షాక్‌ తిన్న అనుష్క | Anushka Fire on Bengal News Paper for Fake Interview | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఇంటర్వ్యూపై అనుష్క ఫైర్‌

Published Sat, Mar 10 2018 1:59 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Anushka Fire on Bengal News Paper for Fake Interview  - Sakshi

అనుష్క శర్మ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నటి అనుష్క ఓ బెంగాలీ న్యూస్‌ పత్రికపై మండిపడ్డారు. తాను ఇవ్వకపోయినప్పటికీ.. ఇచ్చినట్లు ఫేక్‌ ఇంటర్వ్యూ ను ప్రచురించినందుకు అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

తాజాగా ఇండియా టైమ్స్‌ కు చెందిన ఇఐ సమయ్‌ అనే బెంగాలీ పత్రిక అనుష్క ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూ ప్రచురించింది. దీనిపై స్పందించిన అనుష్క తాను అసలు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘ఆ కథనం చూసి షాక్‌ తిన్నా. నా వ్యక్తిగత విషయాలు నేను ఎవరితోనూ పంచుకోలేదు. అదంతా అబద్ధం’ అంటూ ఆమె తెలిపారు. 

కోహ్లితో అనుష్క ప్రేమ వ్యవహారం.. వైవాహిక జీవితం... ముఖ్యంగా ఆ మధ్య ఇద్దరు వీరవిహారం చేస్తున్న ఛుంబనంతో దిగిన ఫోటోపై కూడా ఆమె ప్రస్తావించిందంటూ ఆ కథనం పేర్కొంది. అయితే వారిపై లీగల్‌ చర్యలు తీసుకునే ఉద్దేశ్యంపై మాత్రం ఆమె స్పందించలేదు. ప్రస్తుతం ఆమె దర్శకుడు శరత్‌ కఠారియా రూపొందిస్తున్న సూయి ధాగా చిత్రంలో వరణ్‌ ధావన్‌ సరసన నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement