Viewership
-
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటివరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు. ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. -
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
CWC 2023: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. తొలి ఓవర్లోనే రికార్డులు బద్దలు
చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. తొలి ఓవర్లోనే రికార్డులు బద్దలు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన భారత్-పాక్ మ్యాచ్ వ్యూయర్షిప్ పరంగా ప్రారంభంలోనే రికార్డులు బద్దలుకొట్టింది. తొలి ఓవర్లో రికార్డు స్థాయిలో కోటిన్నర మంది హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను వీక్షించారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్లో ఈస్థాయిలో మ్యాచ్‌ను వీక్షించడం ఇదే మొదటిసారి. ఇదే కొనసాగితే వ్యూయర్షిప్ పరంగా ఈ మ్యాచ్ ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయం. ఇదిలా ఉంటే, టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ఆశించినట్లు ఆరంభ ఓవర్లలో వికెట్లు దక్కనప్పటికీ.. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లో బౌండరీ మినహాయించి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరో ఎండ్‌లో సిరాజ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన తొలి ఓవర్లో ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. 6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 28/0గా ఉంది. ఇమామ్ ఉల్ హాక్ (14), అబ్దుల్లా షఫీక్ (13) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 3 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. -
ధోనితో సమానంగా గిల్.. రికార్డులు బద్దలు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతొ విజయాన్ని అందుకుంది. కాగా మాములుగానే ఈ సీజన్లో ఒక ఐపీఎల్ మ్యాచ్‌ను కోటికి తగ్గకుండా వీక్షిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో నమోదవ్వని టీఆర్పీ రేటింగ్ ఈసారి నమోదవుతుంది. Photo: IPL Twitter ముఖ్యంగా ఈ సీజన్లో సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌కు వ్యూయర్షిప్ కనీసం రెండుకోట్లు దాటుతుంది. అందునా కేవలం ధోనిని చూడడం కోసమే ఇదంతా. ఇక తెరపై ధోని కనిపిస్తే టీఆర్పీ రేటింగ్స్ బద్దలవడం ఖాయం. ఇప్పటివరకు ఈ సీజన్లో ధోని బ్యాటింగ్‌ను 2.5 కోట్ల మంది వీక్షించారు. తాజాగా ఆ రికార్డును గిల్ సమం చేశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను దాదాపు 2.5 కోట్లకు పైగా వీక్షించడంతో సరికొత్త రికార్డు నమోదయింది. Photo: IPL Twitter అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు జియో సినిమా వ్యూయర్షిప్ 2.5 కోట్లకు తగ్గలేదు. ఇక మ్యాచ్‌లో గిల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కాగా.. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా.. టీమిండియా నుంచి రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు కోహ్లి, బట్లర్లు ఒకే సీజన్లో నాలుగేసి సెంచరీలు బాది సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. 2.5 Crore was watching Shubman Gill bat on JioCinema. Joint peak in IPL 2023 - This is Gill Era. pic.twitter.com/JiMFLJI502 — Johns. (@CricCrazyJohns) May 26, 2023 His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత.. ధోని తర్వాత శుభ్‌మన్ గిల్‌దే..! -
జియో సినిమా రికార్డ్ బద్దలు!
IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వీక్షకుల సంఖ్యను సాధించింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో జియోసినిమా యాప్ ఏకకాల వీక్షకుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. కాగా ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. జియో సినిమాలో ఇంతకుముందున్న వీవర్స్ రికార్డు 2.4 కోట్లు. ఇది ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ సందర్భంగా నమోదైంది. భారతదేశంలోని వీక్షకులందరికీ జియో సినిమా ఐపీఎల్ 2023ని ఉచితంగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 1300 కోట్ల వీవ్స్ వీక్షకుల ఎంగేజ్మెంట్ పరంగా జియో సినిమా రోజూ కొత్త మైలురాళ్లను దాటుతూనే ఉంది. ఈ యాప్‌లో మొత్తం వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటాయి. ఇది ప్రపంచ రికార్డు అని ఆ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రీమింగ్ యాప్ ఐపీఎల్ కారణంగా రోజూ లక్షల కొద్దీ కొత్త వీక్షకులను సంపాదిస్తూనే ఉంది. ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో మ్యాచ్‌కి సగటు స్ట్రీమింగ్ సమయం ఇప్పటికే 60 నిమిషాలు దాటిపోయిందని కంపెనీ పేర్కొంది. ఇక స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనదారుల పరంగా జియో సినిమా 26 మార్క్యూ స్పాన్సర్లను సాధించగలిగింది. ఏ క్రీడా ఈవెంట్‌కైనా ఇదే అత్యధికం. ఇదీ చదవండి: జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు -
ఐపీఎల్లో అదరగొట్టేస్తున్న రిలయన్స్.. ధోనీ రాకతో మారిన సీన్!
దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా పేరొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఎల్ విభాగంలో అదరగొట్టేస్తుంది. రిలయన్స్‌కు చెందిన ‘జియోసినిమా’ యాప్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ బ్రాడ్‌కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్ 18 ప్రకటించింది. శుక్రవారం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 1.47 బిలియన్ల వ్యూస్ (147 కోట్ల వ్యూస్) లభించాయి. ఏకంగా 5 కోట్ల (5మిలియన్లు) మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని వయాకామ్ 18 తెలిపింది. గత వారం (శుక్రవారం- ఆదివారం)లో జియో సినిమా యాప్‌కు వచ్చిన వ్యూస్ మొత్తం మార్చి 26, 2022 నుండి మే 29, 2022 వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ డిజిటల్ వ్యూస్‌ను దాటి సరికొత్త రికార్డ్లను నమోదు చేసినట్లు వయోకామ్ 18 పేర్కొంది. వయోకామ్ 18 ఐపీఎల్ రైట్స్ 2023 నుంచి 2027 వరకు డిజిటల్ ప్రసార హక్కుల్ని వయోకామ్ 18 సంస్థ 2.89 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు డిజిటల్ రైట్స్‌ను డిస్నీ దక్కించుకుంది. మరోవైపు వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల్ని డిస్నీకి చెందిన స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. అయితే శుక్రవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్‌కి 8.7 బిలియన్ మినిట్స్‌ను వీక్షించినట్లు తెలిపింది. అదే సమయంలో జియో సినిమా యాప్‌లో 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయని వయోకామ్ 18 స్పోర్ట్స్ సీఈవో అనిల్ జయరాజ్ తెలిపారు. సాహో ధోనీ ఫార్మాట్ ఏదైనా, మైదానం ఎక్కడైనా , ప్రత్యర్థి ఎవరైనా, ఏ రంగు బంతి అయినా రికార్డులు బ్రేక్ చేయడం ధోనీకి కొత్త కాదు. కానీ అతడు బ్యాటింగ్ చేస్తుంటే టీవీ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని మీకు తెలుసా? అవును నిజమే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ ఈ మ్యాచ్‌లో లక్నోపై 12 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఆడింది కేవలం మూడే మూడు బంతులు. అందులో తొలి రెండు బంతులను రెండు సిక్సర్లు బాది బౌలర్ల కళ్లు తేలేసేలా చేశాడు. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో జియో సినిమాను ఏకంగా 1.7 కోట్ల మంది వీక్షించారు. ఇక ధోనీ బ్యాటింగ్‌కు వస్తుండగా జియో సినిమా వ్యూయర్ షిప్ ఒక్కసారిగా 30 లక్షలు పెరిగింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను లైవ్‌లో 1.6 కోట్ల వీక్షించారు. దీంతో వ్యూయర్ షిప్లో ధోనీ తన రికార్డ్లను తానే బ్రేక్ చేసినట్లైంది. -
ఏంది ఈ అరాచకం.. రెండు సిక్సర్లకే!
వయసు పెరుగుతుంటే క్రేజ్ తగ్గుతుందంటారు.. కానీ ధోని విషయంలో మాత్రం అది రివర్స్‌లా కనిపిస్తుంది. 40 ఏళ్ల వయస్సులోనూ తనకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఐపీఎల్ 16వ సీజన్ చెప్పకనే చెబుతుంది. ఎంతలా అంటే సీఎస్కే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని ఒక్కసారి కనిపించినా అటు మైదానంలో తలా అభిమానుల గోల మాములుగా ఉండడం లేదు.. ఇదే అనుకుంటే అతను బ్యాటింగ్ చేస్తుంటే జియో సినిమాలో వ్యూయర్షిప్ రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ధోని కూడా తన ఆట స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు ధోని క్రీజులోకి వస్తే కుదురుకోవడానికి సమయం తీసుకునేవాడు. అలా చాలా మ్యాచ్‌ల్లో నిలబడే ప్రయత్నంలో ఒక్కోసారి ఔటయ్యేవాడు. అయితే ఈసారి ధోని గేర్ మార్చాడు. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ధోని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ బాదుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా సీజన్లో రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని ఇదే స్టైల్‌ను అనుకరించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో ఏడు బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇక సోమవారం లక్నోతో మ్యాచ్‌లోనూ ధోని అదే దూకుడును ప్రదర్శించాడు. మూడు బంతులాడిన ధోని రెండు సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే వచ్చిన ప్రతీసారి సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అభిమానులు కూడా తన నుంచి ఇదే ఆశిస్తున్నారని ధోని గ్రహించాడు. ఈ నేపథ్యంలోనే లక్నోతో మ్యాచ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లకు స్టేడియం అభిమానుల గోలతో దద్దరిల్లిపోయింది. ధోని మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మొదలైన అరుపులు అతను ఔట్ అయ్యేవరకు కొనసాగాయి. చెపాక్ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో హోరెత్తింది. ఇక మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్. మొదటి బంతిని మార్క్‌వుడ్ 148.7 కిమీ వేగంతో వేయగా.. థర్డ్‌మన్ దిశగా సిక్సర్ బాదాడు. అంతే స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఈ దెబ్బకు మార్క్‌వుడ్ కూడా కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత బంతిని ధోని మరోసారి సిక్సర్ బాదాడు. అంతే స్టేడియంలో అరుపులు ఎంత ఉన్నాయంటే డెసిబల్స్ కూడా కొలవలేనంతగా. ఇది కేవలం స్టేడియంలో జరిగిన విధ్వంసం మాత్రమే. ఇక ఐపీఎల్ డిజిటల్ రైట్స్ హక్కులు కొనుగోలు చేసిన జియో సినిమాలో వ్యూయర్షిప్ రికార్డులు బద్దలయ్యాయి. ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్‌లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డుగా మిగిలిపోయింది. ఇంతకముందు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను లైవ్‌లో 1.6 కోట్ల మంది చూశారు. తాజా దానితో ధోని తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఏంది ఈ అరాచకం.. కేవలం రెండు సిక్సర్లకే ఇలా రికార్డులు బద్దలయితే.. ధోని ఎక్కువసేపు క్రీజులో ఉంటే ఎలా ఉంటుందనేది ఊహించుకోవడానికి భయంగా ఉంది అంటూ కొంతమంది ఫ్యాన్స్ పేర్కొన్నారు. మనకు తెలిసి ఒక క్రికెటర్‌ను ఇంతలా అభిమానించడం ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసి ఉండం.. ధోనినా మజాకా. The entry of MS Dhoni into Chepauk after 4 long years. pic.twitter.com/7YP60XWXlU — Johns. (@CricCrazyJohns) April 4, 2023 A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT — IndianPremierLeague (@IPL) April 3, 2023 చదవండి: 'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్ టైమ్ రికార్డ్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్ టైమ్ వ్యూయర్షిప్ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. Thanks for all the love!! 🫶🏼#Farzi #FarziOnPrime pic.twitter.com/zcjqkQyW6x — Raj & DK (@rajndk) March 25, 2023 -
ఆస్కార్ వేడుక.. నంబర్‌వన్‌గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్‌ను లైవ్ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గతేడాదితో ఆస్కార్‌తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. ఎన్టీఆర్ నంబర్ వన్ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారని సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్‌లో ఆర్ఆర్ఆర్ అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. -
T20 WC 2022: గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన ఇండియా-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ వీరోచితంగా పోరాడి టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ పలు వ్యక్తిగత రికార్డులకు వేదిక కావడంతో పాటు వ్యూయర్షిప్ పరంగా గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఈ సండే ధమాకా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించగా.. డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ హాట్ స్టార్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఇవాల్టి మ్యాచ్‌ను డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ ప్లాట్‌ఫాం చరిత్రలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఆసియా కప్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌కు కోటి 30 లక్షల వ్యూస్ లభించగా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫాంపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, టీ20 క్రికెట్లో అసలుసిసలైన మజా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో దొరికింది. చివరి నిమిషం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో టీమిండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడంతో భారత్ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని సాధించింది. చదవండి: Ind Vs Pak: విరాట్ వీరోచిత పోరాటం.. సలాం కొడుతున్న క్రీడాలోకం -
రికార్డులు తిరగరాసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్
IND VS PAK: ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న జరిగిన దాయాదుల సమరం ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించడంతో పాటు వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్ స్టార్) ఈ మ్యాచ్‌ను కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు సమాచారం. డిస్నీ హాట్ స్టార్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌గా కూడా నిలిచింది. 1.3 Crores highest peak viewership was recorded during IND vs PAK game on hotstar.#AsiaCup #AsiaCup2022 #INDvsPAK pic.twitter.com/S1PrTUhbs1 — Dr. Cric Point 🏏 (@drcricpoint) August 28, 2022 ఓటీటీలో ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్ రికార్డు ఐపీఎల్ మ్యాచ్ పేరిట ఉంది. 2019 ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 18 మిలియన్ల మంది వీక్షించారు. ఓటీటీ చరిత్రలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానం కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిటే ఉండింది. అదే సీజన్లో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌కు 12 మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది. తాజాగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ ఈ రికార్డును బద్దలు కొట్టిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నిన్న (ఆగస్ట్ 28) పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: పాక్ ఓటమికి అది కూడా ఒక కారణమే..! -
చేతిలో ఉంటేనే.. పేపర్ చదివినట్టు!
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేవగానే వార్తా పత్రిక చదవనిదే కొందరికి ఏమీ తోచదు. ఎన్ని టీవీ చానళ్లు వచ్చినా.. ఈ–పేపర్లు, డిజిటల్ ఎడిషన్లు వచ్చినా.. సోషల్ మీడియాలో పొద్దంతా వార్తలు సర్క్యులేట్ అవుతున్నా.. చేతిలో పత్రిక పట్టుకుని చదివితేనే తృప్తి. స్మార్ట్ఫోన్ల శకం మొదలయ్యాక న్యూస్ పేపర్ల డిజిటల్ ఎడిషన్లకు డిమాండ్ పెరిగినా.. న్యూస్ పేపర్లకు ఆదరణ తగ్గలేదని భారతదేశంలో ఈ అలవాటు ఎక్కువగా ఉందని ‘స్టాటిస్టా గ్లోబల్ కన్సూ్యమర్ సర్వే’ తేల్చింది. ముఖ్యంగా దేశంలోని పట్టణాల్లో 54 శాతం మంది.. రోజూ న్యూస్ పేపర్ చదువుతామని చెప్పినట్టు వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి ఏడాది మార్చి మధ్య 50 దేశాల్లో ఈ సర్వే చేసినట్టు తెలిపింది. -
ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆ రెండు సినిమాల ప్రభావం..!
ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీసీసీఐను రెండు పాన్ ఇండియా సినిమాలు భారీగా దెబ్బకొట్టాయి. రాజమౌళి ట్రిపుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్-2 సినిమాల ప్రభావం ఐపీఎల్ వ్యూయర్షిప్పై పడింది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కి అనుకున్నంత వ్యూయర్షిప్ రావడం లేదన్నది బహిరంగ రహస్యం. 2020 సీజన్‌తో పోలిస్తే రెండు విడతలుగా నడిచిన 2021 సీజన్‌కి డబుల్ టీఆర్పీ రాగా, ప్రస్తుత సీజన్లో ఆ రేటింగ్ సగానికి సగం పడిపోయింది. ఐపీఎల్ 2022 ప్రారంభమైన (మార్చి 26) తొలి మూడు వరాలు ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కారణంగా 30 శాతం టీఆర్పీ పడిపోగా... నాలుగో వారం ‘కేజీఎఫ్ 2’ ఎంట్రీతో రేటింగ్ ఊహించని స్థాయికి దిగజారింది. వ్యూయర్షిప్ పడిపోవడానికి ఈ రెండు సినిమాలు ఓ కారణమైతే.. ఐపీఎల్‌కు కళ తెచ్చిన రెండు అగ్రశ్రేణి జట్లు (ముంబై, సీఎస్కే) ఈ సీజన్లో దారుణంగా విఫలం కావడం మరో కారణం. 2021 సీజన్లో ఒక్కో మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సగటున 2 నుంచి 5 మిలియన్ల వరకు వీక్షించగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. గరిష్టంగా 50 నుంచి 60 లక్షల మంది మాత్రమే ప్రస్తుత సీజన్ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షిస్తున్నారు. చదవండి: ఢిల్లీ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా..పంజాబ్‌తో నేటి మ్యాచ్ సాధ్యపడేనా..? -
IPL 2022: రికార్డులు బద్ధలు కొట్టిన చెన్నై, ఆర్సీబీ మ్యాచ్..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 12) జరిగిన రసవత్తర మ్యాచ్.. వ్యూయర్షిప్ పరంగా రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ మ్యాచ్ ప్రస్తుత సీజన్లో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. సీఎస్కే బ్యాటింగ్ ఆఖరి 5 ఓవర్ల సమయంలో ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే రికార్డు. చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో మ్యాచ్‌కు అమాంతం వ్యూయర్షిప్ పెరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో మ్యాక్స్‌వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయాష్ ప్రభుదేశాయ్ (34), దినేష్ కార్తీక్ (34) పోరాటం చేస్తుండగా కూడా వీక్షకుల సంఖ్య పీక్స్‌కు చేరింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: రషీద్ ఖాన్ రేంజ్లో మేము లేము.. ఎస్ఆర్హెచ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే!
‘‘ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్ నుంచి ఎప్పుడూ మంచి స్పందన ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల ఇలాంటి కథలకు మరింత ఆదరణ పెరిగింది’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నారు. ఈ విషయంపై రకుల్ మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాల రిలీజ్లు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా వ్యూయర్స్ చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇటు పాన్ ఇండియన్ మూవీ బిజినెస్ విషయంలో ‘బాహుబలి’ అన్ని కోణాల్లో కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులూ చెరిగిపోయాయి. మంచి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్ చేయడంతో పాటు నా పాత్ర కథను నడిపించే లా ఉండాలి’’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు రకుల్. వీరి పెళ్లిపై త్వరలో ఓ స్పష్టత రానుంది. -
పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్
India Vs Pakistan Match In T20 WC 2021 Recorded As Most Viewed T20I: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ వీక్షకుల పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఈ మ్యాచ్ పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధికంగా మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్-2016లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచకప్-2021లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను(క్వాలిఫయర్లు, సూపర్-12 దశ మ్యాచ్‌లు) మొత్తం 238 మిలియన్ల మంది వీక్షించారని స్టార్ ఇండియా పేర్కొంది. ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతుందని ఊరించి, ఉసూరుమనిపించిన దాయాదుల పోరులో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో దారుణంగా నిరాశపరచిన టీమిండియా పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది. చదవండి: Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు -
ఇండియా పాక్ మ్యాచ్.. అక్కడ కూడా ఫ్లాప్.. కానీ రూ.300 కోట్లు వెనక్కి
Hotstar Ad Revenue During Ind Vs Pak T20 Match: టీ 20 ప్రపంచకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ భారత అభిమానులకు నిరాశ కలిగించినా హాట్‌స్టార్‌కు మాత్రం ఆనందాన్నే పంచింది.ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే పెట్టుబడిలో మూడొంతులు ఆ సంస్థకు వచ్చేసింది. హాట్‌స్టార్ హ్యాపీయేనా ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. కోట్లాది మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈసారి టీ20 మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా జరగడంతో కర్ఫ్యూ తరహా వాతావరణం ఎక్కువ సేపు లేదు. అయినా సరే ఈ మ్యాచ్ డిజిటల్ ప్రచార హక్కులు దక్కించుకున్న హాట్‌స్టార్ బాగానే సొమ్ము చేసుకుంది. విరాట్ కోసం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా హయ్యస్ట్ వ్యూయర్ షిప్‌గా 14 మిలియన్లుగా నమోదు అయ్యింది. మ్యాచ్ 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన సందర్భంలో హాట్‌స్టార్‌లో 1.40 కోట్ల మంది మ్యాచ్‌ని వీక్షించారు. మొత్తం మ్యాచ్‌లో ఇదే అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన సమయంగా నిలిచింది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ మొదలై మొదటి పది ఓవర్లు ముగిసే సరికి వ్యూయర్షిప్ సగానికి సగం పడిపోయి 7.5 మిలియన్ల దగ్గర నమోదయ్యింది. ఆడకపోయినా అండగా భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ అనగానే టాస్ వేయడం ఆలస్యం హాట్‌స్టార్‌లో వ్యూయర్ షిప్ అలా అలా పెరుగుతూ పోయింది. మొదటి బాల్ వేసే సమయానికే 4.1 మిలియన్ల మంది హాట్‌స్టార్‌కి అతుక్కుపోగా మూడో బాల్ వేసే సరికి ఆ సంఖ్య 5.9 మిలియన్లకి చేరుకుంది. ఓపెనర్లు త్వరగా అవుటైపోయినా అభిమానులు నమ్మకం కోల్పోలేదు. విరాట్ ఉన్నాడనే భరోసాతో భారత్ బ్యాటింగ్ పూర్తయ్యే వరకు 10 మిలియన్లకు పైగానే వీక్షకులు ఉన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. రూ. 300 కోట్లు ఇండియాపై పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకి ఉన్న పాత రికార్డును చెరిపేసింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ మ్యాచ్‌లో యాడ్స్ ప్రసారం చేయడం ద్వారా హాట్‌స్టార్‌కి ఏకంగా రూ.300 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఈ హైటెన్షన్ మ్యాచ్‌కి ప్రీమియం టారిఫ్‌లు అమలు చేశారు. దీంతో రికార్డు స్థాయి ఆదాయం దక్కింది. ఈ వరల్డ్ కప్ డిజిటల్ హక్కులకు హాట్‌స్టార్ రూ. 1000 కోట్లు వెచ్చించగా ఒక్క పాక్ ఇండియా మ్యాచ్‌తోనే రూ. 300 కోట్లు వెనక్కి వచ్చేశాయి. రికార్డు పదిలం ఐపీఎల్ 13వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి ఏకంగా 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇండియా, పాక్ మ్యాచ్ ఈ రికార్డును బద్దుల కొడుతుందని అంతా అంచనా వేశారు. కానీ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో అభిమానులు సైతం మ్యాచ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. -
ఐపీఎల్ 2021 సీజన్లో ఎవరి మ్యాచ్‌లు ఎక్కువగా చూశారంటే..
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే దుమ్మురేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. సీఎస్కే తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లను టీవీల్లో జనాలు ఎక్కువగా వీక్షించినట్లు బార్క్ (బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) తెలిపింది. ఐపీఎల్ 2020 సీజన్లో దారుణ ప్రదర్శనతో నిరాశపరిచిన సీఎస్కే ఈ సీజన్లో దుమ్మురేపడంతో పాటు.. భారీగా వీక్షకులను పెంచుకుంది సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌కు కనీసం 2-3 శాతం వీక్షకులు పెరగడం విశేషం. సీఎస్కే ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని చెన్నై మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి సీఎస్కే మ్యాచ్‌లు ఎక్కువ మంది చూసినట్లు బార్క్ ప్రకటించింది. సీఎస్కే తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. చదవండి: IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది! Courtesy: IPL Twtitter కాగా ఐపీఎల్ మ్యాచ్‌లన్ని స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్‌స్పోర్ట్స్ హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో మ్యాచ్‌లు ప్రసారమవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 మధ్యబార్క్) నివేదిక ప్రకారం స్టార్‌స్పోర్ట్స్ హిందీ చానెల్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2021 ఫేజ్2 ప్రారంభమైన తర్వాత ఒక వారంలో స్టార్‌స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ మూడోస్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. బార్క్ నివేదిక ప్రకారం తొలి రెండు స్థానాల్లో సన్‌టీవీ, స్టార్‌ప్లస్ ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 తొలిఫేజ్ మ్యాచ్‌లు జరిగిన అన్ని వారాలు స్టార్‌స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ తొలి స్థానంలో కొనసాగడం విశేషం. కాగా ఐపీఎల్ సెకండ్‌ఫేజ్‌లో తొలివారం దాదాపు 400 మిలియన్ల మంది మ్యాచ్‌ను వీక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలిదశలో 35 మ్యాచ్‌లు ముగిసేసరికి 380 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది. ఐపీఎల్ 2020 కంటే 12 మిలియన్లు ఎక్కువగా ఉండడం విశేషం. చదవండి: Virat Kohli Celebration: సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
లీడ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్.. వీక్షకుల(వ్యూయర్షిప్) పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత మూడేళ్లలో టీమిండియా ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్‌కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్ వెల్లడించింది. 2018 ఇంగ్లండ్ పర్యటనతో పోలిస్తే ఈ సిరీస్ సగటు వ్యూయర్షిప్ 30 శాతం పెరిగినట్లు సదరు సంస్థ ప్రకటించింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ చివరి రోజు ఆటకు ఏకంగా 70 శాతం వరకూ రేటింగ్స్ పెరిగినట్లు పేర్కొంది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందన్న అంచనాతో ఆఖరి రోజు ఆటను భారీగా వీక్షించినట్లు తెలిపింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు సుమారు 80 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయని, భారత జట్టు విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వచ్చిన అత్యధిక ఇంప్రెషన్స్ ఇవేనని ఛానెల్ ప్రతినిధులు పేర్కొన్నారు. లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా గెలుపు తర్వాత తమ ఛానెల్‌కు మరిన్ని బ్రాండ్లు క్యూ కట్టాయని వారు తెలిపారు. కాగా, భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌కు ఇప్పటికే 12 అంతర్జాతీయ బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 4న ప్రారంభమైన ఈ సిరీస్‌లో ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతుండగా, మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. చదవండి: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్ -
కొత్త అప్డేట్, ఇక యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు
క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడియన్స్ నుంచి యూట్యూబ్ క్రియేటర్ల మనీ ఎర్నింగ్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్లు వ్యూవర్స్ నుంచి నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించినట్లైంది. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు క్రియేటర్లు మంచి కంటెంట్‌ను అందించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాటికి పోటీగా యూట్యూబ్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటర్ల నుంచి పోటీని ఎదుర్కొనేలా యూట్యూబ్ క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఫీచర్ ద్వారా వ్యూవర్స్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ సుమారు రూ.150 నుండి రూ.3,730 వరకు చెల్లించవచ్చు. తద్వారా తమ అభిమాన యూట్యూబ్ ఛానల్ లో మద్దతు ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుందని యూట్యూబ్ ప్రకటించింది. సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నుంచి మనీ డొనేట్ చేస్తే వారి పేర్లు కామెంట్ సెక్షన్లో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాలలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ ప్రతినిథులు అధికారికంగా వెల్లడించారు. కాగా,ఇప్పటికే యాడ్స్, ఛానల్ సబ్‌స్కిప్షన్,లైవ్ స్ట్రీమ్‌లో సూపర్ చాట్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండగా..మనీ ఎర్నింగ్ కోసం మరో ఫీచర్ అందుబాటులోకి తేవడంపై ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు, యూట్యూబ్ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియాలో ఎన్ని ఇళ్లలో టీవీలు ఉన్నాయో తెలుసా?
ముంబై: ఇండియాలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. 2020 ఆఖరు నాటికి టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6 శాతం పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్(బార్క్) గురువారం వెల్లడించింది. దేశంలో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలు ఉన్నాయని పేర్కొంది. 2018 సంవత్సరాంతానికి 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7 శాతం పెరిగింది, పురుషులు 6 శాతం పెరిగారు. 2018లో దేశంలో టీవీ చూసే వారి సంఖ్య 83.6 కోట్లు కాగా, 2020 నాటికి 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా, దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్ ప్రకటించింది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందుకే టీవీ వీక్షణం పెరిగిందని తెలియజేసింది. దేశంలో ఇంకా 9 కోట్ల గృహాల్లో టీవీలు లేవని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుతుండడంతో ప్రసార, వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా చెప్పారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే టీవీ వీక్షకులు పెరుగుతుండడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఇది విన్నారా.. శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్.. ఎందుకంటే? -
బిగ్‌బాస్ 4 నయా రికార్డు, ఆన్లైన్లో..
బిగ్‌బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 19 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా అభిజిత్ నిలిచాడు. ఇక అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్! కాగా బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు అమితంగా ఆదరించడంతో టీఆర్పీ రేటింగ్‌లోనూ ఈ షో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌లో పాత రికార్డులను తుడిచిపెడుతూ నయా రికార్డులు రాసింది. తాజాగా ఆన్లైన్ వేదికగా అత్యధిక వీక్షకాదరణ పొందిన కార్యక్రమంగా బిగ్‌బాస్ సీజన్ 4 నిలిచింది. ఈ విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ నిర్వహించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే 75శాతం వీక్షకులను బిగ్‌బాస్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో కార్తీక దీపం సీరియల్ నిలిచిందని పేర్కొంది. బిగ్‌బాస్ షో మొత్తంలో 86వ ఎపిసోడ్ అత్యధిక ఓట్ల వెల్లువ అందుకుందని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీకి నాన్ మెట్రల్లో వీక్షకుల సంఖ్య 117శాతం పెరిగిందని ఈ పరిశోధన వెల్లడించింది. అలాగే తమ ప్లాట్ ఫామ్ మీద ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాగా ‘ప్రతి రోజూ పండగే’ నిలిచిందని వివరించింది. మొత్తంగా వినోద కార్యక్రమాలను వీక్షించిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. చదవండి: స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్ -
రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్ మ్యాచ్
అబుదాబి: ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)- ముంబై ఇండియన్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ రికార్డు వ్యూస్‌ను సాధించింది. ఆ మ్యాచ్‌ను ఓవరాల్‌గా 20 కోట్ల మంది క్రికెట్ ప్రియులు వీక్షించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెక్రటరీ జై షా తన ట్వీటర్ అకౌంట్లో తెలిపారు.ఇది సరికొత్త ఫీట్లను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని బార్క్ తన సర్వేలో స్పష్టం చేసిన జై షా వెల్లడించారు. ఇలా ఒక ఓపెనింగ్ స్పోర్టింగ్ ఈవెంట్‌ను 20 కోట్ల మంది వీక్షించడం ఏ దేశంలోనైనా, ఏ క్రీడల్లోనైనా ఇది తొలిసారి అని తెలిపారు. ఇప్పటివరకూ ఏ లీగ్‌లో కూడా ఇంతటి ఆదరణ ఓపెనింగ్ మ్యాచ్‌కు రాలేదన్నారు. (చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?) ఈ మ్యాచ్ ద్వారా సీఎస్కే కెప్టెన్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై విజయంతో ధోని నయా రికార్డును లిఖించాడు. ఐపీఎల్లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2019 ప్రపంచకప్ తర్వాత దాదాపు 437 రోజలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ద్వారా గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇన్ని రోజుల విరామం తర్వాత కూడా తన కూల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అభిమానులకు చూపించాడు. ఆగస్టు 15 సాయంత్రం 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్ పవర్ చూపించగా, డుప్లెసిస్(58 నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు. Opening match of #Dream11IPL sets a new record! As per BARC, an unprecedented 20crore people tuned in to watch the match. Highest ever opening day viewership for any sporting league in any country- no league has ever opened as big as this. @IPL @SGanguly99 @UShanx @DisneyPlusHS — Jay Shah (@JayShah) September 22, 2020 -
110 కోట్ల మంది చూశారు
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతోందనడానికి తాజా నిదర్శనమిది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌ను వివిధ డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వేదికలపై చూసిన వీక్షకుల సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. దీని ప్రకారం ఈ టోర్నీని మొత్తం 110 కోట్ల మంది వీక్షించారు. 2018 టి20 ప్రపంచకప్‌తో పోలిస్తే ఇది ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే 2017 మహిళల వన్డే వరల్డ్‌కప్‌తో పోలిస్తే ఈసారి వీడియో వ్యూస్ 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రెండు సందర్భాల్లో భారత జట్టు ఫైనల్లో ఆడటం కూడా దీనికి ఒక కారణం. ఓవరాల్‌గా కూడా 2019 పురుషుల వరల్డ్‌కప్ తర్వాత ఎక్కువ వ్యూస్ వచ్చిన ఐసీసీ ఈవెంట్‌గా ఈ వరల్డ్ కప్ రెండో స్థానంలో నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లలో 2018తో పోలిస్తే ఏకంగా 423 శాతం వ్యూయర్షిప్ పెరగడం మరో ఘనత. -
సోషల్ మీడియాతో ఎక్కువ వ్యూస్
లండన్ : సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ వాడకం వల్ల వార్తల వెబ్సైట్లకు ఎక్కు వ్యూస్ వస్తాయని, ఎక్కువ వెబ్సైట్లను దర్శించే అవకాశం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సామాజిక మాధ్యమాల వాడకం ప్రజలు చూసే వార్తల వైవిధ్యంపై ప్రభావం చూసుతుందని ఇప్పటివరకు నమ్మిన మూల సిద్ధాంతానికి పరిశోధకుల తాజా ఫలితం.. వ్యతిరేకంగా ఉంది. ఫేస్బుక్, గూగుల్‌లను వీక్షించేవాళ్లు ఎక్కువగా వార్తలకు సంబంధించిన అంశాలను చూస్తుంటారని, ఇంటర్నెట్లో వార్తల వినియోగానికి సామాజిక వినియోగానికి సామాజిక మాధ్యమాల వాడకం ముఖ్యమైన విధానమని జర్మనీలోని హోహెన్‌హీమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాంక్ మాన్‌గోల్డ్ తెలిపారు.