IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వీక్షకుల సంఖ్యను సాధించింది.
మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో జియోసినిమా యాప్ ఏకకాల వీక్షకుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. కాగా ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. జియో సినిమాలో ఇంతకుముందున్న వీవర్స్ రికార్డు 2.4 కోట్లు. ఇది ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ సందర్భంగా నమోదైంది. భారతదేశంలోని వీక్షకులందరికీ జియో సినిమా ఐపీఎల్ 2023ని ఉచితంగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తం 1300 కోట్ల వీవ్స్
వీక్షకుల ఎంగేజ్‌మెంట్ పరంగా జియో సినిమా రోజూ కొత్త మైలురాళ్లను దాటుతూనే ఉంది. ఈ యాప్‌లో మొత్తం వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటాయి. ఇది ప్రపంచ రికార్డు అని ఆ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రీమింగ్ యాప్ ఐపీఎల్ కారణంగా రోజూ లక్షల కొద్దీ కొత్త వీక్షకులను సంపాదిస్తూనే ఉంది.
ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో మ్యాచ్‌కి సగటు స్ట్రీమింగ్ సమయం ఇప్పటికే 60 నిమిషాలు దాటిపోయిందని కంపెనీ పేర్కొంది. ఇక స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనదారుల పరంగా జియో సినిమా 26 మార్క్యూ స్పాన్సర్‌లను సాధించగలిగింది. ఏ క్రీడా ఈవెంట్‌కైనా ఇదే అత్యధికం.
ఇదీ చదవండి: జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్‌స్క్రైబర్లు
Comments
Please login to add a commentAdd a comment