
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజా సీజన్‌లో ఇది మరోసారి రుజువైంది. ఇప్పటివరకూ ఐపీఎల్‌ను టీవీ, ఆన్‌లైన్‌లో చూసిన వీక్షకుల సంఖ్య 371 మిలియన్లకు చేరుకోవడంతో కొత్త రికార్డు నమోదైంది. ఈ విషయాన్ని గురువారం బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసర్చ్ కౌన్సిల్ ఇండియా) ఒక ప్రకటనలో తెలిపింది. టీవీల ద్వారా 288.4 మిలియన్లు, హాట్‌స్టార్ ద్వారా 82.4 మిలియన్ల అభిమానులు ఐపీఎల్‌ను వీక్షించినట్లు స్పష్టం చేసింది.
గత ఏడాదితో పోలిస్తే తొలి వారంలో ఐపీఎల్‌ను వీక్షించిన వారి సంఖ్య 76 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. మరొకవైపు ఓవరాల్ లీగ్ చరిత్రలో మొదటి వారంలో ఐపీఎల్‌ను వీక్షించిన వారి సంఖ్య కూడా ఇదే అత్యుత్తమంగా పేర్కొంది. గతంతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశంలో ఈసారి 30శాతం టీవీ వీక్షకుల సంఖ్య పెరిగినట్లు బార్క్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment