మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం.
నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి)
Comments
Please login to add a commentAdd a comment