దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భారత్ క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచారు. రాబోయే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ విజయానికి మద్దతుగా 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టు హీరోలతో కలిసి 'జీతేంగే హమ్' ప్రచారాన్ని ప్రారంభించారు.
"భారత క్రికెట్ అభిమానులను ఏకం చేస్తుంది. #JeetengeHum పేరుతో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తుంది. విజయం కోసం జట్టులో తపనను, మనోధైర్యాన్ని పెంచుతుంది" అని ఈ క్యాంపెయిన్ గురించి అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ రెండు లక్షణాలు ఉండాలి
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘దేశంలో విస్తృతమైన భావోద్వేగాలను ప్రేరేపించే శక్తి క్రికెట్‌కు ఉంది. పుట్టుకతోనే ఎవరూ లెజెండ్‌లు కారు.. స్థిరత్వం, పట్టుదలతో కృషి చేసిన లెజెండ్‌లుగా ఎదుగుతారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఉన్న ఈ రెండు లక్షణాలు వచ్చే వరల్డ్ కప్‌లో ఆడే జట్టుకూ ఉండాలి’ అన్నారు. చరిత్ర పునరావృతం కావాలని కాంక్షిస్తూ రాబోయే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల క్రితం 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్‌ను కపిల్ దేవ్ అదానీకి బహూకరించారు. ‘2023 ODI ప్రపంచ కప్‌లో టీమిండియా విజయానికి మద్దతుగా అదానీ గ్రూప్‌తో ఏకం కావడం గౌరవంగా భావిస్తున్నాం’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ ప్రచారం త్వరలో డిజిటల్ విషెంగ్ వేదికను పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాకు తమ శుభాకాంక్షలను, సందేశాలను ఇక్కడ తెలియజేయవచ్చు.
Honoured by the presence of the Heroes of India's 1983 World Cup triumph on Adani Day. Their grit and resilience inspired an entire generation of Indians to think big. Privileged to join them in wishing our team victory at the 2023 Cricket World Cup. #JeetengeHum pic.twitter.com/bUTEQJCNOD
— Gautam Adani (@gautam_adani) June 24, 2023
Comments
Please login to add a commentAdd a comment