కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి! | Kiran Rao Laapataa Ladies Movie Beat Sandeep Reddy Vanga film Animal on Netflix | Sakshi
Sakshi News home page

Kiran Rao: చిన్న సినిమా సంచలనం.. నెల రోజుల్లోనే యానిమల్‌ రికార్డ్‌ బ్రేక్..!

Published Thu, May 23 2024 9:39 PM | Last Updated on Fri, May 24 2024 11:30 AM

Kiran Rao Laapataa Ladies Movie Beat Sandeep Reddy Vanga film Animal on Netflix

అమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్‌ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న  థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‍తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

థియేటర్లలో హిట్ టాక్‌ తెచ్చుకున్న  లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్‌ వచ్చింది. ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్‌ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సందీప్‌ రెడ్డి, రణ్‌బీర్‌ కపూర్‌ చిత్రం యానిమల్‌ ఇప్పటివరకు కేవలం  13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యానిమల్‌ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ  సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. 

lapatta ladies

కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. ‍అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్‌ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు.  చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు.  ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement