దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్‌ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్‌లో జోష్ మూడ్‌కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19,400 దిగువకు చేరింది.
సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ , దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలచాయి. యూపీఏ టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లూజర్స్‌గా మిగిలాయి.
క్యూ1 ఫలితాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469 కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది. కానీ ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438 కోట్లకు చేరుకుంది.
రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment