Hit Record
-
ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధరలు.. కారణం ఇదే!
సాక్షి, నిజామాబాద్: బంగారం.. ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.. తులం ధర 61 వేలు దాటి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. అక్షయ తృతీయ వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవుతుండటంతో నిజామాబాద్ మార్కెట్ కు కళ వచ్చింది.. పెళ్లిళ్ల కోసం పుత్తడి వారు పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది.. కేంద్రం పన్నులు కూడా పెంచడం కూడా ఓ కారణమనే వాదనలు కొందరు వ్యాపారులు వినిపిస్తున్నారు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్స్‌ను తిరగ రాస్తున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ పరిస్తితి ఏర్పడుతోంది.. 22 కేరట్ల ధర ఇప్పుడు 61 వేలు దాటింది.. పదేళ్లలో లక్ష దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు వ్యాపారులు.. ఆర్ణమెంట్ గోల్డ్‌కు మన దేశంలో డిమాండ్ పెరగడం బంగారాన్ని పెట్టుబడులుగా చూడటం బ్యాంకులు సైతం ప్రోత్సాహం ఇవ్వడం మంచి వడ్డీ కూడా ఇస్తుండటం లాంటి కారణాలతో మన బంగారం అమ్మకాలు తగ్గడం లేదని అంటున్నారు. నిజామాబాద్ లాంటి మార్కెట్ లో గరిష్ట ధరలు నమోదవుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి జనాలకు భారంగా మారుతోంది పుత్తడి.. ఈ నెల 22న అక్షయ తృతీయ ఉంది.. ఆరోజు ఒక్క గ్రాము బంగారం తీసుకున్న మంచి జరుగుతుందని భావిస్తారు.. కానీ అంతకుముందే ముందే బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా పండుగల సమయంలో అలాగే పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతోంది. అక్షయ తృతీయ తర్వాతా నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.. దీంతో నిజామాబాద్ మార్కెట్ లో వినియోగదారుల కళ కనిపిస్తోంది.. జువెలరీ షాపులు షో రూం లు కళకళ లాడుతున్నాయి.. పెళ్లిళ్ల కోసం జనాలు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు.. అయితే ఏటికేడు పెరుగుతున్న బంగారం ధరల ఎఫెక్ట్ పడుతోంది. గతంలో ఎక్కువ తులాల బంగారం కొనుగోలు చేసే వారు.. ఇప్పుడు ఆ పరిస్తితి లేదంటున్నారు జనాలు.. సగానికి పైగా తగ్గించేశామంటున్నారు.. 20 టీకాలు తీసుకునే వారు 10కి వచ్చారు.. 10 కొనేవారు ఐదు తులాలకు వచ్చారు.. బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ నమోదైన ధరల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61, 200 గా ఉంది. కాగా కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది. చదవండి: పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్డేట్ బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో జనాలకు షాక్‌కు గురి తప్పడం లేదు.. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. రానున్న కాలంలో తులం బంగారం ధర లక్ష కూడా చూస్తాం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు -
మోర్గాన్ సిక్సర్ల మోత
ఇంగ్లండ్ అభిమానులు ప్రపంచ కప్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇన్నింగ్స్ రానే వచ్చింది. సింగిల్ తీసినంత ఈజీగా సిక్సర్లు కొట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక్కసారిగా కప్‌కు ఊపు తెచ్చేశాడు. అతని దెబ్బకు అఫ్గాన్ ఆటగాళ్లు అసలైన పసికూనల్లా కనిపించారు. ఒకటి, రెండు, మూడు... ఇలా బ్యాట్‌కు తగిలిన వెంటనే అలా బంతి గాల్లో తేలిపోతూ స్టాండ్స్‌లోకి పడుతుంటే వారంతా ప్రేక్షకుల్లా నివ్వెరపోయి చూస్తుండటం మినహా ఏమీ చేయలేకపోయారు. ఎలా బంతి వేసినా అది చివరకు సిక్సర్‌గా మారాల్సిందే అన్నంత కసిగా మోర్గాన్ బాదడంతో మాంచెస్టర్ మైదానంలో పరుగుల పండగ సాగింది. చివరకు మోర్గాన్ లెక్క భారీ సెంచరీ సహా 17 సిక్సర్ల ప్రపంచ రికార్డు వద్ద ఆగింది... ఒక్క సిక్సర్లతోనే వంద పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన తమ కెప్టెన్‌కు తోడుగా బెయిర్‌స్టో, రూట్ కూడా రాణించడంతో ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్ లక్ష్యానికి అందనంత దూరంలో నిలిచిపోయి మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మాంచెస్టర్: రికార్డుల మోత మోగిన మ్యాచ్‌లో ఫేవరెట్ ఇంగ్లండ్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడి ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్ 150 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా... బెయిర్‌స్టో (99 బంతుల్లో 90; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (82 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆ అవకాశం చేజార్చుకున్నారు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (100 బంతుల్లో 76; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా అఫ్గానిస్తాన్ ఖాయమైంది. రెండు సెంచరీలు చేజారె... ఇంగ్లండ్‌కు బెయిర్‌స్టో మరోసారి శుభారంభం అందించాడు. రాయ్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన విన్స్ (26) పెద్దగా రాణించకపోయినా... 120 పరుగుల బెయిర్‌స్టో, రూట్ రెండో వికెట్ భాగస్వామ్యం ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేసింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ అఫ్గాన్ బౌలర్లు అందరిపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో 61 బంతుల్లో బెయిర్‌స్టో, 54 బంతుల్లో జో రూట్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. పార్ట్నర్షిప్ 100 పరుగులు దాటిన తర్వాత సెంచరీకి చేరువైన దశలో నైబ్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో నిష్క్రమించాడు. అనంతరం మోర్గాన్ మెరుపుల ముందు చాలా సేపు రూట్ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. 189 పరుగుల మోర్గాన్, రూట్ మూడో వికెట్ భాగస్వామ్యంలో మోర్గాన్ కొట్టినవి 142 పరుగులు కాగా, రూట్ 43 పరుగులు చేశాడు. చివరకు నైబ్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడబోయి లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఈ టోర్నీలో రూట్ మూడో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు ఔటైన తర్వాత చివర్లో మొయిన్ అలీ (9 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ 400 పరుగులకు చేరువగా వచ్చింది. ఆఖరి 2 ఓవర్లలో అలీ రెండేసి సిక్సర్లు బాదాడు. చివరి పది ఓవర్లలో ఇంగ్లండ్ 142 పరుగులు సాధించింది. హష్మతుల్లా మినహా... దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనలో అఫ్గాన్ ఏ దశలోనూ గట్టిగా నిలబడలేకపోయింది. రెండో ఓవర్లోనే నూర్ అలీ (0) ఔట్ కావడంతో సరైన ఆరంభమే లభించలేదు. కెప్టెన్ గుల్బదిన్ నైబ్ (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా, రహ్మత్ షా (74 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆ తర్వాత హష్మతుల్లా, అస్గర్ (48 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 90 బంతుల్లోనే 94 పరుగులు జోడించి కొద్దిగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నబీ (9) కూడా విఫలం కావడంతో విజయంపై అఫ్గాన్ ఆశలు కోల్పోయింది. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి’ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోర్గాన్‌ను నీకిష్టమైన షాట్ ఏదని అడిగితే... ‘సిక్సర్ కొట్టగలిగే ఏ షాట్ అయినా నాకిష్టమే’ అని చెప్పాడు! ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో (211 సిక్సర్లు) ఉన్న మోర్గాన్ విషయంలో ఆ వ్యాఖ్య అతిశయోక్తిగా అనిపించదు. అతని సిక్సర్ల సునామీ అఫ్గాన్ మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. డీప్ మిడ్‌వికెట్, లాంగాన్, లాంగాఫ్, డీప్ స్క్వేర్‌లెగ్, మిడాఫ్... ఇలా ఏ వైపు అంటే ఆ వైపు, ఎలా అనుకుంటే అలా మోర్గాన్ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. అతని దెబ్బకు పాపం అఫ్గాన్ బౌలర్లంతా బెంబేలెత్తిపోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ లెగ్‌స్పిన్నర్‌గా ప్రశంసలందుకుంటున్న రషీద్ ఖాన్ అయితే బంతి ఎలా వేయాలో తెలీక పూర్తిగా చేతులెత్తేశాడు. 30వ ఓవర్ చివరి బంతికి మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి రూట్ 45 పరుగుల వద్ద ఆడుతున్నాడు. సరిగ్గా 40 ఓవర్లు ముగిసే సరికి రూట్ స్కోరు 66 కాగా, మోర్గాన్ 67 వద్ద నిలవడం విశేషం! నైబ్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో మోర్గాన్ జోరు మొదలైంది. ఆ తర్వాత రషీద్ ఓవర్లో 2 సిక్సర్లు, మరో ఫోర్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ చెలరేగాడు. అదే ఓవర్లో 28 పరుగుల వద్ద మోర్గాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ వద్ద సునాయాసంగా అందుకోవాల్సిన క్యాచ్‌ను దౌలత్ పొరపాటుగా అంచనా వేయడంతో అఫ్గాన్ సువర్ణావకాశం కోల్పోయింది. నబీ బౌలింగ్‌లో సిక్స్‌తోనే 36 బంతుల్లో మోర్గాన్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిపోయిన ఇయాన్ తర్వాతి 21 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ మళ్లీ బాధితుడయ్యాడు. అతను వేసిన 43వ ఓవర్లో మోర్గాన్ మూడు సిక్సర్లు బాది ప్రపంచకప్‌లో నాలుగో వేగవంతమైన శతకం (57 బంతుల్లో) నమోదు చేశాడు. రషీద్ తర్వాతి ఓవర్లో కూడా రీప్లే చూపిస్తూ మళ్లీ 3 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన మోర్గాన్... నైబ్ ఓవర్లో కూడా మళ్లీ మూడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సిక్సర్లతోనే సెంచరీ సాధించిన మోర్గాన్ ఇన్నింగ్‌లో అలా ఉండీ లేనట్లు నాలుగు ఫోర్లు మాత్రం ఉన్నాయి. 17వ సిక్సర్ కొట్టగానే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో షాకు క్యాచ్ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. నాలుగు రోజుల క్రితం వెన్నునొప్పితో బాధపడుతూ మీడియా సమావేశంలో నిలబడి మాట్లాడిన మోర్గాన్ ఒక దశలో ఈ మ్యాచ్ ఆడటం కూడా సందేహంగానే మారింది. కానీ అతను ఆడటమే కాదు అదరగొట్టాడు. 9 ఓవర్లలో 110 పరుగులు... ప్రపంచవ్యాప్తంగా టి20 క్రికెట్లో స్టార్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకొని అఫ్గాన్ జట్టు ఆశలు మోస్తున్న లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌లో భారీ దెబ్బ పడింది. మోర్గాన్ దెబ్బకు ఎవరూ ఆశించని చెత్త రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (110) ఇచ్చిన బౌలర్‌గా వహాబ్ రియాజ్ (110)తో సమంగా నిలిచిన రషీద్, వన్డేల్లో 100కు పైగా పరుగులు ఇచ్చిన తొలి స్పిన్నర్. ఓవరాల్‌గా వన్డేల్లో మిక్ లూయీస్ (113) తర్వాత ఇది రెండో చెత్త ప్రదర్శన. కాగా... ఎకానమీ (9 ఓవర్లలోనే 110 పరుగులు ఇవ్వడం; ఓవర్‌కు 12.22 పరుగులు) పరంగా చూస్తే దీనికే అగ్రస్థానం దక్కుతుంది. రషీద్ బౌలింగ్‌లో మోర్గాన్ ఒక్కడే 7 సిక్సర్లు బాదగా... మొత్తంగా 11 సిక్స్‌లతో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా ఎవరూ కోరుకోని గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: విన్స్ (సి) ముజీబ్ (బి) దౌలత్ 26; బెయిర్‌స్టో (సి అండ్ బి) నైబ్ 90; రూట్ (సి) రహ్మత్ షా (బి) నైబ్ 88; మోర్గాన్ (సి) రహ్మత్‌షా (బి) నైబ్ 148; బట్లర్ (సి) నబీ (బి) దౌలత్ 2; స్టోక్స్ (బి) దౌలత్ 2; మొయిన్ అలీ (నాటౌట్) 31; వోక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–44, 2–164, 3–353, 4–359, 5–362, 6–378. బౌలింగ్: ముజీబ్ 10–0–44–0, దౌలత్ 10–0–85–3, నబీ 9–0–70–0, గుల్బదిన్ నైబ్ 10–0–68–3, రహ్మత్ షా 2–0–19–0, రషీద్ ఖాన్ 9–0–110–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: నూర్ అలీ (బి) ఆర్చర్ 0; నైబ్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; రహ్మత్ షా (సి) బెయిర్‌స్టో (బి) ఆదిల్ రషీద్ 46; హష్మతుల్లా (బి) ఆర్చర్ 76; అస్గర్ (సి) రూట్ (బి) ఆదిల్ రషీద్ 44; నబీ (సి) స్టోక్స్ (బి) ఆదిల్ రషీద్ 9; నజీబుల్లా (బి) వుడ్ 15; రషీద్ ఖాన్ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 8; ఇక్రమ్ (నాటౌట్) 3; దౌలత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–4, 2–52, 3–104, 4–198, 5–210, 6–234, 7–234, 8–247. బౌలింగ్: వోక్స్ 9–0–41–0, ఆర్చర్ 10–1–52–3, మొయిన్ అలీ 7–0–35–0, వుడ్ 10–1–40–2, స్టోక్స్ 4–0–12–0, ఆదిల్ రషీద్ 10–0–66–3. 1: వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17) కొట్టిన ఆటగాడు మోర్గాన్. గతంలో రోహిత్, డివిలియర్స్, గేల్ 16 చొప్పున సిక్సర్లు బాదారు. 1: ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన జట్టు (25)గా ఇంగ్లండ్ నిలిచింది. 1: ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తమ అత్యధిక స్కోరు (397) నమోదు చేసింది. ప్రపంచకప్‌లో నేడు దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్ మార్కెట్ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్ పరుగు సంబరాల్లో బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తదితరులు రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే..! 1. రేట్ల కోత అంచనాలు గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు. 2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు.... గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది. 3. భారీగా చమురు ధరల పతనం ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి. 4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 5. పుంజుకున్న రూపాయి డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది. 6. జూన్ రోల్ ఓవర్ల జోరు జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్ ఓవర్స్ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్‌టర్మ్ ట్రెండింగ్ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 7. హెవీ వెయిట్స్ ర్యాలీ సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే 311 పాయింట్లుగా ఉంది. మరిన్ని విశేషాలు... ► 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► బీఎస్ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. ► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్ షేర్ 6 శాతం లాభంతో రూ.2,843 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి. ► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. ► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ షేర్ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది. ► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్ 20 శాతం మేర పతనమైంది. ► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి -
ఆడి రికార్డు అమ్మకాలు
బెర్లిన్: జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ ఆడి 2016 లో దూసుకుపోయింది. గత సంవత్సరం డీజిల్ ఉద్గారాలు కుంభకోణంలో అభియోగాలు, ప్రత్యర్థుల గట్టి పోటీ ఉన్నప్పటికీ, విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఫోక్స్ వ్యాగన్ గ్రూపు లగ్జరీకార్లు, స్పోర్ట్స్ యుటిలీటీ వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2015 నాటి 1.80 మిలియన్ల వాహనాల విక్రయాలతో పోలిస్తే 2016, డిసెంబర్ అమ్మకాల్లో 1.87 మిలియన్ యూనిట్లను సాధించినట్టు కంపెనీ ప్రతినిధి శనివారం వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లో నెం. 2గా ఉన్న ఆడి బ్రిటన్ లో 6.4 శాతం, యునైటెడ్ స్టేట్స్ లో 4 శాతం, ఎక్కువ అమ్మకాలు సాధించింది. అయితే కంపెనీ అధికారిక లెక్కల్ని సోమవారం (జనవరి 9) ప్రకటించనుంది. అయితే ఎమిషన్స్ స్కాంతో గ్లోబల్ లగ్జరీ కార్ల బ్రాండ్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయినా అమ్మకాల్లో హవా కొనసాగించింది.ప్రదాన పత్యర్థులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలతో పోలిస్తే ర్యాకింగ్స్ లో రెండు స్థానాలు వెనుకబడిందని నిపుణుల అంచనా. మరోవైపు ఉద్గారాల కుంభకోణంపై ఇంకా ఎలాంటి తీర్పు వెలువడకపోయినప్పటికీ.... లగ్జరీ కార్ మేకర్ ఆడి అమెరికాలో డీజిల్ కార్ల అమ్మకాలను మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.