టోక్యో: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో జూలై–ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సిందిగా జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు టోక్యోకు చెందిన ఆరు వేల మంది వైద్యులు లేఖ రాశారు. కరోనా కేసులతో ఇప్పటికే టోక్యోలోని ఆసుపత్రులు నిండిపోయాయని, కొత్త వారికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేరని లేఖలో వారు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేస్తేనే మేలని ప్రధానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment