
ముంబై: శ్రీటీఎంటీ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ దేవశ్రీ ఇస్పాత్ తాజాగా భారతీయ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
గత 50 ఏళ్లుగా ఉక్కు రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని కంపెనీ ఎండీ ప్రకాశ్ గోయెంకా తెలిపారు. నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ బ్రాండ్‌కి బుమ్రా సముచిత ప్రచారకర్త కాగలరని ఆయన పేర్కొన్నారు. శ్రీటీఎంటీతో జట్టు కట్టడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశారు.