ఐపీఎల్ సీజన్‌లో వినియోగదారుల్ని ఉచితంగా అలరిస్తున్న జియో సినిమా ఇకపై మరింత కాస్ట్లీగా మారనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్రీగా జియో సినిమాను వీక్షించిన యూజర్లు డబ్బులు చెల్లించడం చర్చకు దారితీసింది.
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమా ఇప్పుడు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆలోపే కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి యూజర్లకు అందించనున్నట్లు రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ తరుణంలో జియో సినిమా తన యూజర్లకు డైలీ, గోల్డ్, ప్లాటినమ్ అంటూ మూడు ప్లాన్ లను అందించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరోజు ప్లాన్ రూ.29 కాగా, 93 శాతం డిస్కౌంట్‌తో రూ.2కే అందించనున్నట్లు పేర్కొన్నాయి.
ఇక గోల్డ్ ప్లాన్ రూ.299 కాగా, రూ.99కే పొందవచ్చు. 12 నెలల ప్లాటినమ్ ప్లాన్ ధర రూ.1199 ఉండగా, దానిని రూ.599కే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నాలుగు డివైజ్‌లలో వీక్షించడంతో పాటు.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే సమయంలో ఎలాంటి ప్రకటనలు ప్రసారం అవ్వవని తెలుస్తోంది. కాగా, ఈ సరికొత్త ప్లాన్‌లపై జియో స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment