
‘‘ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్ నుంచి ఎప్పుడూ మంచి స్పందన ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల ఇలాంటి కథలకు మరింత ఆదరణ పెరిగింది’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నారు. ఈ విషయంపై రకుల్ మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాల రిలీజ్‌లు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా వ్యూయర్స్ చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.
ఇటు పాన్ ఇండియన్ మూవీ బిజినెస్ విషయంలో ‘బాహుబలి’ అన్ని కోణాల్లో కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులూ చెరిగిపోయాయి. మంచి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్ చేయడంతో పాటు నా పాత్ర కథను నడిపించే లా ఉండాలి’’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు రకుల్. వీరి పెళ్లిపై త్వరలో ఓ స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment