Today Stockmarket Closing: ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకోలేక భారీగా పతనమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ భారీగా 307 పాయింట్లు నష్టపోయి 65,688 పాయింట్లకు పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 89 పాయింట్లు క్షీణించి 19,543 పాయింట్ల వద్ద ముగిసింది.
అమ్మకాల ఒత్తిడి కారణంగా కీలక రంగాలు నష్టాలను చవిచూశాయి. ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర, ఐటీసీ, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్ కంపెనీలు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైనాన్, ఓన్‌జీసీ కంపెనీలు లాభాలను అందకున్నాయి.
ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment