దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత పుంజుకుని భారీ లాభాల వైపు పయనించాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు ఎగిసి రికార్డ్ క్లోజింగ్‌ను చూసింది. నిఫ్గీ సైతం 22,200 పాయింట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం సెషన్‌లో 535.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 73,158.24 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 162.40 పాయింట్లు లేదా 0.74 శాతం పుంజుకుని 22,217.45 వద్ద సెషన్‌ను ముగించింది.
బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటర్స్, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా ఉండగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర, బీపీసీల్, హీరో మోటర్‌కార్ప్ షర్లే నష్టాలను మూటకట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment