newspaper
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
సుప్రీం ఆగ్రహం.. మరోసారి యాడ్‌తో క్షమాపణలు చెప్పిన పతంజలి
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ పేరుతో యాడ్ ఇచ్చారు. ఈ కేసులో పతంజలి పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. ముందుగా సోమవారం కూడా క్షమాపణలు కోరుతూ యాడ్స్ఇచ్చారు.కాగా కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటనల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు పలుమార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. మంగళవారం విచారణ సందర్భంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు చెప్పినా.. ‘ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. కోర్టుకు చెప్పినట్లే నేడు పెద్ద సైజులో యాడ్ ఇచ్చారు.సంబంధిత వార్త: నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా? -
తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం
ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్ జర్నలిస్టులు రాసిన ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్ ఛానెల్ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియమ్ అలావీ; ‘స్క్రోల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్... ‘పింక్ రివల్యూషన్’. ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. లవ్ జిహాద్‌పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్ జిహాద్‌పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్ లోనిది. వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్ జిహాద్ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్లోని మీడియా ఆర్కైవ్స్‌ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని వారు వివరాలు పొందు పరిచారు. ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు! మీలో చాలామంది లవ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు. ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను. ‘‘హిందూ రైట్‌వింగ్ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
షాకింగ్ ఘటన: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు
ఒక వ్యక్తి క్లినిక్ వచ్చి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....61 ఏళ్ల దిలీస్ కుమార్ మదానీ పంటి నొప్పికి చికిత్స కోసం క్లినిక్‌కి వచ్చాడు. అతను క్లినిక్ వెలుపల కుర్చిలో పేపర్ చదువుతూ కూర్చొన్నాడు. కాసేపటికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అంతే అందరూ చూస్తుండగానే కుర్చిలోంచి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటేనే క్లినిక్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మహేంద్ర మదానీ మాట్లాడుతూ...దిలీప్ గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. వారంతా బార్మెర్లోని పంచపద్రలో ఉంటారని అన్నారు. ఒక పనిపై బార్మెర్ వచ్చాడని, అనుకోకుండా పంటినొప్పి రావడంతో క్లినిక్‌కి వచ్చినట్లు తెలిపారు. అతను ఉదయం బాగానే ఉన్నాడని అకస్మాత్తుగా ఇంత ఘోరం జరిగిపోయిందని భాదగా చెప్పారు. इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे। कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV — Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022 (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
భారత ఎకానమీపై స్పానిష్ పేపర్ కార్టూన్ దుమారం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్‌కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపింది. భారత ఆర్థిక వృద్ధిపై కథనాన్ని ప్రకటించిన ‘లా వంగార్డియా’ పత్రిక‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్‌ను పబ్లిష్ చేసింది. అక్టోబర్ 9న వీక్లీ పత్రిక మొదటి పేజీలో ఈ కార్టూన్ ప్రచురితమైంది. ఇది దేశంపై జాతివిద్వేషాన్ని వెళ్లగక్కడం తప్ప మరోకటి కాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ‘ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని వర్ణించడంపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ పీసీ మోహన్ సీరియస్‌గా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. అంతేకాదు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గ్లోబల్‌గా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. విదేశీ మనస్థత్వాలనుమార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని పేర్కొన్నారు. మరోవైపు రచయిత రజత్ సేథి కూడా దీనిపై స్పందించారు. భారత ఆర్థికవృద్ధిని ప్రపంచం గమనిస్తోంది. అయినా జాత్యహంకార వ్యంగ్య చిత్రాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా గమనిస్తోంది. కానీ భారత్‌ను ఇంకా సాంప్రదాయ కార్టూన్లతో చూపించడం చాలా అవమానకరం. కార్టూన్‌తో దేశాన్ని అవమానించడం చాలా దారుణమని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా సీఈవో నితిన్ కామన్ వ్యాఖ్యానించారు. పాములు పట్టే దేశంగా అభివర్ణించడం సరైంది కాదని ఆయన ట్వీట్ చేశారు. ఎకానమీతో పాటు, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకుపోతున్నా భారత్‌ను పాములు పట్టే దేశం అంటూ అవమానకర కార్టూన్‌ను ప్రచురించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. "The hour of the Indian economy," says La Vanguardia, a leading Spanish daily. Quite cool that the world is taking notice, but the cultural caricaturing, a snake charmer to represent India, is an insult. Wonder what it takes for this to stop; maybe global Indian products? pic.twitter.com/YY3ribZIaq — Nithin Kamath (@Nithin0dha) October 13, 2022 -
చేతిలో ఉంటేనే.. పేపర్ చదివినట్టు!
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేవగానే వార్తా పత్రిక చదవనిదే కొందరికి ఏమీ తోచదు. ఎన్ని టీవీ చానళ్లు వచ్చినా.. ఈ–పేపర్లు, డిజిటల్ ఎడిషన్లు వచ్చినా.. సోషల్ మీడియాలో పొద్దంతా వార్తలు సర్క్యులేట్ అవుతున్నా.. చేతిలో పత్రిక పట్టుకుని చదివితేనే తృప్తి. స్మార్ట్ఫోన్ల శకం మొదలయ్యాక న్యూస్ పేపర్ల డిజిటల్ ఎడిషన్లకు డిమాండ్ పెరిగినా.. న్యూస్ పేపర్లకు ఆదరణ తగ్గలేదని భారతదేశంలో ఈ అలవాటు ఎక్కువగా ఉందని ‘స్టాటిస్టా గ్లోబల్ కన్సూ్యమర్ సర్వే’ తేల్చింది. ముఖ్యంగా దేశంలోని పట్టణాల్లో 54 శాతం మంది.. రోజూ న్యూస్ పేపర్ చదువుతామని చెప్పినట్టు వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి ఏడాది మార్చి మధ్య 50 దేశాల్లో ఈ సర్వే చేసినట్టు తెలిపింది. -
Russia-Ukraine war: మూతబడ్డ ‘నోబెల్ శాంతి’ పత్రిక
మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం. నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి) -
‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది
హైదరాబాద్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల ఎడిటర్ పోటీకి పాఠశాల విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే క్రమంలో నిర్వహించిన ఈ పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 301 మంది ఈ పోటీలో విజేతలుగా నిలిచారు. ఇందులో ఇరు రాష్ట్రాల స్థాయిలో 80 మంది విద్యార్థులను బాల ఎడిటర్లుగా ఎంపిక చేయగా జిల్లాల స్థాయి బాల ఎడిటర్లుగా 221 మందిని ఎంపిక చేశారు. రెండు కేటగిరీలుగా పోటీ.. బాల ఎడిటర్ అనేది ‘సాక్షి’మీడియా గ్రూప్ నిర్వహించిన వార్తాపత్రిక తయారీ పోటీ. ఈ పోటీని రెండు విభాగాల్లో నిర్వహించారు. ఈ పోటీలో కాన్సెప్ట్, చిత్రాలు, అంశాలను పూర్తిగా విద్య, చదువుకు సంబంధించే రూపొందించారు. ఇందులో 30 వేల మందికిపైగా విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. ‘ఎ’విభాగంలో 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు, ‘బి’విభాగంలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పించారు. 100 మార్కుల ఈ పోటీ పరీక్షలో నూటికి 80 శాతం మార్కులు సాధించిన వారే అధికంగా ఉన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులను పరిశీలించి ఆ మేరకు మార్కులు ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ఈ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన విద్యార్థులను ఎంపిక చేశారు. వార్తాపత్రికే పరీక్ష పేపరు.. ‘సాక్షి’దినప్రతికను పరీక్ష పేపరుగా పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అందజేశారు. అందులో పొందుపరిచిన ప్రశ్నలకు తెలుగులో లేదా ఆంగ్లంలో నిర్దేశిత టెంప్లెట్లో స్వదస్తూరితోనే వారు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఆ విధంగా పూర్తి చేసిన వార్తాపత్రికను 2019 నవంబర్ 15వ తేదీ నాటికి ఆయా పాఠశాల కో ఆర్డినేటర్లకు అందజేశారు. అక్కడి నుంచి ‘సాక్షి’ప్రతినిధి బృందం సేకరించింది. బహుమతులు.. ‘ఎ ’కేటగిరీలో రాష్ట్ర స్థాయి బాల ఎడిటర్లుగా నిలిచిన 40 మంది విద్యార్థులకు సోనీ ప్లే స్టేషన్లను, జిల్లాల స్థాయి విజేతలకు సైన్స్ కిట్స్‌ను బహుమతిగా అందజేయనున్నారు. ‘బి’కేటగిరీలో 40 మంది రాష్ట్ర స్థాయి విజేతలకు లెనోవో ట్యాబ్స్‌ను, జిల్లా స్థాయిలో బాల ఎడిటర్లుగా ఎంపికైన విద్యార్థులకు ఫిటెనెస్ ట్రాకర్ బ్యాండ్స్‌ను బహుమతులుగా ఇవ్వనున్నారు. ఆయా విద్యార్థులకు ‘సాక్షి’బాల ఎడిటర్ సర్టిఫికెట్లను అందించనున్నారు. త్వరలో విజేతల జాబితాను వెల్లడిస్తామని, కరోనా నిబంధనల మేరకు బహుమతి ప్రదానోత్సవాన్ని కూడా త్వరలోనే నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన బాల ఎడిటర్ పోటీల పత్రాలను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు -
చైనా పత్రికల పై ఆంక్షలు విధించిన అమెరికా
వాషింగ్టన్: చైనాకు చెందిన మరో నాలుగు మీడియా సంస్థల మీద అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని విదేశీ మిషన్లగా పేర్కొంది. చైనా అధ్యక్షుడు మీడియాపై కఠినమైన నియంతృత్వ విధానాలు అమలుచేస్తుండటంతో దానికి ప్రతీకరంగా అమెరికా ఈ చర్యలకు ఉపక్రమింనట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సంస్థల వారిని చైనాదేశానికి చెందిన ప్రతినిధులుగా భావిస్తారు. వారి వీసాలకు సంబంధించిన విషయాలు, ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా ఆంక్షలు విధించారు. (చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!) చైనా సెంట్రల్ టెలివిజన్, ది పీపుల్స్ డైలీ, చైనా న్యూస్ సర్వీస్, గ్లోబల్ టైమ్స్ పత్రికలపై ఆంక్షలు విధించినట్లు ఈస్ట్ ఏసియా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డెవిడ్ స్టిల్వెల్ తెలిపారు. ప్రతికలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం పత్రిక స్వేచ్ఛను హరించడమే విమర్శలు వెల్లువెత్తుతుండగా వాటిని అమెరికా ఉన్నతాధికారులు ఖండించారు. అయితే ఈ ఆంక్షల కారణంగా ఆ పత్రికల్లో పనిచేసే వారు ఉపాధి కోల్పోనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడానికి చైనానే కారణంమంటూ ఆ దేశానికి చెందిన వార్తసంస్థల మీద ఫిబ్రవరిలోనే ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (కరోనా వైరస్: ఇక చైనా మారదు!) -
న్యూస్ పేపర్‌ను చుట్టుకున్న హీరోయిన్!
లాక్డౌన్ పుణ్యమా అని చాలామంది తమ క్రియేటివిటికి పనిచెబుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రకారకాల ఆలోచనలతో ముందుకు వస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తన క్రియేటివ్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇటీవలె పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పాయల్..లేటెస్ట్గా పేపర్ డ్రెస్‌కు తెరతీసింది. హాస్య బ్రహ్మ జంధ్యాల రూపొందించిన ఎవర్గ్రీన్ క్లాసిక్ సినిమా `అహ నా పెళ్లంట`. డబ్బులు ఆదా చేయడం కోసం ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ న్యూస్ పేపర్‌ను మడిచి లుంగీలాగ కట్టుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కూడా ఆ ఫ్యాషన్‌ను ఫాలో అయింది. న్యూప్పేపర్స్నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొందరు పాయల్ క్రియేటివిని పొగుడుతుంటే మరొకొందరు మాత్రం పాయల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్100 సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ..మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. ఇటీవలె పిల్లో డ్రెస్, ఇప్పడు పేపర్ డ్రెస్..మరి నెక్స్ట్ ఎలాంటి క్రియేటివ్ డ్రెస్‌తో ముందుకొస్తుందో చూడాలి.! -
బ్లాక్ మనీ
తమ మేడ టెర్రస్ పైనుంచి బైనాక్యులర్స్‌తో చుట్టుపక్కల దృశ్యాలు చూస్తున్నాడు కిరణ్. ఇంటర్ చదువుతున్న వాడికి దుబాయ్ నుంచి మేనమామ గిఫ్ట్‌గా తెచ్చిచ్చాడు. ఈసారి హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్లి బైనాక్యులర్స్‌లో నుంచి గేమ్ చూడాలని వాడి కోరిక. అందుకే రోజూ పేపరు చూస్తున్నాడు క్రికెట్ మ్యాచ్ ఎప్పుడా అని. ఆ రోజు సాయంకాలం చీకటి పడుతూ ఉండగా కనిపించిన దృశ్యం ఆసక్తిగా గమనించాడు. రత్నయ్య రైస్ మిల్లు వెనుకభాగంలో దాదాపు ఎకరం స్థలం ఖాళీగా ఉంది. అదంతా పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంటుంది. రత్నయ్య, అతని కొడుకు వెంకట్ పలుగు పారలు తీసుకుని గొయ్యి తవ్వుతున్నారు. అక్కడొక చెక్కపెట్టె ఉంది. గొయ్యి తీసిన తర్వాత చెక్కెపెట్టెను అందులో పెట్టి పూడ్చారు. రోజూ న్యూస్‌పేపర్ చదువుతున్న కిరణ్‌కి ఏదో అర్థమైంది. వాళ్లుంటున్న హిందూపురంలో రత్నయ్య పెద్ద షావుకారు. రైసు మిల్లు, సినిమా హాలు, మెయిన్ రోడ్డులో హోటల్, గ్యాస్ ఏజెన్సీ వగైరా వ్యాపారాలు ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేగా నిలబడతాడని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు కావాలి. అయితే, ఎలక్షన్లప్పుడు ఐటీ వాళ్లు, ఈడీ వాళ్లు రైడింగులు చేసి, లెక్కలు చూపని డబ్బును సీజ్ చేస్తున్నారు. కాబట్టి రత్నయ్య బ్లాక్ మనీ పెట్టెలో పెట్టి పాతిపెట్టాడన్నమాట. కిరణ్‌కి గొప్ప రహస్యం కనిపెట్టానన్న ఉత్సాహంతో ఛాతీ ఉబ్బింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే గాని మనశ్శాంతి కలగదు. అందుకని వాడి క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మానందం దగ్గరకు పరుగెత్తాడు. ‘‘ఒరేయ్ బ్రహ్మం! నేనొక సీక్రెట్ కనిపెట్టాను.’’ ఎగై్జట్ అవుతూ చెప్పాడు. ‘‘సీక్రెటా? ఎవరిది?’’ ‘‘రత్నయ్యది..’’ అని తను బైనాక్యులర్స్‌తో చూసిన దృశ్యం గురించి చెప్పాడు. ‘‘ఔన్రోయ్! నువ్వు చెప్పింది నిజమే. ఈసారి రత్నయ్య నిలబడతాడనీ, ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతాడనీ మా నాన్న చెబుతుంటే విన్నాను’’ అన్నాడు బ్రహ్మం. ‘‘ఈ సంగతి పోలీసులకి ఫోన్ చేసి చెప్తే సరి. రత్నయ్య తిక్క కుదురుతుంది. గోతిలో దాచిన డబ్బంతా పోలీసులు పట్టుకుపోతారు’’ అన్నాడు కిరణ్. ‘‘ఆ పని చేద్దాం. ఇంట్లో మీ అమ్మ దగ్గరున్న సెల్‌ఫోన్ పట్టుకురా. పోలీసులకు ఫోన్ చేద్దాం..’’ అన్నాడు బ్రహ్మం. ‘‘అమ్మో! వద్దురా.. ఆ నంబర్ పోలీసులకు తెలిసిపోతుంది. ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతారేమో! అమ్మ గొడవ పెడుతుంది. లేనిపోని గొడవ ఎందుకు?’’ ‘‘సరే! పోలీసులకు ఎలా తెలియజేద్దాం?’’ ‘‘ఐడియా’’ ‘‘ఏంట్రా?’’ ‘‘యాదగిరి బడ్డీ కొట్టు దగ్గర కాయిన్ బాక్స్ ఉంటుంది. అందులోంచి చేద్దాం. ఏ గొడవా ఉండదు.’’ కిరణ్ ఐడియా బ్రహ్మానికి నచ్చింది. యాదగిరి బడ్డీకొట్టు దగ్గరకు వెళ్లారు. యాదగిరి వచ్చిన వాళ్లకు సిగరెట్లు, చాక్లెట్లు వగైరా అమ్ముతూ బిజీగా ఉన్నాడు. బ్రహ్మం ఒక పక్కగా ఉన్న కాయిన్ బాక్సు నుంచి పోలీస్ స్టేషన్ నంంబర్కి రింగ్ ఇచ్చి, రూపాయి కాయిన్ వేశాడు. రింగైన కాసేపటికి పోలీస్ స్టేషన్లో ఫోన్ ఎత్తారు. ‘‘హిందూపురం టౌన్ పోలీస్ స్టేషన్..’’ ‘‘రత్నయ్య మిల్లు వెనుక బ్లాక్ మనీ పూడ్చి పెట్టాడు’’ వణుకుతున్న గొంతుతో చెప్పాడు బ్రహ్మం. బ్రహ్మానికి ఎందుకో ఆ సమయంలో భయం కలిగింది. తను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వింటారేమో అని వణుకు వచ్చింది. తనే పోలీసులకు బ్లాక్ మనీ సంగతి చేరవేసినట్లు తెలిస్తే రత్నయ్య తనని పట్టుకుని చంపుతాడు. అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పాడు. ‘‘రత్నయ్యా! ఏ రత్నయ్య?’’‘‘రైసు మిల్లు ఓనర్ రత్నయ్య బ్లాక్ మనీ ఏంది?’‘‘ఔను. చెక్కపెట్టెలో బ్లాక్ మనీ పెట్టి, రైసు మిల్లు వెనుక ఖాళీ స్థలంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. నేను చూశాను.’’‘‘నువ్వు చూశావా? ఎవరు నువ్వు?’’బ్రహ్మం రిసీవర్ ఠక్కున పెట్టేశాడు. కిరణ్ చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్లాడు. ‘‘నువ్వెవరు? అని పోలీసులు అడుగుతున్నర్రా. నేను మాట్లాడకుండా పెట్టేశాను.’’ అన్నాడు ‘‘మంచి పని చేశావు. మన పేరు ఎలా చెప్తాం. మనల్ని పట్టుకుంటారు.’’ అన్నాడు కిరణ్.ఇప్పుడు కిరణ్‌కి సంతృప్తి కలిగింది. ఏదో ఘనకార్యం సాధించినంత ఆనందంగా ఉంది. రేపు పోలీసులు గొయ్యి తవ్వి బ్లాక్ మనీ అంతా పట్టుకుపోతారు. రత్నయ్య లబోదిబోమని మొత్తుకుంటాడు. అదంతా టీవీల్లో చూపిస్తారు. భలే..! పోలీస్ స్టేషన్లో కిరణ్, బ్రహ్మంల కాల్ రిసీవ్ చేసుకున్నది హెడ్ కానిస్టేబుల్ గోపీకృష్ణ. ఎస్సై రహీం దగ్గరకు వెళ్లి చెప్పాడు. ‘‘సార్! రత్నయ్య తన మిల్లు వెనుక ఖాళీ స్థలంలో బ్లాక్ మనీ చెక్కెపెట్టెలో పెట్టి, గొయ్యి తీసి పూడ్చిపెట్టాడట. ఎవడో కాల్ చేశాడు.’’‘‘వాట్! ఏ రత్నయ్య?’’‘‘హిందూపురంలో రత్నయ్య తెలియని వాళ్లెవరు సార్? సౌండ్ పార్టీ. రైసు మిల్లు, హోటల్స్, గ్యాస్ ఏజెన్సీలు.. చాలా బిజినెస్‌లు ఉన్నాయి.’’‘‘ఓ.. ఆ రత్నయ్యా!’’‘‘ఔను సార్!’’‘‘సరే! బ్లాక్ మనీ గొడవేంటి? రత్నయ్య గొయ్యి తీసి పాతిపెట్టడం ఏంటి? అదంతా ఎవడో కాల్ చేసి చెప్పడం ఏంటి? నాన్సెన్స్. మనకేం సంబంధం?’’‘‘ఔను సార్! అదంతా ఇన్కమ్ టాక్స్ వాళ్లు చూసుకుంటారు. వీడెవడో మూర్ఖుడిలా ఉన్నాడు. మనకు కాల్ చేశాడు.. ఎందుకైనా మంచిది సీఐగారికి చెప్పండి.’’ అన్నాడు హెడ్.‘‘అదే మంచిది’’ అని ఎస్సై రహీం ఇన్స్పెక్టర్ రూమ్‌కి వెళ్లి చెప్పాడు.‘‘పెద్దవాళ్లతో గొడవ. డీఎస్పీ సాబ్తో చెబుదాం. ఐటీ వాళ్లతో చెప్పాలనుకుంటే ఆయనే చెప్తాడు’’ అన్నాడు ఇన్స్పెక్టర్.డీఎస్పీ విని ‘‘ఇదేదో ఆకతాయి చేసిన కాల్. రత్నయ్య పెద్దమనిషి. గొయ్యితీసి బ్లాక్‌మనీ పాతిపెట్టడం ఏంటి? సిల్లీగా లేదూ! ఆ కాల్ చేసిన వాడు తవ్వి తీసుకోవచ్చుగా? మనకెందుకు చెప్పడం?’’ అన్నాడు.‘‘ఎందుకైనా మంచిది. నేను ఐటీ జాయింట్ కమిషనర్‌తో మాట్లాడతాను. రత్నయ్య ఐటీ గొడవలు ఏవైనా ఉంటే వాళ్లు చూసుకుంటారు’’ అన్నాడు డీఎస్పీ.‘‘సార్! నిప్పులేనిదే పొగ రాదు. ఇందులో ఏదో ఉంది. రత్నయ్య అంతటి పెద్దమనిషి స్వయంగా గొయ్యి తీసి పాతిపెట్టాడంటే బ్లాక్మనీనే సార్’’ అన్నాడు ఇన్స్పెక్టర్ కాన్ఫిడెంట్‌గా. ఆ రోజు ఉదయం పోలీసులు రత్నయ్య మిల్లులోకి వచ్చారు. పోలీసు కుక్క మిల్లు వెనుకభాగంలోని గొయ్యి దగ్గర ఆగింది. కాలితో మట్టిని పెళ్లగించసాగింది.ఇన్స్పెక్టర్ సైగ చేయడంతో పనివాళ్లు పారలతో గొయ్యి తవ్వారు. చెక్కపెట్టె బయట పడింది. ఒక్కసారిగా దుర్వాసన ఎగజిమ్మింది. అంతా కర్చీఫ్లతో ముక్కులు మూసుకున్నారు.చెక్కపెట్టె బద్దలు కొట్టారు. చంద్రమోహన్ శవం బయటపడింది. రెండు రోజుల కిందట చంద్రమోహన్ కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. చంద్రమోహన్, రాజకుమారి ప్రేమించుకున్నారు. చంద్రమోహన్ ఒక డ్రైవర్ కొడుకు. రాజకుమారి కోటీశ్వరుడైన రత్నయ్య ఏకైక కుమార్తె. కూతురు తమ కులం కాని ఒక అనామకుడిని ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాడు రత్నయ్య. అతన్ని మాట్లాడదామని రైసుమిల్లుకి పిలిపించాడు. కొడుకు, తను కలిసి చంద్రమోహన్‌ని హత్య చేశారు. ఎవరికీ తెలియదులే అనుకుని మిల్లు వెనుక ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టారు.కాని రత్నయ్యకు తెలియదు నేరం దాగదని. ఎవరూ చూడటం లేదని అనుకోవడం అజ్ఞానం. పైన ఎవరో ఒకరు చూస్తుంటారు. నేరం బయట పడుతుంది.కోటీశ్వరుడు రత్నయ్య తన కూతురిని ప్రేమించిన చంద్రమోహన్‌ని హత్య చేసి, తన మిల్లు ఆవరణలోనే పాతి పెట్టాడనే వార్త హిందూపురం అంతటా శరవేగంగా వ్యాపించింది. తర్వాత టీవీ చానల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రత్నయ్య, అతని కొడుకు హత్యా నేరంపై జైలుకెళ్లారు. -వాణిశ్రీ -
పరకాయ ప్రవేశం
‘‘ఏమండోయ్, కాఫీ తాగేసి త్వరగా తయారయారంటే వేడి వేడి పెసరట్లు మీకిష్టమైన అల్లం పచ్చడితో వడ్డిస్తాను’’ ఒక చేతిలో కాఫీ కప్పునీ, మరో చేతిలో ఆవేళ్టి న్యూస్ పేపర్నీ పెట్టేసి హడావిడిగా వంటింట్లోకి దూరింది నా శ్రీమతి. నా అలవాట్లనీ , ఇష్టాయిష్టాలని గమనించుకుని వాటికనుగుణంగా నడుచుకునే నా భార్య సుచిత్ర అంటే నాకు ప్రాణం. ఇంజనీరింగ్ చదువుతున్న మా ఒక్కగానొక్క కొడుకు రోహన్ పద్ధతిగా ఉంటాడు. పడగ్గదిలో కూర్చుని పేపర్ చదువుతున్న నాకు హాల్లో నుంచి మా సుపుత్రుడు వాళ్ళ అమ్మతో పెద్దగొంతుకతో వాదిస్తుండడమూ, ఆవిడేమో కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేయడమూ తెలుస్తోంది. ‘‘అమ్మా, మన ఇంటెదురు బంగాళాలోని కృష్ణమోహన్ అంకుల్ వున్నారే, ఆయన వాళ్ళ అబ్బాయికి, అదేనమ్మా నా క్లాస్మేట్ మదన్‌కి పుట్టినరోజు బహుమతిగా కారు కొనిచ్చారు. నా పుట్టినరోజుకి కారు కాదు కదా కనీసం ఒక చిన్న బైక్ కూడా కొనివ్వలేదు నాన్న. ఆ అంకులూ, నాన్నా కలిసే చదువుకున్నారు కదమ్మా, కాలేజీ మొత్తమ్మీద నాన్నేమో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటే అంకుల్ మాత్రం అత్తెసరు మార్కులతో పాసయ్యారని నాన్నే చెబుతుంటారుగా! అలాంటిది, అంకుల్ చక్కగా సొంత బిజినెస్ పెట్టి అంతెత్తుకి ఎదిగితే, నాన్నేమో ఎదుగూబొదుగూ లేని గవర్నమెంట్ ఉద్యోగంలో కూరుకుపోయారు. ముడుపులని ముట్టుకునేది లేదంటూ మడికట్టుక్కూర్చున్నారు. ఎంత చాతకానితనమమమ్మా అది ! నువ్వైనా కాస్త చెప్పొచ్చుగా నాన్నకి’’ \ రోహన్ మాటలకి షాక్ తిన్నాను. ‘‘మా వాడికి నా మీద వున్న అభిప్రాయం ఇదా ? వీడి దృష్టిలో నేను చేతకాని వెధవనా?’’ ‘‘డబ్బుతో అన్నీ కొనుక్కోలేమురా నాయనా. ఉన్నంతలో సర్దుకుపోవడంలో వున్న సుఖం ఎందులోనూ లేదు’’ కొడుకు మాటలకి బాధపడ్డ మనసు మా ఆవిడ మాటలకి కాస్త తేరుకుంది. ‘‘డబ్బుతో కార్లనీ , బైకులనీ కొనగలము కానీ సరదాలనీ, సంతోషాలనీ కొనలేము రోహన్. మన పక్క ఫ్లాట్‌లో వుండే మమత ఆంటీని చూడు, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంత ఆనందంగా వుంటుందో! వాళ్ళాయన శంకర్రావ్ ఊరూపేరు లేని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగస్తుడు. అయితే ఏం, భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు! రోజూ ఠంఛన్‌గా సాయంత్రం అయిదుగంటలకల్లా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. వారంవారం భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా సినిమాలకి వెళ్తారు. మీ నాన్నలాగా భార్య మొహాన నాలుగు డబ్బులు విదిలించేసి ‘నీకిష్టమైనవి కొనుక్కో’ అనకుండా ఆవిడకి తోడుగా దగ్గరుండి సెలెక్ట్ చేసి మరీ ప్రతీ పండక్కీ కొత్త నగలనీ, చీరలనీ కొంటాడు. పుట్టినరోజులనీ, పెళ్లిరోజులనీ వాళ్ళెంత సరదాగా జరుపుకుంటారో నీకూ తెలుసుగా! అదీ జీవితమంటే. దేనికైనా పెట్టి పుట్టాలి!’’నిర్వేదంగా వినిపిస్తున్న మా ఆవిడ మాటలకి నిర్ఘాంతపోయాను. ‘‘సుచిత్ర మనసులో నా పట్ల అంతటి అసంతృప్తి పేరుకుపోయిందా?’’ రెండు చేతులా డబ్బులని సంపాదించే కృష్ణమోహన్, భార్యతో రోజంతా సరదాగా గడిపే శంకర్రావ్లాంటి వాళ్ళవే నిండైన జీవితాలన్న విషయం యిప్పుడిప్పుడే నా మనసుకి బోధపడసాగింది. పరకాయప్రవేశం చేసైనా సరే ఆ కృష్ణమోహన్, శంకర్రావ్ల శరీరాల్లో దూరి సిసలైన సంతృప్తిని తనివితీరా అనుభవించడమే కాకుండా వాళ్ళని చూసి నేర్చుకోవలసినదంతా నేర్చుకుని వాళ్లకిమల్లే నేనూ నా భార్యాబిడ్డల్ని సంతోషపెట్టాలన్న వాంఛ పెరిగిపోసాగింది. అసంభవమని తెలిసినా ‘‘స్వామీ, ఒక్కసారి వాళ్లిద్దరి మనసుల్లో దూరి నిజమైన సంతృప్తిని అనుభవించే అదృష్టాన్ని నాకు కల్పించవూ’’ అంటూ నా ఇష్టదైవమైన శివుడిని నాకు తెలీకుండానే రెండు చేతులూ జోడించి భక్తితో వేడుకున్నాను. ‘‘‘ఓం శంభో శంకరా’ అంటూ భక్తితో నన్ను స్మరించుకుని ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటావో ఆ వ్యక్తి శరీరంలోకి నీ మనసు ప్రవేశించగల వరాన్ని నీకీ క్షణమే ప్రసాదిస్తున్నాను.’’ ‘‘ధన్యుడను స్వామీ’’‘‘శుభమస్తు’’ అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయాడు పరమశివుడు. ‘ఓం శంభో శంకరా’ అనుకుని ఆ పైన శంకర్రావ్ పేరుని తలచుకున్నదే తడవుగా మనసు వాయువేగాన వెళ్లి శంకర్రావు శరీరంలోకి ప్రవేశించింది. మా ఆవిడ చెప్పింది నిజమేలాగుంది. వాళ్ళావిడ భుజం చుట్టూరా చెయ్యేసి సరదాగా మాట్లాడుతూ మాల్లో షాపింగ్ చేస్తున్నాడు శంకర్రావ్. ఈ వేళ ఆదివారమేమీ కాదే! ఆఫీస్‌కి సెలవు పెట్టాడేమో మరి. అటువైపు ఫోన్లో మాట్లాడుతున్నది అతని బాస్ కాబోలు, వినయంగా సమాధానమిస్తున్నాడు. ‘‘సార్, మా బామ్మకి సీరియస్ అయితే ఐసీయూలో పెట్టారండీ, అందుకే ఈవేళ ఆఫీస్‌కి రాలేకపోతున్నా’’ ‘బీప్’ అంటూ శబ్దం రావడంతో ఫోన్లో వచ్చిన మెసేజ్ ని చదువుకుని హుషారుగా నవ్వుకున్నాడు శంకర్రావ్. ‘‘మమతా డార్లింగ్, ఆఫీస్ నుండి ఒకటే ఫోన్లు, అర్జెంటు పని. యిలా వెళ్లి అలా పని ముగించుకుని వచ్చేస్తానే, ఈలోగా నువ్వు నీ షాపింగ్ పని పూర్తి చేసుకో’’ అంటూ ఆగమేఘాల మీద బయల్దేరాడు. ‘‘మీరెప్పుడూ ఇంతే, నాతో షాపింగుకని రావడం, వచ్చిన పదినిమిషాలకే ఆఫీస్ పనంటూ వెళ్ళిపోవడం. ఛ ఛ.’’ వాళ్ళావిడ విసుక్కుంటున్నా విననట్లుగానే వెళ్లిపోయాడు శంకర్రావ్. అతనితో పాటే నా మనస్సూనూ ! శంకర్రావ్ బైక్ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ‘‘ఇతను పని చేసేది మరీ ఇంత చిన్న ఆఫీస్‌లోనా?’’ ఈలోగా తలుపులు తెరిచి వాకిలికి అడ్డంగా వయ్యారంగా నిలబడ్డ ఓ ముప్ఫైరెండేళ్ళ పడతి నడుం మీద సుతారంగా వేళ్లతో మీటుతూ ఆమె భుజం మీద చెయ్యేసి ఆ యింట్లోకి.., కాదు కాదు, సరాసరి ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు శంకర్రావ్. ఉన్నపళాన ఇంటికి వెళ్లి మా ఆవిడని తీసుకొచ్చి ఇదంతా చూపించి ‘‘వీడి గురించేనా నువ్వంత గొప్పగా మాట్లాడింది?’’ అంటూ నిలదీయాలనిపించింది. ఛ ఛ, చూసింది చాలు. ఇలాంటి మోసగాడి శరీరంలో యిక ఒక్క క్షణమైనా వుండలేను బాబూ ! శివనామస్మరణ చేసుకుని కృష్ణమోహన్ శరీరంలోకి చేర్చమంటూ మనసులో ప్రార్థించాను.మురికి కూపంలాంటి శంకర్రావ్ దేహం నుంచి బయటపడ్డ నా మనసు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని కృష్ణమోహన్ శరీరంలోకి ప్రవేశించింది. అసలు కృష్ణమోహన్ శరీరంలో మనసు ఉండవలసిన చోటంతా ఖాళీ !మనస్సనే ఛాయలే లేకుండా మనిషి వుండడం నాకెంతో అయోమయంగా తోచింది. ఇంతలో ఏవో ఫైళ్ల ని చేత్తో పట్టుకుని ఛాంబర్ లోకి వచ్చి కృష్ణమోహన్‌కి ఎదురుగా కూర్చున్నాడు ఒక వ్యక్తి. ‘‘మూర్తీ, ఆ గవర్నమెంట్ ఫ్లైఓవర్ కాంట్రాక్టు విషయం ఏమైంది? ఆ ఆఫీసర్‌తో డీల్ విషయం మాట్లాడావా?’’‘‘సార్, ఆ పోస్ట్‌లోకి కొత్తగా బదిలీ అయి వచ్చిన ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. ఎంత పెర్సెంటేజీ ఆఫర్ చేసినా అతనొప్పుకోవడంలేదు.’’‘‘పోనీ డబ్బు కాకుండా అతనికి మరేవైనా బలహీనతలున్నాయేమో కనుక్కున్నారా?’’‘‘ ఆడవాళ్ళ పిచ్చి బాగా ఉందని తెలిసింది సార్.!’’ ‘‘మరింకేం, వాడికి కావలసిన పిల్లని పంపిస్తే సరిపోతుందిగా ! ‘‘‘‘ కొత్త అమ్మాయిలని పట్టుకోవడం చాలా కష్టంగా వుంది.’’రెండు క్షణాల పాటు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ‘‘ప్రస్తుతానికి నా పీయే రజిత ఉందిగా , దాన్ని ఎర వేసేయండి’’‘‘ఆ పిల్ల యిలాంటి పనులకి ఒప్పుకోదు సార్ ’’‘‘కొత్తగా మాట్లాడుతున్నావేమిటి మూర్తీ? గతంలో ఎంతమంది కన్నెపిల్లలని బలవంతంగా మనమిలాంటి పన్లకి ఉపయోగించుకోలా? అంతగా ఆ పిల్ల బెట్టుచేస్తే ఏ కాఫీలోనో రేవ్ డ్రగ్ కలిపిచ్చేయండి. డ్రగ్మత్తులో ఏం జరిగిందీ ఎవ్వరికీ గుర్తుండదు. ఇవి కూడా నేనే చెప్పాలా?’’ చిరాకుపడ్డాడు కృష్ణమోహన్.‘‘అలాగే సార్’’మూర్తి వెళ్ళిపోయాక చేత్తో ఒక ఫైల్ ని పట్టుకుని మరొక వ్యక్తి ప్రవేశించాడు. ‘‘ఏవయ్యా గుప్తా, నాల్గు నెలలుగా ఆ టేబుల్ నుండి మన మెట్రో కాంట్రాక్టు ఫైల్ అరంగుళం కూడా కదలడం లేదు. ఎంతాలస్యంజరిగితే మనకంత నష్టమని తెలీదా నీకు?’’ వచ్చిన వ్యక్తిని గద్దించాడు కృష్ణమోహన్.‘‘ఏం చేయమంటారు సార్? ఆ సీట్లో వున్న రామరాజు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే. ఎన్ని ప్రలోభాలు చూపినా అతను దేనికీ లొంగట్లేదు’’‘‘సరే, యింక చేసేదేముంది. లేపించేయ్ ఆ శాల్తీని’’సింపుల్‌గా చెప్పేసి టేబుల్ మీద ఉంచిన ప్లేట్ లోని బిస్కెట్లని తింటూ టీ తాగసాగాడు కృష్ణమోహన్. భయంతో మనసు జలదరించింది.అప్పుడే ‘నోట్ల రద్దు’ అనే వార్త చూసి కృష్ణమోహన్‌కు గుండె పోటు వచ్చింది.కష్టం మీద ‘ఓం శంభో శంకరా’ అంటూ ఈశ్వరుడ్ని ప్రార్థించి అక్కడి నుండి బయటపడింది నా మనసు. ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చి అడ్డమైన దుర్గంధాలన్నీ అంటించుకుని వచ్చిన మనసుకి నా శరీరాన్ని చేరుతూనే అంటుకున్న మురికంతా మటుమాయమైపోయి ఒళ్ళంతా తేలికయినట్లపించింది. ‘‘మళ్ళీపడుకున్నారేమిటండీ ? లేవండీ’’మా ఆవిడ మాటలకి దిగ్గున లేచా ! ‘‘ఏమండీ, ఈ విషయం విన్నారా? మన ప్రక్క ఫ్లాట్ శంకర్రావ్ లేడూ, అతనికి ఇదే ఊళ్ళో చిన్నిల్లుందటండీ! ఆ సంగతి తెలిసినప్పటి నుంచి పాపం వాళ్ళావిడ ఒకటే ఏడుస్తోంది. ఏమైనా నాకుమల్లే అందరికీ శ్రీరాముడిలాంటి భర్త దొరకడమంటే మాటలా చెప్పండి? ’’ నా సమాధానంకోసం ఎదురు చూడకుండానే నేను ఖాళీ చేసిన కాఫీకప్పు తీసుకుని వెళ్ళిపోయింది సుచిత్ర. ఆవిడలా వెళ్లిందో లేదో యిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు మా పుత్రరత్నం.‘‘నాన్నా , మన కృష్ణమోహన్ అంకుల్‌కి గుండెపోటు వస్తే హాస్పిటల్లో చేర్పించారట! పోలీసులకి ఆయన గోడౌన్లలో రద్దు చేసిన పెద్దనోట్ల కట్టలు కోట్లకొద్దీ దొరికాయట! కాలేజీలో తన పరువుపోయిందని చెప్పి వాళ్ళ అబ్బాయి మదన్ క్లాసులకి రావడం మానేశాడు. కాలేజీమొత్తం ఇదే చర్చ నాన్నా. ‘పై రాబడి వచ్చే అవకాశాలున్న వుద్యోగం చేస్తూ కూడా ఈ కాలంలో నిజాయితీగా ఎంతమంది వుంటారండీ? మన రోహన్ నాన్నలాగా నీతిగా, పరుల సొమ్ము ఆశించకుండా నిబద్ధతతో జీవించేమనుషులని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు’ అని మా లెక్చరర్లంతా అంటుంటే నాకెంత సంతోషమేసిందో తెలుసా! ఐయాం వెరీ ప్రౌడాఫ్ యూ నాన్నా.’’నా చేతులని పట్టుకుని గట్టిగా ఊపేస్తున్న మా వాడి కళ్ళల్లో ఆ క్షణాన నాపట్ల కనిపించిన ఆరాధనా, కొద్ది ఘడియల ముందర మా ఆవిడ తన మాటల్లో నాపై వ్యక్తపరచిన నమ్మకమూ, ప్రేమా యివి కావూ అసలైన నిధులు! - అప్పరాజు నాగజ్యోతి -
షాక్ తిన్న అనుష్క
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి అనుష్క ఓ బెంగాలీ న్యూస్ పత్రికపై మండిపడ్డారు. తాను ఇవ్వకపోయినప్పటికీ.. ఇచ్చినట్లు ఫేక్ ఇంటర్వ్యూ ను ప్రచురించినందుకు అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తాజాగా ఇండియా టైమ్స్ కు చెందిన ఇఐ సమయ్ అనే బెంగాలీ పత్రిక అనుష్క ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూ ప్రచురించింది. దీనిపై స్పందించిన అనుష్క తాను అసలు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘ఆ కథనం చూసి షాక్ తిన్నా. నా వ్యక్తిగత విషయాలు నేను ఎవరితోనూ పంచుకోలేదు. అదంతా అబద్ధం’ అంటూ ఆమె తెలిపారు. కోహ్లితో అనుష్క ప్రేమ వ్యవహారం.. వైవాహిక జీవితం... ముఖ్యంగా ఆ మధ్య ఇద్దరు వీరవిహారం చేస్తున్న ఛుంబనంతో దిగిన ఫోటోపై కూడా ఆమె ప్రస్తావించిందంటూ ఆ కథనం పేర్కొంది. అయితే వారిపై లీగల్ చర్యలు తీసుకునే ఉద్దేశ్యంపై మాత్రం ఆమె స్పందించలేదు. ప్రస్తుతం ఆమె దర్శకుడు శరత్ కఠారియా రూపొందిస్తున్న సూయి ధాగా చిత్రంలో వరణ్ ధావన్ సరసన నటిస్తోంది. It is SHOCKING to see a completely fabricated interview of mine in a reputed publication like @Ei_Samay. This is to clarify that I have NEVER done an interview on my personal life with them or with anyone else. Just shows how carelessly your personal freedom is looked at by them. pic.twitter.com/ncmcuuJvVs — Anushka Sharma (@AnushkaSharma) March 9, 2018 -
బలిపశువు
‘‘నమస్కారం సార్’’ అన్న పిలుపుతో న్యూస్ పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా ఇరవై ఏళ్ల కుర్రాడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఎగాదిగా చూసి ఏమిటన్నట్లుగా తలెగరేశాను. ‘‘పనేదైనా ఉంటే ఇప్పించండి సార్! చాలాదూరం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. పదో తరగతి వరకూ చదివా. మా ఊర్లో పంటలు లేక పనులు లేక కరువు వచ్చి ఇట్లా వచ్చాను సార్..’’ గడగడా అప్పజెప్పేశాడు. ‘‘ఇప్పుడు అన్‌సీజన్. పనులేవీ లేవు కదయ్యా!’’ అని నేను అంటుండగానే, ‘‘సార్సార్ నాతో పాటు ఊర్లో అమ్మ, నాన్న, తమ్ముడు బతకాలి. మీరేం పని చెప్పినా చేస్తా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. మొన్నరాత్రి ఒక పనిగురించి యాదగిరి నావద్దకు వచ్చి వెళ్లిన సంగతి గుర్తుకువచ్చింది. మరొకమారు వాడిని తేరిపార చూశాను. పనికొచ్చేటట్లే ఉన్నాడనిపించింది. ‘‘ఏం పేరు నీది?’’ అడిగాను. పని దొరికిందనుకున్నాడో ఏమో వాడి ముఖం ఒక్కసారి వెలిగిపోయింది. ‘‘నా పేరు కురుమూర్తి సార్. పాలమూరు పక్క పల్లె సార్ మాది’’ అన్నాడు వాడు. ‘‘ప్రస్తుతానికి పనులేవీ లేవు. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నా. వంటమనిషి ఊరెళ్లాడు. వాడు వచ్చేవరకూ ఇంట్లో పనులు చూసుకో’’ అని చెప్పి మళ్లీ పేపర్లో తల దూర్చాను. మంచి హుషారైన కుర్రాడి మాదిరి ఉన్నాడు. చేతి సంచి మూల ఉంచి చీపురు అందుకొని వెంటనే పనిలోకి దిగిపోయాడు. లేబరు కాంట్రాక్టరుగా గత ఐదారు సంవత్సరాలనుండి శ్రీశైలం అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో ఉంటున్నాను. ఫారెస్టులో రోడ్లు వెయ్యడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడానికి, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నన్ను కలుస్తుంటారు. వాళ్లకు తగిన పనివాళ్లను సప్లై చేయడం నా పని. ఇక్కడి గిరిజనుల్లో నాకు మంచి పరిచయాలున్నాయి కాబట్టి పనులకు మనుషులను పంపడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్లు నిరక్ష్యరాస్యులు. కూలీగా ఎంత ఇస్తే అంత కళ్లకద్దుకొని మరీ తీసుకుపోతారు. అందువల్ల నా సంపాదన బాగానే ఉంటున్నది. మొన్నరాత్రి యాదగిరి చెప్పిన పనిగురించే ఆలోచిస్తూ ఉన్నాను. డబ్బు కూడా బాగానే ముట్టేటట్లుంది. ఎటొచ్చీ చేద్దామా, వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. వీడ్ని చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించి పనిలోకి దిగుదామని నిర్ణయించుకున్నాను. వెంటనే మనిషిచేత నా సమ్మతి తెలియజేస్తూ యాదగిరికి కబురంపాను. ఒక నెలరోజులు గడిచాయి. అనుకున్నరోజు మనిషి వచ్చి అడ్వాన్సు ఇచ్చి ఆరోజు రాత్రి చేయవలసిన పనిగురించి వివరంగా చెప్పి వెళ్లిపోయాడు. కురుమూర్తిని పిలిచాను. ‘‘ఇదిగో నీ నెల జీతం. వెంటనే ఇంటికి మనీయార్డరు చేసి రాత్రికి రెడీగా ఉండు. అడవిలో కొంచెం పని ఉంది. వెళ్లి వద్దాం’’ అని అడ్వాన్సుగా ఇచ్చిన కట్టలో కొన్ని నోట్లు తీసి అందించాను. అంత డబ్బు ఇస్తానని ఊహించనివాడు కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాడు. ‘‘ఊ! తీసుకో. రాత్రికి స్పెషల్ భోజనం ఇద్దరికీ చెయ్యి..’’ అనగానే ‘‘అట్లాగే సార్’’ అని నోట్లందుకొని సంబరపడిపోతూ దండం పెట్టి వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నర కావస్తున్నది. అమావాస్య చీకటి. మోటార్ సైకిల్ మీద కురుమూర్తిని ఎక్కించుకొని బయలుదేరాను. పదికిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద ప్రయాణించి తరువాత ఫారెస్టులోని డొంక రోడ్లోకి తిప్పాను. బాటకిరువైపులా ముళ్ల పొదలు. కొంచెం పక్కకి పోయినా పంక్చరు పడ్డం ఖాయం. అలవాటైన దోవ కాబట్టి జంకు లేకుండా ముందుకుపోతున్నాను. వెనుక కురుమూర్తి మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు. బయలుదేరేముందు నాతోపాటే భోజనం చెయ్యమన్నాను. నేను వేసుకునే లాల్చీ పైజామా ఒక జత ఇచ్చి వేసుకొనమన్నాను. మొహమాటపడుతూనే వేసుకొని తయారయ్యాడు. దోవలో వాడి అమ్మా నాన్నల గురించి, తమ్ముడి గురించి, మధ్యలో నా మంచితనం గురించి పొగుడుతూ చాలాసేపు చెప్పాడు. ‘‘ఇంకా ఎంతదూరం పోవాలి సార్’’ మాటల మధ్యలో అన్నాడు వాడు. ‘‘ఇదుగో వచ్చేశాం. ఆ కనబడే మంట దగ్గరకే’’ అన్నాను. ఒక వంద గజాల దూరంలోనే బండి ఆపి ఇద్దరం తుప్పల్ని, పొదలను తప్పుకుంటూ మెల్లగా అక్కడికి చేరుకున్నాం. దూరంనించి మంట చిన్నదిగానే కనిపించినా, దగ్గరికి వెళ్లేసరికి చాలా పెద్ద సైజులో మండుతున్నది. పక్కనే పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టు. కింద పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసిన పెద్ద పీట, పెద్ద సైజు చెక్కమొద్దు, ఇంకా పూలు, నిమ్మకాయలు తదితర పూజా ద్రవ్యాలు ఉన్నాయి. మంట ఎదురుగా బుర్రమీసాలు, నిలువు బొట్టు, ఎర్రటి పంచెకట్టు, బానపొట్ట భుజంపైన తెల్లకండువాతో భయంకరమైన మనిషి కళ్లుమూసుకు కూర్చొని మంత్రాలు బిగ్గరగా జపిస్తున్నాడు. మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్లేసరికి యాదగిరి ఎదురొచ్చాడు. ‘‘రా అన్నా! అంతా రెడీయేనా?’’ అన్నాడు, కురుమూర్తిని ఎగాదిగా చూస్తూ. ‘‘సరిగ్గా టైముకు వచ్చామా?’’ అడిగాను వాచీని మంట వెలుగులో చూసుకుంటూ. ‘‘ఆ! అయిపోవచ్చింది. కాసేపు కూర్చోండి..’’ అని ఒక బండ చూపించి వెనక్కు వెళ్లిపోయాడు. ‘‘కూర్చోవోయ్’’ అని కురుమూర్తికి చెప్పి బండమీద ఊది చతికిలబడ్డాను. వాడు కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడి జరిగే తంతుని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఈ యాదగిరి నాకు రెండు నెల్ల క్రితమే పరిచయమయ్యాడు. పని గురించి మొదట మాట్లాడింది, తరువాత అడ్వాన్సు ఇచ్చి వెళ్లిందీ ఇతనే. మొదట్లో ఈ పని నావల్ల కాదు అని చెప్పినా రేటు పెంచి నా చేత ఒప్పించాడు. మంచి పట్టుదల మనిషి. పని ఏ విధంగానైనా చేయించి సాధించాలనే టైపు వ్యక్తి. ఇంతలో ఏవో మాటలు విన్పించడంతో అటు చూశాను. చీకట్లో గమనించలేదు కానీ అక్కడ ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు. యాదగిరి వాళ్లతో ఏదో మాట్లాడుతూ మళ్లీ మావైపొచ్చాడు. వాళ్లు చేతులు కట్టుకుని అతణ్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మావద్దకి వచ్చేటప్పటికి మాటలు ఆపేశారు. అపుడు గమనించాను వాళ్లని. క్రూరమృగాల మాదిరి పచ్చిరక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు. కట్ బనియన్ ధరించి అడ్డు పంచలతో ఉన్నారు. మా సమీపానికి వచ్చేసరికి బ్రాందీ వాసన గుప్పుమంది. ఇంతలో అగ్నిగుండం దగ్గరి మాంత్రికుడు నెమ్మదిగా కళ్లు తెరిచి మంటలోకి ఏవో రసాయనాలు చల్లి మరింత ప్రజ్వలింపజేశాడు. ఈసారి పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్యలో ఆపి, యాదగిరి వైపు తిరిగి ‘‘పశువు సిద్ధమేనా?’’ అని బిగ్గరగా అరిచాడు. యాదగిరి అతడి వద్దకు వడివడిగా వెళ్లి నెమ్మదిగా ఏదో మాట్లాడి, ఇటు తిరిగి తన మనుషులకు సైగ చేశాడు. వాళ్లు వెంటనే కురుమూర్తిపైకి ఉరికి పారిపోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. కురుమూర్తికి అప్పుడర్థమైనట్లుంది, పశువంటే ఎవరో. మరుక్షణమే వాళ్ల పట్టునుండి గింజుకుంటూ ‘‘బాబూ నన్ను వదలండి. సార్ వీళ్లను వదలమని చెప్పండి మీ కాల్మొక్కుతా. బుద్ధిలేక మీకాడ పనికొచ్చినా, మీ పని వద్దు, జీతం వద్దు. నన్నొదలండి. సార్ వదలమని చెప్పండి..’’ అని పెద్దగా ఏడుస్తూ అరవసాగాడు. యాదగిరి మనుషులు ఇవేమీ పట్టించుకోకుండా వాణ్ని మాంత్రికుడి దగ్గరకు ఈడ్చుకు వెళ్లారు. మాంత్రికుడు నిర్వికారంగా వాడి మొఖానికి పసుపు రాసి, కుంకుమతో నిలువుబొట్టు పెట్టి బలికి సిద్ధం చేయసాగాడు. ఈ మధ్యలో యాదగిరి నా వద్దకు వచ్చి ‘‘ఇదుగో అన్నా! బ్యాలెన్సు డబ్బు..’’ అని జేబునుండి తీసి నాకందించాడు. ‘‘ఇక నువ్వు వెళ్లే పనైతే పోవచ్చు..’’ అన్నాడు. నేను డబ్బు జేబులో వేసుకొని ఏమీ మాట్లాడకుండా అటువైపు చూడ్డం గమనించి ‘‘సరే భయం లేకపోతే కాసేపు ఉండివెళ్లు..’’ అని తిరిగి వెళ్లిపోయాడు. కురుమూర్తి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి గొంతు రాసిపోయింది. ‘‘అన్నా! నన్ను వదిలెయ్యి. దేవుడా రక్షించు. బాబూ నన్ను చంపొద్దు..’’ అని మాంత్రికుడికి దండం పెట్టి పెద్దగా విలపించసాగాడు. ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్న మాంత్రికుడు జోడించిన వాడి చేతులు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చేతులను విడదీసి పరిశీలించి పెద్దగా ‘‘ఒరేయ్ యాదగిరీ! వీడు బలికి పనికి రాడ్రా.. చూడు వీడి చేతికి ఆరు వేళ్లున్నై..’’ అని అరిచాడు. ఈలోపల నేను కూడా అటు దగ్గరగా వెళ్లి చూశాను. నిజమే వాడి కుడి చేతికి మాత్రం ఆరువేళ్లున్నాయి. యాదగిరి కూడా వచ్చి చూశాడు. ‘‘ముందే చూసుకొని రావొద్దా? మూర్ఖులారా? ఈ యాగం అసంపూర్తిగా ఆగిపోయిందో మీ కోర్కెల మాట అటుంచి సర్వం నాశనమైపోతారు జాగ్రత్త’’ అని రంకెలు వేయడం మొదలుపెట్టాడు. యాదగిరి ఖిన్నుడైపోయినట్లు కనిపించాడు. ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి మాంత్రికుణ్ని పక్కకు తీసుకెళ్లి ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపించాడు. ప్లానంతా అప్సెట్ అయ్యేసరికి నాకు చాలా నిరాశ అనిపించింది. డబ్బు వచ్చినట్లే వచ్చి జారిపోయింది. ఇప్పుడీ కురుమూర్తి గాడిని ఏం చెయ్యాలి? బెదిరించి పంపేద్దామా? లేక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామా? ఫ్రీగా వదిలేస్తే విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయా? అని రకరకాల ఆలోచనలతో ఉన్న నాకు హఠాత్తుగా పక్కన ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడి అటు చూశాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యాదగిరి మనుషులు తమ ఉక్కు పిడికిళ్లతో నా జబ్బలు వడిసి పట్టుకున్నారు. ఒక్కసారిగా షాకైపోయాను. వడిగా మాంత్రికుడి వద్దకు ఈడ్చుకువెళ్లి ఎదురుగా నిలబెట్టారు. వాడు నా కాళ్లు చేతులు, ముఖం పట్టి పట్టి చూసి చుట్టూ తిరిగి పరిశీలించి ‘‘ఫర్వాలేదు, పనికొస్తాడు. సమయం కావస్తున్నది. పశువును పక్కన నిలబెట్టండి. పిలుస్తాను.’’ అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నాకు అప్పుడర్థమైంది.. మాంత్రికుడు, యాదగిరిల మధ్య జరిగిన సంభాషణ ఫలితం నన్ను కొత్త బలిపశువుగా మార్చిందని. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. విపరీతమైన భయంతో నిలబడలేకపోతున్నాను. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. అరిచినా ప్రయోజనం ఉండదు. ఈ కీకారణ్యంలో అర్ధరాత్రి నా కేకలు విని కాపాడే నా«థుడెవరుంటారు? వళ్లంతా చెమటతో ముద్దగా తడిచిపోయింది. ఇంతలో యాదగిరి ఎదురుగా వచ్చి తలదించుకొని ‘‘నన్ను క్షమించన్నా! ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. పని మధ్యలో ఆగిపోతే మాతో పాటు తను కూడా చస్తానని మాంత్రికుడు గట్టిగా చెబుతున్నాడు. పైగా టైమ్ కూడా లేదు వేరే మనిషిని చూసుకోవడానికి..’’ అని నా లాల్చీ జేబులో డబ్బు తనే తీశాడు. ‘‘ఒరేయ్! ఇలారా..’’ అని కురుమూర్తిని పిలిచాడు. వాడికి భయంతో పారిపోవడానికి కూడా చేతకాలేదు. వంగి దండం పెడుతూ వచ్చాడు. ‘‘ఇదుగో! ఈ డబ్బు తీసుకొని పారిపో. ఎక్కడైనా ఇక్కడి సంగతులు చెప్పావో.. ఖబడ్దార్’’ అంటూ డబ్బులు ఇవ్వబోగా, ‘‘నాకే పైసలు వద్దు సార్. నన్ను వదిలేయండి. ఈ జన్మలో ఇటుకేసి రాను..’’ అని యాదగిరి కాళ్లకు మొక్కి, లేచి నావైపు జాలిగా చూసి పరిగెత్తుతూ చీకట్లో కలిసిపోయాడు. నాకంతా ట్రాన్స్‌లో ఉన్నట్లుంది. ఎవరూ నన్ను రక్షించలేరు అన్న నిర్ణయానికి వచ్చేసి చావు కోసం మానసికంగా సిద్ధపడసాగాను. అలసటతో కనురెప్పలు వాలిపొయ్యాయి. ముఖంమీద ఏవో లేపనాలు పులుముతున్నట్లున్నారు. చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చెక్క మొద్దు మీద కాబోలు తల ఆనించి పట్టుకున్నారు. నాకు ప్రతిఘటించే శక్తి ఎప్పుడో పోయింది. వాళ్లు ఎటుతిప్పితే అటు తిరుగుతున్నాను. రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ముఖానికి వేడి సెగ తగిలింది. కళ్లు తెరుద్దామనుకొనేంతలో మెడ మీద చురుక్కుమనిపించింది. వెంటనే కళ్లముందు శాశ్వతంగా చీకటి తెర దిగిపోయింది. ఆర్.వి.శివప్రసాద్ -
మంచి పని వల్ల ఎప్పటికైనా మంచే!
ఆత్మీయం ఇతరులకు మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని, చెడు చేస్తే చెడు ఫలితాన్నీ పొందుతామన్న సూక్తిని హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కుమతం, జైనమతం వంటి అన్ని మతాలూ బోధించాయి. అయితే దీని మీద మనకి నమ్మకం కాని, గురి కాని, గౌరవం కాని, భయం కాని లేకపోవడంతో ఈ దైవనియమాన్ని అర్థం చేసుకుని మన బాగు కోసం ప్రవర్తించడం మనం పూర్తిగా విస్మరించాం. దీని ఫలితమే నిత్యం నేడు మనం దినపత్రికల్లో చూసే వివిధ అకృత్యాలు, అన్యాయాలు, ఇతర దారుణాలు. ‘నేను ఇతరులను బాధించి లబ్ధి పొందితే, తిరిగి దానికి నేను ఎక్కువ రెట్లు బాధ అనుభవించి, నేను లబ్ధి పొందిన దానికంటే ఎక్కువ రెట్లు కోల్పోతాను’ అనే నమ్మకంతో కూడిన భయం స్పష్టమైన ఉదాహరణలతో మనకి అందక పోవడం వల్లే మనుషులు అన్యాయాలు చేయడానికి వెరవడం లేదు. కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. దీనినే అమెరికన్లు‘సరైన మనిషి, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు. -
పత్రికల ధోరణిలో మార్పు రావాలి
‘నవ తెలంగాణ’ దినపత్రిక ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడి ఈ పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచన సాక్షి,హైదరాబాద్: పత్రికలు సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఈ తీరులో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతులేని దుఃఖంలో ఉన్న ప్రజల గాథలు కొన్ని పైపైనే కనిపిస్తాయని, మరి కొన్నింటి కోసం లోతుగా అన్వేషించాల్సి ఉంటుందన్నారు.హైదరాబాద్‌లో లక్షా 50 వేలకు పైగా ప్రజలు ఫుట్‌పాత్‌లపైనే నిద్రపోతున్నారని ఓ సంస్థ సర్వేలో తేలిందని, ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక తనను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు. మనసును కదిలించే ఇలాంటి వార్తలు పత్రికల్లో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది విజ్ఞులతో నిండిన పత్రికా రంగం ఈ అంశంపై సమీక్షించుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రెస్ అకాడమీ చెర్మైన్ అల్లం నారాయణతో కలిసి ‘నవ తెలంగాణ’ దినపత్రిక, వెబ్‌పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం, పాత్రికేయులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమాజంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ.. అన్నార్తులకు అండగా ఉంటూ.. చక్కటి విశ్లేషణలు, వార్తలతో పత్రిక ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తన అస్తిత్వాన్ని పదిలపరుచుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పేరుతో కొత్త పత్రిక రావడం శుభ పరిణామమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రజాశక్తి’ పేరుతో వచ్చిన పత్రిక .. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ‘నవ తెలంగాణ’గా రూపాంతరం చెందడం అభిలషణీయమన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నించాలని పత్రిక యజమానులకు సూచించారు. పత్రికా రంగం నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, ఈ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ‘నవ తెలంగాణ’ సంపాదకులు ఎస్.వీరయ్య అంతకు ముందు తన ప్రసంగంలో పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. కొత్తగా ఏర్పడిన పత్రికకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. నవ తెలంగాణకు ప్రకటనల జారీ విషయంలో గతంలో ప్రజాశక్తి దినపత్రికకు అమలు చేసిన టారిఫ్‌ను కొనసాగిస్తామన్నారు. వచ్చే మంగళవారం నాటికి నవ తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పత్రికలు, విపక్షాలు కలిసి ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించాల్సిన అవసరముందన్నారు. ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ శేషు కుమార్ మాట్లాడుతూ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా పత్రికారంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, అమెరికా లాంటి దేశాల్లో సైతం చాలా పత్రికలు మూసివేత దిశగా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండే లైన్లు రాశారు: కేసీఆర్ ‘నవ తెలంగాణ’ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ పత్రికలతో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాలను వెల్లడించారు. గతంలో తాను అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై ఏకంగా 67 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని, నాటి స్పీకర్ తనను చాంబర్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు పత్రికల్లో తన ప్రసంగానికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా వెతకగా... కేవలం రెండు వాక్యాలకు మించి వార్త కనిపించలేదన్నారు. అయితే, అదే ఒకసారి అసెంబ్లీలో నిరసనగా ఓ కాగితాన్ని స్పీకర్ వైపు విసిరితే మాత్రం ‘స్పీకర్‌పై దాడి’ అనే శీర్షికతో భారీ ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. -
‘మహా’ మోసంపై కదిలిన యంత్రాంగం
విచారణకు ఆదేశించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించిన ఆర్డీవో సుధాకర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కరువు జిల్లాగా ప్రభుత్వ ప్రకటనకు అవరోధంగా తయారవుతున్న అక్ర మ పత్తి కొనుగోళ్లపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘మహా మోసం’ కథనం జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. దళారుల అక్రమ దందాపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ సీరియస్ అయ్యా రు. ఈ అక్రమంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని సీసీఐ పత్తి రికార్డులను పరిశీలించారు. రైతుల పేరుతో దళారులు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పరిశీలించారు. రైతుల పేరుతో ఎక్కువ మొత్తంలో పత్తిని సీసీఐకి విక్రయించిన దళారులను వెలికితీసేందుకు మార్కెట్ తక్‌పట్టీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీఐకి విక్రయించిన రైతులు జిల్లాకు చెందిన వారేనా..? కాదా..? అనే కోణంలో వివరాలను సేకరించారు. ఈ మేరకు వారి పేర్లను జైనథ్, తాంసి, తలమడుగు తదితర మండలాల తహశీల్దార్లకు వివరించి విచారణ చేపట్టాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తుల వద్ద స్టేట్మెంట్లను రికార్డు చేయాలని సంబంధిత తహశీల్దార్లకు ఆర్డీవో ఆదేశించారు. అధికారుల ప్రాథమిక పరిశీలనలో ఆసక్తికరమైన అక్రమాలు వెలుగు చూశాయి. తాంసికి చెందిన ఓ దళారి రైతు పేరుతో సుమారు రూ.3.40 లక్షల విలువ చేసే 86 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు ప్రాథమికంగా తేలింది. అలాగే 12 క్వింటాళ్ల కెపాసిటీ ఉండే ఆటో 28 క్వింటాళ్ల పత్తిని తెచ్చిన దళారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. రైతుల పత్తికి కనీస మద్దతు ధర అందించేందుకు సీసీఐ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇది దళారులకు వరంగా మారింది. సీసీఐ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 43 లక్షల క్వింటాళ్ల పత్తిలో సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల వరకు దళారులే విక్రయించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి, సీసీఐకి రూ.4,050 చొప్పున సీసీఐకి అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. మహారాష్ట్రతోపాటు, ఇతర జిల్లాలకు చెందిన పత్తి కూడా పెద్ద మొత్తంలో ఈ కేంద్రాలకు అక్రమంగా దిగుమతి అయ్యింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు కూడా దళారులకు సహకరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎక్కడెక్కడో పండిన పత్తి అంతా ఆదిలాబాద్ జిల్లాలోనే పండినట్లు అధికారిక రికార్డులలో ఎక్కుతోంది. దీంతో కరువు జిల్లా ప్రకటనకు తీవ్ర అవరోధంగా మారనుంది. పత్తి విక్రయించిన రైతులకు సీసీఐ చెక్కుల ద్వారా పత్తి డబ్బులు చెల్లిస్తోంది. ఇలా చెక్కుల ద్వారా కాకుండానే నేరుగా రైతుల ఖాతాలో సొమ్మును జమచేసే విధానాన్ని అమలు చేస్తే 99 శాతం వరకు అక్రమాలకు అడ్డుకట్ట పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అధికారులు కొన్ని సాకులు చూపి ఈ విధానాన్ని అమలు చేయలేదు. దీంతో ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ‘జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాము..’ అని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. -
బెంగళూరు బాంబు కేసుకు తెలుగు రాష్ట్రాల లింకు?
తెలుగు దినపత్రికతో బాంబును పార్సిల్ చేసిన ఉగ్రవాదులు సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ధ్వాన్ పేలుడుకు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐ బ్యాంకు దోపిడీకి మధ్య ఉన్న సంబంధాలపై స్పష్టత రాకుండానే మరో ఉగ్రవాద చర్యకు తెలుగు రాష్ట్రాలతో లింకు ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి బెంగళూరులోని చర్చి స్ట్రీట్‌లో పేలిన బాంబు శకలాల్లో ఓ తెలుగు దినపత్రిక(‘సాక్షి’కాదు) ముక్కల్ని అధికారులు గుర్తించారు. జీఏ పైపుతో ఐఈడీ బాంబును తయారు చేసిన ఉగ్రవాదులు దాన్ని ప్యాక్ చేయడానికి తెలుగు దినపత్రిక బెంగళూరు టాబ్లాయిడ్‌ను వినియోగించారు. దీంతో దర్యాప్తు వర్గాల దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లోని పట్నాలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు వరుస బాంబుల్ని పేల్చారు. జీఏ పైపుతో తయారైన ఎల్బో (వంపుతో ఉండే భాగం) వాడి ఈ బాంబులను తయారు చేశారు. బెంగళూరులో పేలిన బాంబు ఇలాంటిదే. బాంబును తొలుత చేతి రుమాలులో కట్టిన ఉగ్రవాదులు దానిపైన తెలుగు దినపత్రిక టాబ్లాయిడ్‌ను ఉంచి పార్సిల్ చేశారు. దుండగులకు తెలుగు పత్రిక ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు సాగుతోంది. పేలుడుకు కుట్ర పన్ని బెంగళూరులో బస చేసిన ఉగ్రవాదులు అక్కడే ఈ పత్రికను కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు. -
చైల్డ్ ప్రాడిజీ ప్రయత్నాలూ... నా వైల్డ్ ట్రాజెడీ అనుభవాలూ!!
నవ్వింత అప్పుడప్పుడూ బాలమేధావుల గురించి న్యూస్పేపర్లలో వచ్చినప్పుడు నాక్కాస్త అసూయగా ఉంటుంది. వెంటనే మా బుజ్జిగాడూ చైల్డ్ ప్రాడిజీ అయిపోయుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నా ఈ ప్రయత్నంలో భాగంగా దేశాలూ రాజధానులూ లేదా పెద్ద పెద్ద పదాల సెల్పింగులు చెబుదామనుకుంటే అవన్నీ ఇప్పటికే అందరూ చేసేశారు. అందుకే వాణ్ణి మాస్టర్ ఆఫ్ ఆల్ చేద్దామని నిర్ణయించుకున్నా. పురాణాలూ, నీతిపద్యాలూ, జనరల్ నాలెడ్జీ, న్యూస్‌పేపర్ రీడింగూ... గోనెసంచిలో సరుకులు కూరికూరి నింపినట్లుగా అన్నింటినీ ఏకకాలంలో వాడి బుర్ర అనే బస్తాలోకి నింపాలని నిర్ణయించుకున్నా. పొద్దున్నే కాసేపు న్యూస్ పేపర్ చదివి వినిపించాక... సబ్జెక్టు మార్చి పురాణాల్లోని హిరణ్యాక్షుడి వృత్తాంతం చెప్పా. వాడి మాటలతో నా బుర్ర తిరిగిపోయింది. ‘‘అన్నట్టు నాన్నా... నువ్వు చెప్పినట్టుగా భూమిని చాపచుట్టినట్టు చుట్టేసిన హిరణ్యాక్షుడి వృత్తాంతంలో హిరణ్యాక్షుడు భూకబ్జాకు పాల్పడ్డాడన్నమాట. ల్యాండ్ మాఫియాకు ఆద్యుడు అతడేనేమో. అందరి భూముల్నీ లాక్కున్నాడంటే తొలి ల్యాండ్‌గ్రాబింగ్ కేసు కూడా అతడిదేనేమో!? అందుకే భగవంతుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అందరికీ భూమిని సమానంగా పంచి, సత్యయుగంలో సామ్యవాదాన్ని నెలకొల్పి ఉంటాడు కదా’’ అన్నాడు. నేనేదో విడివిడిగా వార్తల్నీ, పురాణాల్నీ, సివిక్సూ గట్రా బోధిస్తే... వాడు అన్నింటినీ కలగలిపి సొంతం వ్యాఖ్యానాలు చెప్పడంతో నాకు మాటపడిపోయింది. ఈ న్యూస్‌పేపర్లు అచ్చిరాలేదని టీవీ చూపిద్దామని నిర్ణయించుకున్నా. పెద్ద పెద్ద కట్టడాలైన మలేషియాలోని పెట్రొనాస్ టవర్స్ చూపించా. ‘‘చూశావా... పెట్రోనాస్ టవర్స్ రాత్రిపూట పెట్రొమాక్స్ లైట్ల కాంతిలా ఎలా వెలుగుతున్నాయో. టోక్యో స్కై స్క్రేపర్సూ, టొరంటో టవర్సూ చూడు’’ అన్నా. వెంటనే వాడు ఛానెల్ మార్చేసి... నాకు యానిమల్ ప్లానెట్ చూపిస్తూ... ‘‘నువ్వే ఇది చూడు. అంత చిన్న తేనెటీగ... తన మల్టీస్టోరీడ్ బిల్డింగును అలా తల్లకిందులుగా కట్టుకుంటూ తన తేనెపట్టు నిడివి పెంచుకుంటూ పోతుంటే... భూమిపై ఒకదాని మీద మరో అంతస్తు కట్టుకుంటూ పోవడంలో విచిత్రం ఏముంది’’ అంటూ చప్పరించాడు. ‘‘అయినా నిట్టనిలువుగా కట్టడం గొప్పా... తలకిందులుగా నిర్మించడం గొప్పా?’’ అన్నాడు. ఈసారి, అల్లసాని వారి ప్రబంధాల్లో అల్లిక జిగిబిగి బాగుంటుంది కాబట్టి టంగ్ట్విస్టర్స్లాంటి పద్యాలుండే ప్రవరుడి వృత్తాంతం చెప్పా. ‘‘కటకచరత్కరేణు కరకంపిత సాలమున్, శీతశైలమున్’’ పద్యం చెబుతూ, హిమాలయాల్లో ఏనుగులు చెట్లను కదలిస్తున్నాయన్న అర్థం ఎలా ఉన్నా... ‘‘కటకచరత్కరేణు కరకంపిత - విపరీతంగా చలిపెడుతుంటే ఆ వణుకు వల్ల రెండు పలువరసలూ కటకటా కొట్టుకుంటున్న సౌండు వినిపిస్తోంది చూడు’’ అని పరవశంగా అన్నాను. ‘‘అవున్నాన్నా... ప్రవరుడు లేపనం పూసుకుని హిమాలయాలకు వెళ్లాలని ముందే డిసైడ్ చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు అక్కడ విపరీతంగా చలేస్తుందనీ, మంచు తాలూకు తడికి లేపనం కడుక్కుపోయే ప్రమాదం ఉందనీ ఎందుకు ఊహించలేదు? ఒక ఉలెన్ దుస్తుల్తో ఒంటిని నిండా కప్పి ఉంటే లేపనం అంత త్వరగా కడుక్కుపోయేది కాదు కదా. దారితప్పిపోకుండా హ్యాపీగా తిరిగి వచ్చేవాడు కదా’’ అన్నాడు. ఆ దెబ్బతో ప్రబంధాలు వదిలేసి కనీసం నీతి పద్యాలైనా చెబుదామని అనుకున్నా. వేమన, సుమతీ శతకాలైతే తేలిగ్గా ఉంటాయని, భాస్కర శతకం ఎంచుకున్నా. ‘‘ఒరేయ్... పండితులైన వారికి తగిన గుర్తింపు లేకపోయినా వారి పాండిత్యానికి తక్షణం వచ్చే ఢోకా ఏమీలేదు. ఎలాగంటే... కోతులు చెట్టు కొనకొమ్మన ఉంటే... కింద గండభేరుండాలూ, సింహాలూ ఉంటాయంటాడ్రా కవీ... ఈ పద్యంలో’’ అన్నా. ‘‘అన్నట్టు నాన్నా... సింహాలు భూమ్మీద తిరుగుతుండటం ఓకే... మరి గండభేరుండాలూ పైన ఎగరకుండా భూమ్మీదే తిరుగుతుంటాయని చెప్పడం వింతగా లేదూ’’ అన్నాడు. అంతే... నా కళ్లు బైర్లుగమ్మాయి. ‘‘అంతటి మహాకవీ అవాస్తవం రాశాడంటే నమ్మలేం నాన్నా. ఎంత ఎగిరినా... ఆహారం కోసం కిందికి దిగాల్సిందే కదా. ఆ సంగతి రాసుంటాడు భాస్కర శతకకారుడు’’ అంటూ తన సందేహాన్ని వాడే తీర్చుకుని, నా సందేహాన్నీ తీర్చాడు. ఎవడికి ఉండే తెలివి వాడికి ఉంటుంది. పనిగట్టుకుని బాలమేధావుల్ని చేద్దామనుకుంటే పరిస్థితి ఇలాగే తగలడుతుందని బోధపడిన తత్వంతో వాడి మానాన వాణ్ణి ఎదగనిద్దామని నిశ్చయించుకున్నా. - యాసీన్ -
నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే: టీజీ
కర్నూలు: ‘నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే’ అని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు నగరంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓట్ల కోసం వచ్చే వారు ఏ సేవ చేశారో తెలుసుకోవాలన్నారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయాలను మార్చే శక్తి మీడియాకు లేదన్నారు. ఆ శక్తి ఉంటే తాను ఏనాడో పేపర్, టీవీ చానల్ పెట్టేవాడినని మంత్రి చెప్పారు. -
పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనల రేట్లు పెంపు
న్యూఢిల్లీ: పత్రికల్లో ప్రకటనల రేట్లను మధ్యంతరంగా 19 శాతం పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ ఏడాది అక్టోబర్ 15నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ(డీఏవీపీ) విభాగం పత్రికలకు, ఇతర ప్రచురణ సంస్థలకు విడుదల చేస్తూ ఉం టుంది. వీటికి కొత్త రేట్ల ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. ధరల సవరణ కమిటీ (ఆర్ఎస్సీ) సిఫారసుల మేరకు మూడేళ్లకోసారి కేంద్రం ప్రకట నల రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న ధరల విధానానికి అక్టోబర్ 14తో గడువు తీరింది. అయితే, గడువులోపు 7వ ఆర్ఎస్సీ సిఫారసులు ప్రభుత్వానికి అందలేదు. ఈ లోపు మధ్యంతరంగా ధరలను పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ, ఎలక్షన్ కమిషన్‌ను సం ప్రదించిన అనంతరం సమాచార శాఖ మధ్యంతరంగా ప్రకటనల రేట్లను 19 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్ఎస్సీ సిఫారసులు త్వరలోనే ప్రభుత్వానికి అందుతాయని, అప్పటి వరకూ కొత్త రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. డీఏవీపీ ఏటా రూ.410 కోట్ల మేర ప్రకటనలను ఇస్తుంటుంది.