Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు ప్రధానంగా ఇన్ఫోసిస్ , అలాగే రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. ఇటీవల మార్కెట్ భారీగా ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ మార్చి 24 నాటి 57,527 తో పోలిస్తే 67,500 వేలకు ఎగువన ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది.
ఒక్క ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద 234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్‌యూఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
అదరగొట్టిన రిలయన్స్
మరోవైపు రిలయన్స్ నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది.
రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్ మారకంలో భారత కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది
Comments
Please login to add a commentAdd a comment