సాక్షి, హైదరాబాద్: పొద్దున లేవగానే వార్తా పత్రిక చదవనిదే కొందరికి ఏమీ తోచదు. ఎన్ని టీవీ చానళ్లు వచ్చినా.. ఈ–పేపర్లు, డిజిటల్ ఎడిషన్లు వచ్చినా.. సోషల్ మీడియాలో పొద్దంతా వార్తలు సర్క్యులేట్ అవుతున్నా.. చేతిలో పత్రిక పట్టుకుని చదివితేనే తృప్తి.
స్మార్ట్‌ఫోన్ల శకం మొదలయ్యాక న్యూస్ పేపర్ల డిజిటల్ ఎడిషన్లకు డిమాండ్ పెరిగినా.. న్యూస్ పేపర్లకు ఆదరణ తగ్గలేదని భారతదేశంలో ఈ అలవాటు ఎక్కువగా ఉందని ‘స్టాటిస్టా గ్లోబల్ కన్సూ్యమర్ సర్వే’ తేల్చింది. ముఖ్యంగా దేశంలోని పట్టణాల్లో 54 శాతం మంది.. రోజూ న్యూస్ పేపర్ చదువుతామని చెప్పినట్టు వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి ఏడాది మార్చి మధ్య 50 దేశాల్లో ఈ సర్వే చేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment