Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..
Comments
Please login to add a commentAdd a comment