Closing
-
లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 33 గ్రీన్‌లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్‌లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
లండన్‌లో వెయ్యేళ్ల మార్కెట్ల మూసివేత!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న రెండు మాంసం దుకాణ వాణిజ్య సముదాయాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. లండన్‌లో 11వ శతాబ్దంలో ఏర్పాటైన బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్ఫీల్డ్ మాంసం మార్కెట్ అతి త్వరలో మూతపడనున్నాయి. ఇన్నాళ్లూ హోల్‌సేల్ మార్కెట్లుగా శాసించిన ఈ రెండు వాణిజ్య సముదాయాలు ఇకపై పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఇక్కడి దుకాణాలను సమీపంలోని డాగెన్హామ్కు తరలించాలని మొదట్లో భావించారు. అయితే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ రెండు మార్కెట్లు ఇకపై ఎక్కడా తమ కార్యకలాపాలను కొనసాగించబోవు. ఇక్కడి దుకాణాల యజమానులకు తగు నష్టపరిహారం, వ్యాపార ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీంతో హోల్‌సేల్ దుకాణదారులు ఇకపై ఎవరికి వారు వేర్వేరుగా వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును త్వరలో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు లండన్ సిటీ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. బిల్లింగ్స్‌గేట్, స్మిత్ఫీల్డ్లోని వ్యాపారులు ఇప్పటికిప్పుడు ఆయా వాణిజ్య సముదాయాలను ఖాళీచేయాల్సిన పనిలేదు. 2028 సంవత్సరందాకా వారికి గడువు ఇచ్చారు. ఆలోపు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకోవాల్సి ఉంటుంది. పాత రోమన్ గోడకు అవతల నిర్మించిన స్మిత్‌ఫీల్డ్‌లో ఆ కాలంలో గుర్రాలు, గొర్రెలు, పశువుల అమ్మకానికి వినియోగించేవారు. తరువాత పూలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీతోపాటు చేపలు, మాంసం అమ్మకాలు మొదలయ్యాయి. వందల ఏళ్లుగా లండన్ నగర చరిత్రకు ఈ మార్కెట్లు సాక్షిగా నిలిచాయి. స్మిత్ఫీల్డ్ భవనాలు విక్టోరియన్ కాలం నాటివి. తర్వాత కొన్ని మార్పులు జరిగినా దాదాపు ఆకాలంనాటిలాగానే ఉన్నాయి. 1958లో ఒక పెద్ద అగ్నిప్రమాదానికి గురైనా చెక్కు చెదరలేదు. స్మిత్‌ఫీల్డ్‌లో వ్యాపారం రాత్రి పదింటికి మొదలై ఉదయం ఆరింటికల్లా ముగుస్తుంది. బిల్లింగ్స్‌గేట్ 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పసిద్ధి చెందింది. శిథిలావస్థకు చేరడంతో మార్కెట్‌ను 1982లో డాక్లాండ్స్కు మార్చారు. ఇప్పుడు బిల్లింగ్స్‌గేట్ స్థలంలో 4,000 కొత్త గృహాలను నిర్మించే ప్రతిపాదన ఉంది. స్మిత్ఫీల్డ్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఇక్కడే కొత్త లండన్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పూర్వం స్మిత్ఫీల్డ్ ప్రాంతం మద్యపానం, రౌడీలతో హింసకు చిరునామాగా ఉండేది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్ స్మిత్ఫీల్డ్ను అప్పట్లో ‘మురికి, బురద’కు కేంద్రస్థానంగా అభివర్ణించారు. ఆయన రాసిన ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ రచనల్లోనూ ఈ మార్కెట్ల ప్రస్తావన ఉంది. -
చార్ధామ్ యాత్ర.. ముగింపు తేదీలివే
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్ధామ్ తలుపులు మూసివేయనున్నారు.సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడున మూసివేయనున్నామన్నారు. అలాగే తుంగనాథ్ ధామ్ తలుపులు నవంబర్ నాలుగున మూసివేయనున్నామని, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామన్నారు. ఈ నాలుగు ధామాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ తేదీలలోపునే రావాలని సత్పాల్ మహరాజ్ కోరారు.ఈ ఏడాది మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చార్ధామ్ దర్శనానికి 37 లక్షల 91 వేల 205 మంది యాత్రికులు రాగా, గత ఏడాది 56.13 లక్షల మంది యాత్రికులు దర్శనానికి వచ్చారు. ఈ సంఖ్య 2022లో 46.29 లక్షలు కాగా 2019లో 34.77 లక్షలు. 2020, 2021లలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చార్ధామ్ యాత్ర అంతంత మాత్రంగానే సాగింది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
దలాల్ స్ట్రీట్.. ఢమాల్! మార్కెట్ల భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్ భారీ నష్టాలను చవి చూశాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ ముగింపు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం రికార్డ్ మార్కులు తాకిన బెంచ్ మార్క్ సూచీలు రోజంతా అదే దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని కోల్పోకుండా అదే మార్క్ వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ 126.38 పాయింట్లు 0.15% పుంజుకుని 81,867.73 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52.85 పాయింట్లు లేదా 0.21% లాభపడి 25,004.00 షెషన్ను ముగించింది.నిఫ్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకున్నాయి. మహీంద్రా&మహీంద్రా, హీరో మోటర్ కార్ప్, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు గరిష్టాలకు చేరువలో సెషన్‌ను ముగించాయి. నిఫ్టీ అయితే 25,000లకు దగ్గరకు వచ్చింది.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 358.93 పాయింట్లు లేదా 0.44% లాభంతో 81,814.33 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.49% లాభపడి 24,978.95 వద్ద ఉన్నాయి.నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, గ్రాసిమ్, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో సెషన్‌ను మొదలు పెట్టిన బెంచ్ మార్క్ సూచీలు అవే లాభాలను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 30.39 పాయింట్లు లేదా 0.037% శాతం లాభంతో 81,363.11 వద్ద, నిఫ్టీ 7.60 పాయింట్లు లేదా 0.031% శాతం పెరిగి 24,842.45 వద్ద ఉన్నాయి.నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఐటీసీ, కొటక్ మహీంద్రా షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీ లాభాలు.. సెన్సెక్స్ రికార్డ్ క్లోజింగ్!
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత పుంజుకుని భారీ లాభాల వైపు పయనించాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు ఎగిసి రికార్డ్ క్లోజింగ్‌ను చూసింది. నిఫ్గీ సైతం 22,200 పాయింట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం సెషన్లో 535.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 73,158.24 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 162.40 పాయింట్లు లేదా 0.74 శాతం పుంజుకుని 22,217.45 వద్ద సెషన్‌ను ముగించింది. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటర్స్, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర, బీపీసీల్, హీరో మోటర్‌కార్ప్ షర్లే నష్టాలను మూటకట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బడ్జెట్ బూస్ట్.. లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు కొద్ది సేపటికే పతాక స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 73 వేల పాయింట్లకు చేరువ కాగా నిఫ్టీ 22 వేల పాయింట్లను దాటింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435.56 పాయింట్లు లేదా 0.61 శాతం పెరిగి 72,080.86 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ 156.35 పాయింట్లు లేదా 0.72 శాతం లాభపడి 21,853.80 వద్ద ముగిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్లు అస్థిరతను ప్రదర్శించాయి. అయితే, బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ సవరణలను శుక్రవారం మార్కెట్లు స్వాగతించినట్లు కనిపిస్తోంది. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించడంతో ఈరోజు (జనవరి 20) దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలను ట్రేడింగ్ కోసం తెరిచారు. దేశీయ స్టాక్ ఎక్ఛేంజీల సూచీలు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో రికార్డు మార్క్‌లను తాకాయి. సెన్సెక్స్ 321.32 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 71,508.18 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 123.45 పాయింట్లు లేదా 0.58 శాతం ఎగిసి 21,585.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. కోల్ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, కొటాక్ మహీంద్ర, ఐసీఐసీ బ్యాంకు షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, మహీంద్ర&మహీంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ షేర్ల నష్టాలను మూటకట్టకుని టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ లాభాల ర్యాలీ కొనసాగింది. గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు అదే జోరును కొనసాగిస్తూ లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 541.60 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 71,728.46 పాయింట్లకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 176.40 పాయింట్లు లేదా 0.82 శాతం ఎగిసి 21,638.65 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్‌మహీంద్ర, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్టాక్‌మార్కెట్ల లాభాల పరుగు.. రికార్డ్ హై!
దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో కొత్త శిఖాలకు చేరాయి. బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, పేర్లతో పాటుగా ఐటీ స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ శుక్రవారం ఈక్విటీ సూచీలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 847 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 72,568 స్థాయి వద్ద ముగిసింది. ట్రేడ్ ముగించే ముందు సెన్సెక్స్ 72,721 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా 247 పాయింట్లు లేదా 1.14 శాతం పెరిగి 21,895 వద్ద ముగిసే ముందు 21,928 వద్ద కొత్త శిఖరాగ్రాన్ని చేరింది. ఈరోజు ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, టెక్‌మహీంద్ర, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్‌ల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక సిప్లా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాబ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ , సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఐటీ మేజర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 63 పాయింట్లు లేదా 0.09 శాతం లాభంతో 71,721.18 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 29 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 21,647.20 పాయింట్ల వద్ద ముగిసింది. హీరో మోటోకార్ప్, బజాబ్ ఆటో, రిలయన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్, విప్రో షేర్లు నష్టాలు మూటగట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఆ షేర్ల నష్టంతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ కంపెనీల షేర్లు నష్టపోవడమే నేటి పతనానికి కారణంగా భావించవచ్చు. నిఫ్టీ 199.70 పాయింట్లు లేదా 0.92 శాతం నష్టంతో 21,511.10 పాయింట్ల వద్ద ముగియగా సెన్సెక్స్ 665.73 పాయింట్లు లేదా 0.92 శాతం నష్టపోయి 71,360.42 పాయింట్ల వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ షేర్లు ఈరోజు టాప్ గెయినర్స్‌గా ఉండగా, యూపీఎల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, బ్రిటానియా షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: స్టాక్‌మార్కెట్ల భారీ పతనం..
Stock market today: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను హై వ్యాల్యూ స్టాక్‌లలో లాభాలను స్వీకరించడానికి ప్రేరేపించడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 536 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 71,356.60 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 148 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 21,517.35 వద్ద స్థిరపడింది. బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఐటీసీ కంపెనీల షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, విప్రో, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూసి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: రికార్డు స్థాయిలకు ఎగిసి.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
కొత్త ఏడాది మొదటి రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సోమవారం సెషన్ ముగింపు సమయంలో బెంచ్‌మార్క్ సూచీలు భారీ స్వింగ్‌లను చవిచూశాయి. ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 72,272 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు లేదా 0.05 శాతం పెరిగి 21,742 వద్ద ముగిసింది. సూచీలు వరుసగా 72,562, 21,834 వద్ద రికార్డు స్థాయిలను తాకాయి. నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు అత్యధిక లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక ఐషర్ మోటర్స్, భారతీ ఎయిర్టెల్, మహీంద్ర&మహీంద్ర, బజాజ్ ఆటో, హిందాల్కో కంపెనీ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. మదుపర్లకు కాసుల వర్షం!
దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం వరుసగా నాలుగో సెషన్లో లాభాలతో ముగిశాయి. వచ్చే సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఊహించిన బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో సానుకూల ధోరణిని పెంపొందించాయి. నిఫ్టీ 213.40 పాయింట్లు లాభపడి 21,654.75 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ కూడా 701.63 పాయింట్లు ఎగిసి 72,038.43 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు సూచీలు తాజా ముగింపు శిఖరాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి లాభంతో డిసెంబరులో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 8 శాతం ఎగబాకాయి. బీఎస్ఈలో లిస్ట్ అయిన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ.358.9 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 361.3 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మదుపర్లు ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల మేర సంపన్నులయ్యారు. ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, లార్సెన్ & టూబ్రో, నెస్లే, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్‌తో సహా 360కి పైగా స్టాక్‌లు బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడ్‌లో తమ తాజా 52 వారాల గరిష్టాలను తాకాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: దేశీయ స్టాక్‌మార్కెట్లు డౌన్.. నష్టాలతో ముగింపు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం మోస్తరు నష్టాలతో ప్రారంభమైన దేశ బెంచ్‌మార్క్ సూచీలు అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఏ మాత్రం పుంజకోలేకపోయాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు లేదా 0.22 శాతం క్షీణించి 64,832 వద్ద సెషన్‌ను ముగించగా, నిఫ్టీ 48 పాయింట్లు లేదా 0.25 శాతం తగ్గి 19,395 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, టైటాన్ కంపెనీ, జేఎస్‌డబ్ల్యు స్టీల్.. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాలు చవిచూశాయి. మరోవైపు, మహీంద్ర అండ్ మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్అండ్టీ షేర్లు కాస్తంత పెరిగి నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
28న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: చంద్ర గ్రహణం సందర్భంగా ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయ నున్నారు. గ్రహణం కార ణంగా ఒక్క రోజు ముందు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 28వ తేదీన సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేయ నున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత 29వ రోజున ఆలయాన్ని వేకువజామునే తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు. -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ భారీ పతనం
Today Stock market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. ఏకంగా 517 పాయింట్లు క్షీణించి 65,601 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 19,553 పాయింట్ల వద్ద ముగిసింది. (ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డాని కన్నుమూత) ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు అశ్విన్ డాని కన్నుమూయడంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి. ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్‌లో లార్సెన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇక టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, దివిస్ ల్యాబ్స్, విప్రో ష్లేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ముగింపు! 20,100 ఎగువకు నిఫ్టీ..
Today StockMarket closing: దలాల్‌స్ట్రీట్‌లో బుల్ పరుగులు కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 67,543 వద్ద ముగియగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20,102 వద్ద ముగిసింది. క్రితం రోజు ఆల్‌టైమ్ హై 20,000 పాయింట్లను దాటిన నిఫ్టీ ఈరోజు మరింత ఎగబాకి 20,100 పాయింట్లను దాటి రికార్డ్ సృష్టించింది. యూపీఎల్, హిందాల్కో, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా సంస్థల నష్టాలను మూటగట్టుకుని లాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల నష్టంతో 64,831 వద్ద.. నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 19,284 వద్ద ట్రేడింగ్ ముగించాయి. కొన్ని బ్యాంకులకు ఫిచ్ క్రెడిట్ రేటింగ్లను సవరించిన తర్వాత బ్యాంకుల షేర్లు సూచీలను దిగువకు లాగాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే స్వల్పంగా పెరిగాయి. ఇదీ చదవండి: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు టాప్ గెయినర్స్ జాబితాలో మారుతి సుజుకీ, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైనాన్, హిందాల్కో కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇక అదానీ ఎంటర్‌ప్రైజస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐచర్ మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు.. కోలుకోని స్టాక్ మార్కెట్లు
Today Stockmarket Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సూచీలు ఈరోజు మరింతగా పతనమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయింది. 65,322 పాయింట్లకు క్షీణించింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 114 పాయింట్ల నష్టంతో 19,428 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండస్ బ్యాంక్, ఎన్టీపీ, దివిస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైనాన్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల బాటలో నడిచాయి. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ భారీ పతనం
Today Stockmarket Closing: ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకోలేక భారీగా పతనమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ భారీగా 307 పాయింట్లు నష్టపోయి 65,688 పాయింట్లకు పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 89 పాయింట్లు క్షీణించి 19,543 పాయింట్ల వద్ద ముగిసింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా కీలక రంగాలు నష్టాలను చవిచూశాయి. ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర, ఐటీసీ, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్ కంపెనీలు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైనాన్, ఓన్జీసీ కంపెనీలు లాభాలను అందకున్నాయి. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు.. తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
Today Stockmarket Closing: నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకుని లాభాల బాటలోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 146 పాయింట్ల లాభంతో 65,993 పాయింట్ల వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 19,632 వద్ద ముగిశాయి. ఈరోజు ప్రధానంగా లాభపడిన కంపెనీలు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటర్స్, మహీంద్ర & మహీంద్ర, టెక్ మహీంద్ర, టాటా స్టీల్. ఇక టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫినాన్స్, మారుతి సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాలతో ముగింపు
Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన సూచీలు.. రిలయన్స్, ఐటీసీ షేర్లు పతనం
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్‌లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్‌లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్‌చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్‌లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్‌వెస్ట్ బ్యాంక్‌కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
రాణి వెడలె.. బై బై బోయింగ్ 747
విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది... 1968, సెప్టెంబర్ 30 అమెరికాలోని వాషింగ్టన్ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్ బోయింగ్ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్ 747ని క్వీన్ ఆఫ్ స్కైస్ అని పిలుస్తారు. 2023, ఫిబ్రవరి 1 55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం ఆకాశానికి రాణిలాంటి బోయింగ్ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్ ఎయిర్‌లైన్స్ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. విమానమే ఒక ఇంద్రభవనం విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్‌కి ముందు, బోయింగ్ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్ 747 ఎదుట ఇతర విమానాలు ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్‌లు, లివింగ్ రూమ్‌లు ఒకటేమిటి ఇదసలువిమానమా, గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు. తయారీ నిలిపివేత ఎందుకు? అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్ బస్ వచ్చిన దాకా బోయింగ్ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్ 747 కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్ సంస్థలు కరువయ్యాయి. యూరప్‌కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్‌బస్ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది. ఏ ఎయిర్‌లైన్స్ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రత్యామ్నాయం ఏంటి ? జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు పడడంతో విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటి విమానం ఇలా..! బోయింగ్ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే, 400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్ 747 ఏకబిగిన 5వేల నాటికన్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ► మొట్టమొదటి విమానాన్ని పాన్ యామ్ సంస్థ జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది. తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది. ► జంబో జెట్‌కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్‌లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది. ► 1990లో తొలిసారిగా బోయింగ్ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంగా మార్చారు. ► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి. ► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు. ► ఎయిర్ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: మూతబడ్డ ‘నోబెల్ శాంతి’ పత్రిక
మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం. నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి) -
స్టాక్ మార్కెట్: వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగింపు
Stock Market Closed Update: దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ట్రేడ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే దలాల్ స్ట్రీట్‌లో గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. గురువారం 60, 045 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. 59, 068 పాయింట్ల కనిష్టానికి టచ్ అయ్యి.. చివరికి 59, 464 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే.. 1.06 శాతం నష్టంతో సెన్సెక్స్ క్లోజ్ అయ్యింది. మంగళ, బుధ వారాల్లో వరుసగా 656, 554 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 17, 921 పాయింట్ల వద్ద గురువారం మొదలై.. ఒకానొక టైంలో 17, 648 పాయింట్లకు చేరి.. చివరికి 17, 757 పాయింట్ల వద్ద ముగిసింది. కిందటి రోజుతో పోలిస్తే.. ఈ పతనం 1.01 శాతం దిగజారింది. భారత ఈక్విటీ మార్కెట్ కీలక సూచీలు పతనం కావడంతో ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ దారుణంగా నష్టపోయాయి. ఐటీ స్టాక్స్ వరుసగా మూడో రోజూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్థాన్ యునిలివర్, డాక్టర్ రెడ్డీ ల్యాబోరేటరీస్, సన్ ఫార్మా నష్టాల సెన్సెక్స్‌లో నష్టాలు చవిచూశాయి. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్ జిల్లా అధికారులు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు సీల్ వేశారు. 22 ఏళ్లుగా ఆందోళన వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. -
విద్యాసంస్థలు వెనకబడితే మూసివేతే!
న్యూఢిల్లీ: సరైన ఫలితాలు సాధించని విద్యాసంస్థల్ని మూసివేయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ వర్గాలు చెప్పాయి. విద్యాసంస్థలు, వర్సిటీల పనితీరు ఆధారంగా అత్యుత్తమం, మెరుగుపడేందుకు అవకాశం ఉన్న, ఆశించిన ఫలితాలు సాధించని సంస్థలుగా వర్గీకరిస్తారని అధికారులు తెలిపారు. మొదట తరగతిలో ఉండే వాటికి మరిన్ని స్వయంపాలన అధికారాలు, నిధులు అందుతాయని, రెండో తరగతిలో సంస్థలకు లోపాల్ని సరిదిద్దుకునేందుకు సలహాలు ఇస్తారన్నారు. మూడో విభాగంలోని సంస్థలు పనితీరు మెరుగుపర్చేందుకు యూజీసీకి మార్గనిర్దేశక బాధ్యతలు అప్పగిస్తామని, పనితీరు మెరుగుపడకపోతే మూసివేయడం లేదా ఇతర విద్యాసంస్థల్లో కలపడం గానీ చేస్తారన్నారు. -
సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలి
సాహితీ శరత్ కౌముది ఉత్సవాల ముగింపు సభలో రేకపల్లి రాజమహేంద్రవరం కల్చరల్ : శిలావిగ్రహాలు పెట్టడం కాదు, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మినరసింహం సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలని అమలాపురానికి చెందిన న్యాయవాది, సాహితీవేత్త, సంగీత విద్వాంసుడు రేకపల్లి శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి డిగ్రీకళాశాలలో బుధవారం జరిగిన సాహితీ శరత్ కౌముది ముగింపు సభలో రేకపల్లి శ్రీనివాసమూర్తి ‘చిలకమర్తి జీవితం–సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. యుగపురుషుడు వీరేశలింగానికి శిష్యపరమాణువునని చిలకమర్తి స్వీయరచనలో చెప్పుకున్నారన్నారు. అయితే, స్వాతంత్య్ర ఉద్యమ బాటలో కందుకూరి నడిచినట్టు కనపడదు.. కానీ చిలకమర్తి నాడు స్వాతంత్య్రపోరాటానికి సమాంతరంగా నడిచిన అన్ని ఉద్యమాల్లోనూ పాల్గొన్నారన్నారు. దేశభక్తి ప్రపూరితమైన రచనలు ఎన్నిటినో చేశారని తెలిపారు. జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ స్వాతంత్య్ర ఉద్యమకాలంలో రాజమహేంద్రవరంలోని నేటి ఫ్రీడం పార్కులో 5 రోజులు ప్రసంగించారని, వాటిని చిలకమర్తి తెలుగు అనువాదం చేసి, ప్రజలకు అందించేవారన్నారు. ప్రసంగాల చివరిరోజున ’భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యాన్ని ఆశువుగా చెప్పారని వివరించారు. కథలు, నాటకాలు, ప్రహసనాలు, జీవితచరిత్రలు..ఇలా ఎన్నో ప్రక్రియల్లో శతాధికంగా చిలకమర్తి రచనలు చేశారన్నారు. తన 40వ ఏట చూపు కోల్పోయినా, మనో నేత్రంతో ప్రపంచాన్ని సందర్శించి రచనలు చేశారన్నారు. మహాత్మునికన్నా ముందే 1907లో నగరంలో రామ్మోహనరావు దళిత పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. అత్యం త సులభభాషలో చిలకమర్తి రచించిన పద్యాలు అందరికీ అర్ధమవుతాయన్నారు. ’కావు’ (కాపాడు), ’కావు’(కాపాడు) అంటూ కాకి దేవుని ప్రార్థిస్తూ నిద్ర లేస్తుందని, ఈ గుణం మనిషికి పట్టుపడలేదని ఆయన ఒక పద్యంలో చమత్కరించారని రేకపల్లి తెలిపారు. స్త్రీవిద్యను ప్రోత్సహించారని, ’ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పించినన్ ’ అని తన పద్యాల్లో తెలిపారన్నారు. సంస్కృతంలో భాసుడు రచించిన 13 నాటకాలను చిలక మర్తి తెలుగులోకి అనువదించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ మాట్లాడుతూ శతాధిక రచనలు చేసిన చిలకమర్తి సొంత ఇంటిని కూడా సమకూర్చుకోలేకపోయారన్నారు. ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచనపోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కోశాధికారి ఫణి నాగేశ్వరరావు ప్రసంగించారు. ముఖ్య వక్త రేకపల్లి శ్రీనివాసమూర్తిని నిర్వాహకులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, సంస్కృత ఉపన్యాసకురాలు కామేశ్వరి పాల్గొన్నారు. -
21 ఇన్‌క్లైన్ బొగ్గు గని మూత!
ఏడు నెలల్లో ముగియనున్న భూగర్భ గని జీవితకాలం బదిలీ భయంతో కార్మికుల ఆందోళన నూతన గని ప్రారంభించాలని డిమాండ్ ఇల్లెందుఅర్బన్: ఇల్లెందు ఏరియాలోని 21 ఇన్‌క్లైన్ భూగర్భ గని జీవితకాలం మరో ఏడు నెలల్లో ముగియనుంది. 2017 మార్చి నాటికి గనిలో ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం గనిలో 497 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గని జీవితకాలం ముగిసేనాటికి సుమారు 60 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. మిగిలిన కార్మికుల్లో మాత్రం బదిలీ భయం పట్టుకుంది. ఏళ్లతరబడి స్థానికంగా పని చేసి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం రెండేళ్ల నుంచి దశలవారీగా బదిలీ చేస్తూ కార్మికుల సంఖ్యను కుదించింది. గని జీవితం కాలం మరికొంత కాలం పెంచాలని, అది సాధ్యపడకపోతే నూతన గనిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు విభాగాలకు ముప్పు 21 ఇన్‌క్లైన్ మూతపడితే సమీపంలోని వర్క్‌షాపు, ఆటోవర్క్షాపు, స్టోర్స్‌లతో పాటు ఏరియా వైద్యశాల తదితర విభాగాలకు ముప్పు వాటిల్లనుంది. గని మూతపడితే ఆయా విభాగాలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో కార్మికుల సంఖ్య 15 మంది కంటే మించిలేరు. మూతపడే నాటికి సగానికిపైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు ఎటు తేలని సొసైటీ అవినీతి గని మరో ఏడు నెలల్లో మూతపడనుందని యాజమాన్యమే చెబుతోంది. రెండేళ్లుగా 21 ఇన్‌క్లైన్ సొసైటీ అవినీతిపై విచారణ జరుగుతోంది. అక్రమార్కులను ఇప్పటివరకు తేల్చలేదు. డిపాజిటర్లకు రావాల్సిన నగదును పూర్తిగా చెల్లించలేకపోయారు. వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. కొందరు అక్రమార్కులు చక్రం తిప్పుతూ గని మూతపడే వరకు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గని మూతపడితే తమ పరిస్థితి ఏమిటని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్కాస్టులే దిక్కు ఇల్లెందు ఏరియాలో ఉన్న ఒకే ఒక్క అండర్ గ్రౌండ్మైన్ మూతపడటంతో కేఓసీ, జేకే–5 ఓసీల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. యాజమాన్యం గని మూతపడిన అనంతరం మెగా ఓసీకి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మూతపడిన గని ప్రదేశాన్ని ఓసీగా మార్పు చేసి ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు. 21 ఇన్‌క్లైన్‌కు చివరి గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరగనున్న ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో 21 ఇన్‌క్లైన్ కార్మికులు ఓటు వేయనున్నారు. మళ్లీ జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి గని మూతపడి ఉంటుంది. మళ్లీ దఫా జరగనున్న ఎన్నికల నాటికి ఇక్కడి కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేయనున్నారు. గని జీవితకాలం పెంచాలి గనిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మూసివేయడం సరికాదు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి మరో నాలుగైదేళ్లు గని జీవితం కాలం పెంచవచ్చు. కార్మికులను బదిలీ చేయొద్దు –కె.సారయ్య, ఏఐటీయూసీ నేత నూతన గనులు ప్రారంభించాలి యాజమాన్యం నూతన గనుల ఏర్పాటు విషయమై ఆలోచించడంలేదు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు గని జీవితకాలాన్ని పెంచడంలో విఫలమయ్యారు. యాజమాన్యం పునరాలోచించి నూతన గనులను ప్రారంభించాలి. –సత్యనారాయణ, హెచ్ఎంఎస్ నేత యాజమాన్యానికి విన్నవించాం ఇల్లెందు ఏరియాలో నూతన గనులు ప్రారంభించాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇల్లెందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. 21ఇన్‌క్లైన్ గని జీవిత కాలం పెంచాలి. కార్మికులను బదిలీ చేయొద్దు. –జగన్నాథం, టీబీజీకేఎస్ నేత -
విద్యార్థులు లేరని బడులు మూస్తుండ్రు
సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట తల్లిదండ్రుల మొర కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన మెదక్ జిల్లాలో బృందం పర్యటన నంగునూరు/సిద్దిపేట రూరల్: ‘పిల్లలు తక్కువగా ఉండటంతో పాఠశాలలు మూసి వేస్తున్నారని సార్లు చెప్పిండ్రు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చేర్పించడంతో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది’ అని సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నా రు. సోమవారం మెదక్‌జిల్లా సిద్దిపేట, నంగునూరు మండలాల్లో అధ్యయన బృందం పర్యటించింది. ఈ బృందంలో అశోక్కుమార్గుప్తా, వెంకటేశ్వర్రావు, శ్రావణ్‌కుమార్, రత్నంలు సభ్యులుగా ఉన్నారు. మొదట ఎన్సాన్పల్లి మదిరలోని తిప్పరబోయిన కాలనీలో బృందం పర్యటించింది. ఇక్కడి పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నంగునూరు మండ లం బాషాగూడెం, సీతారాంపల్లి తండా, హనుమాన్‌నగర్, రాజ్గోపాల్పేటల్లో బృందం పర్యటించింది. స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. పాఠశాలలను ఎప్పటి నుంచి మూసివేశారు.. సమీపంలోని పాఠశాల ఎంత దూరంలో ఉందని ఆరా తీశారు. ఐదారుగురు విద్యార్థులుండటంతో స్కూల్‌ను మూసేస్త్తున్నామంటూ సార్లు చెప్పారని గ్రామసులు బృందం దృష్టికి తీసుకొచ్చారు. బాషాగూడెం లో 6, పక్కీర్ కాలనీలో 5, సీతరాంపల్లి తండాలో 4, హన్మన్నగర్లో ఐదుగురు విద్యార్థులుండటంతో వాటిని మూసేశామని ఎంఈఓ దేశిరెడ్డి బృందానికి తెలిపారు. స్కూళ్లు తెరిస్తే పిల్లలను బడికి పంపిస్తారా అని ప్రశ్నించడంతో టీచర్లను నియమించి స్కూళ్లు తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. బృందం వెంట డీఈఓ నజీమోద్దీన్ తదితరులున్నారు. -
చల్లపల్లి కేంద్రంగా జోరుగా జూదం
బడుగులను చిదిమేస్తున్న నంబర్లాట రోడ్డున పడుతున్న బడుగులు రోజుకు రూ.5 లక్షలకు పైగా చేతులు మారుతున్న వైనం పట్టించుకోని పోలీసులు చల్లపల్లి : నంబర్లాట బడుగుల బతుకులను చిదిమేస్తోంది. ప్రత్యేకించి కాయకష్టం చేసి పొట్టపోసుకొనే వారిని టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ ఆట వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును అరవెరైట్లు పెరుగుతుందన్న ఆశతో సాయంత్రం వేళ ఆటలో పెట్టి, తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు చల్లపల్లికి మాత్రమే పరిమితమైన నంబర్లాట ఇప్పుడు ఘంటసాల, మోపిదేవి మండలాలకు విస్తరించింది. ఇదంతా పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. నంబర్లర్లాట ఇలా.. చల్లపల్లి ప్రాంతంలో నంబర్లాటను బ్రాకెట్ అంటారు. ప్రతిరోజూ ఓ దినపత్రికలో వచ్చే అసోం లాటరీ నంబర్లను ఎంచుకుని ఆట మొద లెడతారు. చివరి రెండు నంబర్లను ఎంచుకున్న వారిని డబుల్డిజిట్ అంటారు. ఈ ఆటలో వారు కోరుకున్న చివరి రెండు నంబర్లు వస్తే.. వారు లాటరీలో పెట్టినప్రతి రూపాయికి రూ.66 చొప్పున (66 రెట్లు) చెల్లిస్తారు. ఓపెనింగ్, క్లోజింగ్‌లో ఒక నంబరును ఎంచుకునే వారిని సింగిల్ డిజిట్ అంటారు. ఈ ఆటలో కోరుకున్న నంబర్లు వచ్చిన వారికి రూపాయికి పదిరూపాయలు మాత్రమే ఇస్తారు. రోజుకు రూ.5లక్షలు చల్లపల్లి కేంద్రంగా జరుగుతున్న నంబర్లాటలో రోజుకు రూ.5లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు తెలిసింది. నలుగురు నిర్వాహకుల పరిధిలో 45 మంది బుక్కర్లు ఉదయం ఏడు గంటలకే ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు 25 నుంచి 60 మంది ఆటగాళ్ల నుంచి నంబర్లు, పందెం డబ్బు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి రూ.5 రూపాయల నుంచి రూ.వెయ్యి వరకూ నంబర్లపై పందెం కాస్తుంటారు. బుక్కర్లు చిన్న కాగితాలపై ఆ నంబర్లను రాసి ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటలకు చల్లపల్లిలోని ఓ నెట్ సెంటర్లో అసోం లాటరీని నెట్లో ఓపెన్‌చేసి నిర్వాహకులు దాని కాపీని తీసుకుంటారు. అనంతరం ఆ లిస్టును బుక్కర్లకిచ్చి ఎంచుకున్న నంబర్లు వచ్చినవారికి ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చేస్తారు. సుమారు 3వేల మంది ఈ ఆటకు బానిసలుగా మారారంటే ఆట ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బలవుతున్న బడుగులు చిరు వ్యాపారులు, ముఠా, దినసరి కూలీలు, రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, షాపుల్లో పనిచేసే వర్కర్లు నంబర్లాట ఎక్కువగా ఆడుతుంటారు. చివరి రెండు నంబర్లు ఎంచుకున్నవారికి 66 రెట్లు సొమ్ము వస్తుండటంతో ఎక్కువ మంది ఆశగా ఈ ఆటనే ఆడుతుంటారు. ఈ ఆట ద్వారా డబ్బు గెలుచుకునేది చాలా తక్కువమంది. డబ్బు పోగొట్టుకున్నవారే అధికం. కొందరైతే పనిచేస్తే వచ్చే డబ్బులు చాలక అప్పులు తెచ్చి ఆటలో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గ్రామాలకు పాకుతోంది.. గతంలో ఈ ఆట చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రమే సాగేది. ప్రస్తుతం మోపిదేవి, ఘంటసాల మండలాకు విస్తరించింది. చల్లపల్లి సెంటర్, నారాయణరావునగర్, పాగోలు, పురిటిగడ్డ, పెదకళ్లేపల్లిరోడ్, సాలిపేట, రామానగరం, లక్ష్మీపురం, యార్లగడ్డరోడ్, పురిటిగడ్డ, నదకుదురు, మోపిదేవి మండలం వెంకటాపురం, కఫ్తానుపాలెం, పెదప్రోలు, ఘంటసాల మండలం కొడాలి, చిట్టూర్పులకు పాకింది. పోలీసుల ప్రోత్సాహంతోనే .. నాలుగేళ్ల క్రితం చల్లపల్లి కేంద్రంగా నంబర్లాట జోరుగా సాగింది. అప్పట్లో పలుమార్లు గొడవలు జరగడం, చాలామంది పేదలు రోడ్డున పడటంతో అప్పటి ఎస్పీ హరికుమార్ తీవ్ర చర్యలు తీసుకోవడంతో రెండేళ్ల పాటు ఈ ఆట కనుమరుగైంది. ఆ తర్వాత చల్లపల్లికి బదిలీపై వచ్చిన ఓ ఎస్.ఐ ఈ ఆటను పునఃప్రారంభించేందుకు ప్రోత్సాహం అందించారు. తద్వారా నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం వీఆర్‌పై ఎస్ఐ బదిలీ అయినప్పటికీ తరువాత వచ్చిన పోలీస్ అధికారులు జోరందకున్న నంబర్లాటను అరికట్టలేక పోయారు. ఇప్పుడు కూడా పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెపుతున్నట్టు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. నంబర్లాటపై పత్రికల్లో, టీవీల్లో వార్తలు రాకుండా చూసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ‘సాక్షి’లో పలుసార్లు నంబర్లాటపై కథనాలు వచ్చినపుడు కొద్దిరోజులు కట్టడి చేసినప్పటికీ తరువాత మళ్లీ మామూలయిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే.. చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే నంబర్లాట జరుగుతున్నప్పటకీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ధానిక సంతబజార్, ప్రధాన సెంటర్లోని పెట్రోల్ బంకు సమీపంలో నిర్వాహకులు యథేచ్చగా నంబర్లాట సాగిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. బడుగుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న నంబర్లాటను అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
నేరస్ధుల సంఖ్య తగ్గిపోతోందోచ్!