సాక్షి, నిజామాబాద్: బంగారం.. ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.. తులం ధర 61 వేలు దాటి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. అక్షయ తృతీయ వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవుతుండటంతో నిజామాబాద్ మార్కెట్ కు కళ వచ్చింది.. పెళ్లిళ్ల కోసం పుత్తడి వారు పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది.. కేంద్రం పన్నులు కూడా పెంచడం కూడా ఓ కారణమనే వాదనలు కొందరు వ్యాపారులు వినిపిస్తున్నారు.
బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్స్‌ను తిరగ రాస్తున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ పరిస్తితి ఏర్పడుతోంది.. 22 కేరట్ల ధర ఇప్పుడు 61 వేలు దాటింది.. పదేళ్లలో లక్ష దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు వ్యాపారులు.. ఆర్ణమెంట్ గోల్డ్‌కు మన దేశంలో డిమాండ్ పెరగడం బంగారాన్ని పెట్టుబడులుగా చూడటం బ్యాంకులు సైతం ప్రోత్సాహం ఇవ్వడం మంచి వడ్డీ కూడా ఇస్తుండటం లాంటి కారణాలతో మన బంగారం అమ్మకాలు తగ్గడం లేదని అంటున్నారు.
నిజామాబాద్ లాంటి మార్కెట్ లో గరిష్ట ధరలు నమోదవుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి జనాలకు భారంగా మారుతోంది పుత్తడి.. ఈ నెల 22న అక్షయ తృతీయ ఉంది.. ఆరోజు ఒక్క గ్రాము బంగారం తీసుకున్న మంచి జరుగుతుందని భావిస్తారు.. కానీ అంతకుముందే ముందే బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.
సాధారణంగా పండుగల సమయంలో అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతోంది. అక్షయ తృతీయ తర్వాతా నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.. దీంతో నిజామాబాద్ మార్కెట్ లో వినియోగదారుల కళ కనిపిస్తోంది.. జువెలరీ షాపులు షో రూం లు కళకళ లాడుతున్నాయి.. పెళ్లిళ్ల కోసం జనాలు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు..
అయితే ఏటికేడు పెరుగుతున్న బంగారం ధరల ఎఫెక్ట్ పడుతోంది. గతంలో ఎక్కువ తులాల బంగారం కొనుగోలు చేసే వారు.. ఇప్పుడు ఆ పరిస్తితి లేదంటున్నారు జనాలు.. సగానికి పైగా తగ్గించేశామంటున్నారు.. 20 టీకాలు తీసుకునే వారు 10కి వచ్చారు.. 10 కొనేవారు ఐదు తులాలకు వచ్చారు.. బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ నమోదైన ధరల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61, 200 గా ఉంది. కాగా కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది.
చదవండి: పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్‌డేట్
బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో జనాలకు షాక్‌కు గురి తప్పడం లేదు.. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. రానున్న కాలంలో తులం బంగారం ధర లక్ష కూడా చూస్తాం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment