోనా కేసులు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో ఇవాళ ఏకంగా 2848 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో ఇప్పటివరకు 155 మంది కరోనా బారిన పడ్డట్టు నిర్వహకులు తెలిపారు. ఇవాళ కొత్తగా మరో ఏడు కేసులు నమోదైనట్లు, ఇందులో నలుగురు అథ్లెట్లు కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఒలింపిక్ గ్రామంలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతుండటం ఒలింపిక్ నిర్వహకులతో సహా అథ్లెట్లను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు టోక్యో నగరంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో క్రీడలను రద్దు చేయాలంటూ టోక్యో వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment