దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ , సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్‌లో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఐటీ మేజర్‌లు టీసీఎస్, ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 63 పాయింట్లు లేదా 0.09 శాతం లాభంతో 71,721.18 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 29 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 21,647.20 పాయింట్ల వద్ద ముగిసింది.
హీరో మోటోకార్ప్, బజాబ్ ఆటో, రిలయన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్, విప్రో షేర్లు నష్టాలు మూటగట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment