ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది.
రూ. 4700 కోట్లు
మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి.
బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది.
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ..
ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్‌లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment