thousands of crores
-
IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. రూ. 4700 కోట్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ.. ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! -
రూ.7464 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 363 చోట్ల 412 ఎకరాలు గుర్తించామని, దీని విలువ రూ.7,464 కోట్లు ఉంటుందని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ మీనా వివరించారు. మరో రూ.455 కోట్ల విలువైన స్థలాల విషయంలో న్యాయపరమైన వివాదం ఉందని చెప్పారు. న్యాయపరమైన వివాదాలు ఉన్న స్థలాల విషయంలో కోర్టుల్లో పటిష్టంగా వాదించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు సాధించేందుకు ఇద్దరు ముగ్గురు మంచి న్యాయవాదులను నియమించుకునేందుకు అనుమతించాలని కోరారు. షేక్‌పేట మండలంలో 25 స్థలాలపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని, ఈ స్థలాల విలువ వేల కోట్లు ఉంటుందని వివరించారు. ‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి నెగ్గాలంటే అది ప్రభుత్వ భూమి అనడానికి అవసరమైన సాక్ష్యాధారాలతో పాటు కోర్టుల్లో సరిగా వాదించే న్యాయవాదులు అవసరమే. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆక్రమితదారులెవరూ భూములను వదులుకోవడానికి సిద్ధపడరు. వాటిని కైవసం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్లడానికి సిద్ధపడతారు. అందువల్ల మీ జిల్లాల్లోని న్యాయ వివాదాల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి మీ దృష్టిలో ఎవరైనా మంచి న్యాయవాదులు ఉంటే మాకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తాం..’ అని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు గాను ప్రహరీల నిర్మాణం, ఫెన్సింగ్ కోసం ఎంత డబ్బు వెచ్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే ఎక్కడో ఒకచోట కొంత భూమిని విక్రయించి వచ్చే డబ్బును ఇందుకు వినియోగిస్తామని చెప్పారు.