దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (జూన్ 28) ఒక్కసారిగా ఎగిశాయి. వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించింది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం ఉన్నంటుండి భారీగా పెరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.400 ఎగిసిరూ.66,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.400 జంప్ అయి రూ.65,900 లను, 24 క్యారెట్ల బంగారం రూ.450 ఎగిసి రూ.72,330 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు చేరింది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 ఎగిసి రూ.72,720 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.
స్థిరంగా వెండి
దేశవ్యాప్తంగా వెండి ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment