దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది.
ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్‌లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్‌లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్‌గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్‌సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment