Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండో సెషన్‌లో ఆరంభంలోనే నష్టాల నెదుర్కొన్న సూచీలు తరువాత మరింత దిగజారాయి. ఒక దశలో నిఫ్టీ 19,450 స్థాయిని కూడా కోల్పోయింది. ఎఫ్‌ఎంసిజి, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పిఎస్‌యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్,హెల్త్‌కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం పతనమైనాయి.
చివరికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 65,226 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 19,436 వద్ద ముగిసాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఐషర్ మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
ఆర్‌బీఐ పాలసీ రివ్యూ మీట్- ఇన్వెస్టర్ల అప్రమత్తత
గ్లోబల్ మార్కెట్ల సంకేతాలకు తోడు ద్రవ్య విధాన ఫలితాల ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC (ద్రవ్య విధాన కమిటీ) సమావేశాలు ప్రారంభమైనాయి. శుక్రవారం (అక్టోబర్ 6) న గవర్నర్ శక్తి కాంత్ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.20తో పోలిస్తే 83.23 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment