పొట్టి క్రికెట్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ | T20 World Cup 2021: India Vs Pakistan Match Recorded As Most Viewed T20 International | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: పొట్టి ఫార్మాట్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన దాయాదుల సమరం

Published Tue, Nov 9 2021 6:11 PM | Last Updated on Tue, Nov 9 2021 6:13 PM

T20 World Cup 2021: India Vs Pakistan Match Recorded As Most Viewed T20 International - Sakshi

India Vs Pakistan Match In T20 WC 2021 Recorded As Most Viewed T20I: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా అక్టోబర్‌ 24న జరిగిన మ్యాచ్‌ వీక్షకుల పరంగా ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఈ మ్యాచ్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 

అంతకుముందు, టీ20 ప్రపంచకప్‌-2016లో భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచకప్‌-2021లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను(క్వాలిఫయర్లు, సూపర్-12 దశ మ్యాచ్‌లు) మొత్తం 238 మిలియన్ల మంది వీక్షించారని స్టార్ ఇండియా పేర్కొంది. 

ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతుందని ఊరించి, ఉసూరుమనిపించిన దాయాదుల పోరులో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌ భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో దారుణంగా నిరాశపరచిన టీమిండియా పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలై సెమీస్‌ దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది. 
చదవండి: Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement