
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment