TMT
-
శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ముంబై: శ్రీటీఎంటీ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ దేవశ్రీ ఇస్పాత్ తాజాగా భారతీయ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. గత 50 ఏళ్లుగా ఉక్కు రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని కంపెనీ ఎండీ ప్రకాశ్ గోయెంకా తెలిపారు. నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ బ్రాండ్‌కి బుమ్రా సముచిత ప్రచారకర్త కాగలరని ఆయన పేర్కొన్నారు. శ్రీటీఎంటీతో జట్టు కట్టడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో కామధేను విస్తరణ
హైదరాబాద్: బ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ, విక్రయ సంస్థ కామధేను లిమిటెడ్ .. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఏడాది కాలంలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను ఎన్ఎక్స్టీ’ ఉత్పత్తి సామరŠాధ్యలను 3 లక్షల ఎంటీ (మెట్రిక్ టన్నులు) నుంచి 3.6 లక్షల ఎంటీకి పెంచుకోనున్నట్లు వివరించింది. అలాగే 100కు పైగా డీలర్లు, పంపిణీదారులను కొత్తగా చేర్చుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో తమకు 350 మంది డీలర్లు, డి్రస్టిబ్యూటర్ల నెట్వర్క్ ఉందని ఆయన వివరించారు. కామధేను టీఎంటీ బ్రాండ్ కడ్డీల టర్నోవరు రూ. 21,000 కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. -
రూ. 2,500 కోట్లతో శ్యామ్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్ స్టీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
రాధా TMT డైరెక్టర్ - అక్షత్ శరఫ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
కొత్త ప్రొడక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించిన రాథ టీఎంటీ
-
కొత్త ప్రోడక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన రాధా TMT
-
టన్నుకు రూ. 5,000 భారం
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచేశాయి. దీంతో హెచ్ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరఫరాపై పడడం తాజా ధరల పెరుగుదలకు నేపథ్యంగా ఉంది. గత కొన్ని రోజులుగా ధరలు పెరిగాయని, రానున్న వారాల్లో మరింత పెరగొచ్చని, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ‘‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం నెలకొంది. దీంతో ముడి సరుకుల ధరలు పెరిగాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాల క్రితంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి’’ అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధం ఆగకపోతే ధరలపై ప్రభావం ‘‘రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా స్టీల్ తయారీ, ఎగుమతి చేస్తున్న దేశాలు. దీనికి అదనంగా ముడి సరుకులైన కోకింగ్ కోల్, సహజ వాయువులను కూడా అవి సరఫరా చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ముగియకపోతే అది కచ్చితంగా డిమాండ్–సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దాంతో తయారీ వ్యయాలు పెరిగిపోతాయి’’ అని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రపంచ స్టీల్ అసోసియేషన్లోనూ నరేంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, తమ కస్టమర్లు, భాగస్వాములపై ప్రభావం పడకుండా అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
ఠాణే కార్పొరేషన్‌కు భారంగా టీఎంటీ
సాక్షి, ముంబై : నష్టాల్లో నడుస్తున్న ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు (టీఎంటీ) ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెస్ట్ సంస్థ ప్రకటించింది. అందుకు టీఎంటీ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే త్వరలో టీఎంటీ బస్సులన్నీ బెస్ట్‌గా మారనున్నాయి. ముంబైలాగా ఠాణేకర్లకు నాణ్యమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏటా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ రూ.25 కోట్లు టీఎంటీకి ఆర్థిక సాయం అందజేస్తోంది. అయినప్పటికీ ఈ సంస్థకు ప్రతీ నెలా రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. సంవత్సరానికి రూ.25 కోట్లు మేర నష్టం వస్తోంది. టీఎంటీని పోషించడం ఠాణే కార్పొరేషన్‌కు పెను భారంగా మారడంతో టీఎంటీని బెస్ట్‌లో విలీనం చేయాలనే అంశం తెరమీదకు వచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్న టీఎంటీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని బెస్ట్ కూడా ఆసక్తి కనబరుస్తోంది. టీఎంటీకి అగ్ని పరీక్ష ప్రస్తుతం టీఎంటీ సంస్థ రజతోత్సవాలు జర్పుకుంటోంది. 25 సంవత్సరాల నుంచి డొక్కు బస్సులతోనే రవాణా సేవలందిస్తున్న టీఎంటీకి ఇప్పుడు ఒక అగ్ని పరీక్షగా మారింది. సేవలను మెరుగు పరిచేందుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఆనుకున్నంతమేర ఆదాయం మాత్రం రావడం లేదు. ఠాణే కార్పొరేషన్ ఆర్థికంగా ఆదుకుంటున్నా నష్టాల ఊబి నుంచి బయట పడలేక పోతోంది. బస్సులు తరుచూ బ్రేక్ డౌన్ కావడం, సమయానికి బస్సులు రాకపోవడం, వచ్చినా అవి కిక్కిరిసి ఉండడం లాంటి ప్రధాన కారణాలున్నాయి. టీఎంటీ ఆధీనంలో 325 బస్సులున్నాయి. ఇందులో కేవలం 125 బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. మిగతావన్నీ మరమ్మతుల కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. మేం సిద్ధం : బెస్ట్ జీఎం టీఎంటీని తమ సంస్థలో విలీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవలే ఠాణే మున్సిపల్ కమిషనర్ అసీం గుప్తాతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. మరో రెండు, మూడు సంవత్సరాలు ఠాణే కార్పొరేషన్ టీఎంటీని ఆర్థికంగా ఆదుకుంటే ఆ తరువాత తామే స్వయంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. టీఎంటీ బస్సులు బెస్ట్ ఆధీనంలోకి వస్తే సిబ్బందికి బెస్ట్ తరహాలో వేతనాలు, ఇతర భత్యాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఠాణేలో సేవలు అందించేందుకు బెస్ట్‌కు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఠాణేకర్లకు ముంబై తరహాలో సేవలు అందిచేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.